బ్యాంకాక్‌లో భూకంపం: కోల్‌కతా, ఇంఫాల్‌లో స్వల్ప ప్రకంపనలు
x

బ్యాంకాక్‌లో భూకంపం: కోల్‌కతా, ఇంఫాల్‌లో స్వల్ప ప్రకంపనలు

నేలకూలిన భవంతులు - ఇప్పటివరకు 20 మంది మృతి


థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై తీవ్రత 7.7గా నమోదైంది. మోనివా నగరానికి 50 కి.మీ దూరంలోని మయన్మార్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకు 20మంది మృతిచెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అనేకమంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ భూకంప ప్రభావం భారత్‌లోని కోల్‌కతా(Kolkata), ఇంఫాల్‌లో కూడా కనిపించింది. అయితే కోల్‌కతా నగరంలో ఆస్తి లేదా ప్రాణ నష్టం సంభవించలేదని అధికారిక సమాచారం. మణిపూర్‌లోని ఇంఫాల్‌(Imphal)లోని తంగల్ బజార్ నివాసితులు భూమి కంపించడంతో భయాందోళనకు లోనై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక్కడ అనేక పాత భవనాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.

Read More
Next Story