‘సిలిగురి’ కారిడార్ పై బంగ్లా ఉగ్రవాదుల ‘గురి’
x

‘సిలిగురి’ కారిడార్ పై బంగ్లా ఉగ్రవాదుల ‘గురి’

బెంగాల్ వయా.. అసోం, కేరళ వరకూ చొరబడ్డారని దర్యాప్తు సంస్థల ప్రకటన


ఢాకాలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం భారత్ ను అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నట్లు, ఇందుకోసం కొన్ని ఉగ్రవాద శక్తులను చేరదీసినట్లు ఇటీవల బీఎస్ఎఫ్ కు పట్టుబడిని కొంతమంది అనుమానితులు విచారించగా బయటపడిన విషయం.

ముఖ్యంగా వారి దృష్టి మొత్తం కూడా సిలిగురి కారిడార్ పైనే ఉందని తెలుస్తోంది. భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయడం వారి లక్ష్యమని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఇందుకు బంగ్లాదేశ్ తాజా ప్రభుత్వం అండదండలు అందిస్తోంది. ఇంతకుముందు కూడా బంగ్లాదేశ్ ఖలీదా జియా హయాంలో కూడా దేశాన్ని అస్థిర పరిచే శక్తులకు ఆ దేశం ఆవాసంగా ఉపయోగపడింది.

