బంగ్లాదేశ్ లో మైనారిటీలపై కొనసాగుతున్న దాడులు, ఇస్కాన్ నాయకుడి అరెస్ట్
x

బంగ్లాదేశ్ లో మైనారిటీలపై కొనసాగుతున్న దాడులు, ఇస్కాన్ నాయకుడి అరెస్ట్

బంగ్లాదేశ్ లో మైనారిటీలపై ద్వేషపూరిత దాడులు కొనసాగుతున్నాయి. హిందూ నాయకుడు ఇస్కాన్ నాయకుడు కృష్ణదాస్ ను బంగ్లా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.


పొరుగు దేశం బంగ్లాదేశ్ లో మైనారిటీల అణచివేత కొనసాగుతోంది. ఇప్పటికే హిందువులపై భౌతిక దాడులు, ఆలయాలపై వివక్ష పాటిస్తున్న ముస్లిం మతోన్మాదులు తాజాగా ఇస్కాన్ సన్యాసి చిన్మోయ్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేసింది. ఢాకా మెట్రోపాలిటన్ పోలీసుల డిటెక్టివ్ బ్రాంచ్ సోమవారం సాయంత్రం ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనను అరెస్టు చేసింది.

ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం, డిటెక్టివ్ బ్రాంచ్ అదనపు కమిషనర్, రెజాల్ కరీమ్ మల్లిక్ ఈ అరెస్ట్ ను ధృవీకరించారు. అయితే ఎందుకు అరెస్ట్ చేశారో వివరాలు మాత్రం అదనపు కమిషనర్ వెల్లడించలేదు. ఈ అరెస్ట్ పై ప్రధాన నగరమైన చిట్టగాంగ్ లో హిందూ మైనారీటీలు భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఛాందసవాదుల దాడులపై గొంతెత్తిన నాయకుడు..
ప్రస్తుతం ఢాకా పోలీసులు అరెస్ట్ చేసిన స్వామి చిన్మోయ్ కృష్ణ దాస్ చిట్టగాంగ్ లోని ఫుండరీక్ ధామ్ కు నాయకత్వం వహిస్తున్నాడు. అలాగే బంగ్లాదేశ్ సనాతన్ జాగచరణ్ మంచా ప్రతినిధి కూడా ఉన్నాడు. ప్రధాన మంత్రి షేక్ హసీనా దేశ విడిచిపెట్టి భారత్ చేరిన తరువాత మైనారిటీలైన హిందువులు, సిక్కులు, క్రిస్టియన్ ల లక్ష్యంగా ముస్లిం మతోన్మాదులు దాడులకు పాల్పడుతున్నారు.
ఆయన మైనారిటీల పక్షాన వారి హక్కుల కోసం వాదించడంలో ముందున్నారు. ఎంచుకున్న లక్ష్యాలపై ద్వేషపూరితంగా జరుగుతున్న దాడులను ఆయన ఖండిస్తున్నారు. బంగ్లాదేశ్ లోని మత వివక్షను వ్యతిరేకిస్తున్నాడు. "తోటి భక్తులపై జరిగిన అఘాయిత్యాలను" ఖండిస్తూ దేశంలో అనేక ర్యాలీలు నిర్వహించాడు. అందుకే ఛాందసవాదుల ప్రభుత్వానికి టార్గెట్ అయ్యాడు.
ఈ అరెస్ట్ పై ఇస్కాన్ ప్రతినిధి రాధారామన్ దాస్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ‌లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఢాకాలోని భారత హైకమిషన్‌ను ట్యాగ్ చేస్తూ.. “ఈ కష్టకాలంలో బంగ్లాదేశ్ మైనారిటీల గొంతుక, నాయకుడు అయిన హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి అరెస్ట్ అనే షాకింగ్ న్యూస్ నాకు ఇప్పుడే అందింది. ఆయనను ఒక గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. దయగల శ్రద్ధ @ihcdhaka @DrSJaishankar #SaveBangladeshiHindus’’ అంటూ రాసుకొచ్చారు.
పశ్చిమ బెంగాల్‌లోని బిజెపి నాయకుడు సువేందు అధికారి కూడా చిన్మోయ్ దాస్ నిర్బంధం గురించి X లో స్పందించారు. “ప్రఖ్యాత ఫైర్‌బ్రాండ్ హిందూ నాయకుడు, శ్రీ చిన్మోయ్ కృష్ణ దాస్ ప్రభుని బంగ్లాదేశ్‌లోని ఢాకా విమానాశ్రయంలో డిటెక్టివ్ బ్రాంచ్ కిడ్నాప్ చేసింది.
బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల మనుగడ & గౌరవం కోసం పోరాటానికి నాయకత్వం వహిస్తున్నాడు. మహ్మద్ యూనస్ 'రాడికల్' పాలన ఏ స్థాయికైనా దిగజారవచ్చని, దాని అధికారానికి అడ్డం వచ్చిన ఎవరినైనా ఏదయిన చేయవచ్చనే బంగ్లాదేశ్ సనాతన సంఘం బయపడుతోంది.
నేను @DrSJaishankar జీ ఈ విషయాన్ని దయచేసి గమనించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. బంగ్లాదేశ్ ప్రభుత్వం అతనిపై దేశద్రోహం కేసు పెట్టింది’’ అని రాసుకొచ్చారు.
బంగ్లాదేశ్‌లో హిందువులు జనాభాలో 8 శాతం ఉన్నారు. బంగ్లాదేశ్‌లోని మైనారిటీల ప్రయోజనాలను కాపాడేందుకు మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తగినంతగా రక్షణ చేయలేదని విమర్శించారు.



Read More
Next Story