
రాహుల్ ఆదేశంతోనే యువజన కాంగ్రెస్ కార్యకర్తల నిరసన..
సామాజిక మాధ్యమంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను సమర్థించిన కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ
గత వారం జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో కాంగ్రెస్ యువజన విభాగం కార్యకర్తలు చొక్కాలు లేకుండా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. వారంతా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే నడుచుకున్నారని భారతీయ జనతా పార్టీ (BJP) ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌ను ఢిల్లీ కోర్టు ఆదేశాల మేరకు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మంది కార్యకర్తలను అరెస్ట్ అయ్యారు.
బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ రాహుల్ కనుసన్నలో జరిగిన ఈ నిరసన భారత దేశ ప్రతిష్టను దెబ్బతీసిందని ఆరోపించారు. పోలీసు కస్టడీలో చిబ్ తన నిజాన్ని బహిరంగంగా వెల్లడిస్తారని, అసలు లింక్ ఎక్కడినుంచి ఏర్పడిందో బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు.
తనపై వస్తున్న ఆరోపణలపై రాహుల్ గాంధీ X (ముందు Twitter)లో స్పందించారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను సమర్థిస్తూనే..నిరసన తెలపడం హక్కు అని పేర్కొన్నారు. భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం దేశ ప్రయోజనాలకు హాని చేస్తుందన్న విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించిన కార్యకర్తలను అరెస్ట్ చేయడం అన్యాయమని పేర్కొన్నారు.