గడచిన 24 గంటల్లో అరెస్టయిన ఉగ్రవాద అనుమానితులను విచారించగా ఈ దారుణమైన డిజైన్ వెలుగులోకి వచ్చిందని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (దక్షిణ బెంగాల్) సుప్రతిమ్ సర్కార్ శుక్రవారం తెలిపారు. అస్సాం, పశ్చిమ బెంగాల్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ దేశ సరిహద్దు దాటుతున్న ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేయగా వారు ఇచ్చిన సమాచారంతో మరో ఐదుగురు వ్యక్తులను అస్సాంలో, కేరళ లో ఉన్న మరో బంగ్లాదేశ్ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సిలిగురిలో స్లీపర్ సెల్స్ ...
సిలిగురి కారిడార్‌లో స్లీపర్ సెల్స్‌ను ఏర్పాటు చేసి స్థానిక రిక్రూట్‌మెంట్‌లను పకడ్బందీగా నిర్వహించడం ద్వారా విధ్వంసక కార్యకలాపాలను నిర్వహించాలని సర్కార్ ప్లాన్ చేసినట్లు చెప్పారు. బంగ్లాదేశ్ హ్యాండ్లర్లు దేశంలో "మతపరమైన చీలికలు, ఆర్థిక అసమానతలను ఉపయోగించి" యువకులను రిక్రూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని పశ్చిమ బెంగాల్ పోలీసులు తెలిపారు. భారత ఉపఖండంలో అల్-ఖైదా అనుబంధ సంస్థ అయిన అన్సరుల్లా బంగ్లా టీమ్ (ABT) సభ్యుడు Md ఫర్హాన్ ఇస్రాక్ పర్యవేక్షణలో ఈ ప్రణాళిక అమలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
బంగ్లాదేశ్ నెట్‌వర్క్..
ప్రణాళికను అమలు చేయడానికి, ఇస్రాక్ బంగ్లాదేశ్‌లోని రాజ్‌షాహి జిల్లా నివాసి అయిన 32 ఏళ్ల బంగ్లాదేశీ, Md. సద్ రాడి అలియాస్ Md. షబ్ సీక్‌ను భారత్ కు పంపాడు. సద్ రాడి గత నెలలో పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలోని సరిహద్దు ద్వారా భారత్‌లోకి చొరబడ్డాడు.
తన ఉగ్రవాద సంస్థ స్లీపర్ సెల్ కార్యకర్తలను కలవడానికి ముందు బెంగాల్, తరువాత అస్సాం, చివరగా కేరళ ను వెళ్లినట్లు సమాచారం వచ్చింది. అనుమానిత ఉగ్రవాదులు నుంచి లభించిన సమాచారం ప్రకారం వీరు బంగ్లాదేశ్, పాకిస్తాన్ లోని కొన్ని ఉగ్రవాద సంస్థలతో నిరంతరం టచ్ లో ఉన్నట్లు సూచిస్తున్నాయని అస్సాం పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
డీప్ స్టేట్ ప్రమేయం ఉందా?
ఫర్హాన్ ఇస్రాక్ ABT చీఫ్ జాసిముద్దీన్ రహ్మానీకి సన్నిహితుడు కాబట్టి ఈ మొత్తం ప్రణాళికలో బంగ్లాదేశ్ లో తిష్టవేసిన కొన్ని డీప్ స్టేట్ శక్తుల కుట్ర ఉందా అనే అనుమానాన్ని భద్రతా సంస్థలు వెల్లడిస్తున్నాయి.
నోబెల్ శాంతి గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ఏడాది ఆగస్టులో రహ్మానీ పెరోల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. దేశంలో నాస్తికుడిగా పేరున్న రాజీబ్ అనే వ్యక్తిని హత్య చేసినందుకు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అలాంటి కరుడుగట్టిన ఉగ్రవాదీని యూనస్ స్వేచ్ఛగా జైలు నుంచి విడుదల చేశాడు.
స్లీపర్ సెల్స్ సాయంతో దేశంలో జిహాదీ నెట్‌వర్క్‌లను స్థాపించడానికి రహ్మాని గతంలో చేసిన ప్రయత్నాలను ఉటంకిస్తూ రహ్మాని విడుదలపై భద్రతాపరమైన ఆందోళనలను న్యూఢిల్లీ ఇంతకుముందే బంగ్లాదేశ్ ముందు వ్యక్తం చేసింది.
కాశ్మీర్‌పై రహ్మానీ
జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే రహ్మనీ తన నోటీకి పనిచెప్పాడు. జమ్మూ కాశ్మీర్ ను భారత్ నుంచి విడదీయాలని ఇస్లాం మతోన్మాద శక్తులకు బహిరంగంగా నూరిపోయడం ప్రారంభించారు. ఇది కేవలం ప్రచారాని పరిమితం కాలేదని, దేశంలో భారీ విధ్వంసం చేసి కొన్ని కీలక ఆస్తులను ధ్వంసం చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాడని, అందుకోసం స్లీపర్ సెల్ లను రిక్రూట్ చేసుకుంటున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి.
అరెస్టయిన ABT రిక్రూట్‌మెంట్లు దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి పెద్ద కుట్రలో భాగంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి కొనుగోలులో చురుకుగా పాల్గొన్నాయని పోలీసులు తెలిపారు.
దర్యాప్తు ప్రారంభం..
దేశవ్యాప్తంగా ఎంతమంది ఉగ్రవాదులు చొరబడ్డారు.. ఎన్ని గ్రూపులు ఆక్టివేట్ అయ్యాయో తెలుసుకోవడానికి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. బంగ్లాదేశ్ డీప్ స్టేట్ ప్రోత్సహిస్తున్న న్యూఢిల్లీ వ్యతిరేక వైఖరి కేవలం రహ్మనీ మాత్రమే కాదని, ఇంకొన్ని శక్తులు ఉన్నాయని ఓ ఇంటలిజెన్స్ అధికారి తెలిపారు.
యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ఉల్ఫా) చీఫ్ పరేష్ బారుహ్ మరణశిక్షను బంగ్లాదేశ్‌లోని హైకోర్టు బెంచ్ ఈ వారం ప్రారంభంలోకి మార్చడం కేవలం సాధారణ పరిణామం కాదని ఆయన ప్రత్యేకంగా ఎత్తి చూపారు.
ఆయుధాల స్వాధీనం
భారత వ్యతిరేక శక్తుల పట్ల బంగ్లాదేశ్ కొత్త పాలన విధానానికి ఈ పరిణామం సూచన. సాయుధ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి చిట్టగాంగ్‌లోని ప్రత్యేక న్యాయస్థానం జనవరి 2014లో బారువాకు మరణశిక్ష విధించింది.
ఏప్రిల్ 1, 2004న బంగ్లాదేశ్ పోలీసులు 4,930 తుపాకీలు, 27,020 గ్రెనేడ్లు, 840 రాకెట్ లాంచర్లు, 300 రాకెట్లు, 2,000 గ్రెనేడ్ లాంచింగ్ ట్యూబ్‌లు, 6,392 మ్యాగజైన్‌లు, 1.14 మిలియన్లకు పైగా బుల్లెట్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఉల్ఫాను పునరుద్ధరణ?
నిషేధిత ఉల్ఫా బంగ్లాదేశ్‌లో అనేక శిబిరాలను నిర్వహించేది. ఆ తీవ్రవాద సంస్థ అగ్రనాయకులు అందరూ ఆ దేశంలోనే ఉన్నారు. 2009లో షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత బారువాను మినహాయించి ఉన్న నాయకులందరినీ అరెస్టు చేసి భారత అధికారులకు అప్పగించారు. బారుహ్ మయన్మార్ మీదుగా చైనాకు పారిపోయాడు. బరువా బంగ్లాదేశ్‌లో తన నెట్‌వర్క్‌ను తిరిగి పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అస్సాంలోని భద్రతా వర్గాలు తెలిపాయి.



Read More
Next Story