
బెంగళూరులో దారుణం.. 70 ఏళ్ల వృద్ధురాలి హత్య..
సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి గుర్తింపు
బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. బంగారు నగల కోసం 70 ఏళ్ల వృద్ధురాలిని గొంతుకోసి హత్య చేశాడు. పోలీసుల కథనం మేరకు.. శోభ, రంగనాథ్ భార్యభర్తలు. బెంగళూరులోని హీరాపూర్ ప్రాంతం కోటే బీడిలో నివాసం ఉంటున్నారు. రంగనాథ్ గత 15 సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితకావడంతో ప్రస్తుతం ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. ఫిజియోథెరపిస్టు రంగనాథ్ రోజూలాగే ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వెళ్లిన రంగనాథ్, రక్తపు మడుగులో పడివున్న శోభను చూసి పోలీసులను సమాచారం ఇచ్చాడు. భర్త మరో మంచంపై కదల్లేని స్థితిలో పడుకుని ఉన్నాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఓ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను ట్రాక్ చేసి, హోల్‌సేల్ దుకాణ యజమాని శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో ఈ హత్య తానే చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడి నుంచి మోటార్ సైకిల్, కత్తి, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన సుమారు 450 గ్రాముల బంగారం, దాదాపు రూ.65 లక్షల విలువైన ఆభరణాలలోంచి కొన్ని నగలను కూడా రికవర్ చేసినట్లు సమాచారం. నిందితుడికి రూ.8 లక్షల అప్పు ఉన్నట్లు విచారణలో తేలింది. రుణ దాతల నుంచి ఒత్తిళ్లు ఎక్కువవడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో బెంగళూరు నగర పరిసర ప్రాంతాల్లో భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. పోలీసులు కేసును నమోదు చేసి, మరిన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

