
తిరుపతిలో ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడి కిడ్నాప్..
ఇది సినీ హీరో మోహన్ బాబు మద్దతుదారుల పని అంటున్న సిపిఎం
సినీ నటుడు మోహన్ బాబు నిర్వహిస్తున్న యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడానికి మంగళవారం ఉదయం వెళుతున్న sfi నాయకులపై సినీ నటుడు మోహన్ బాబ మద్దతుదారులుగా భావిస్తున్న కొంతమంది దాడి చేశారు. వారిలో కొందరిని కిడ్నాప్ చేశారు.
"ఎస్ఎఫ్ఐ నేతలను కాపాడి, నిందితులను శిక్షించాలని" సీపీఎం నేత కందారపు మురళీ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులను సినీ నటుడు మంచు మోహన్ బాబు మద్దతుదారులు వాహనాల్లో బలవంతంగా ఎక్కించుకుని పోయారని మురళీ ఆరోపించారు. ఈ సంఘటన వివరాలివి.
కిడ్నాప్ కు గురైన sfi జిల్లా కార్యదర్శి అక్బర్
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ రంగంపేటకు సమీపంలో సినీ నటుడు మోహన్ బాబు నిర్వహిస్తున్న (Mbu) యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై గతంలో సాంకేతిక విద్యా మండలి ఏఐసీటీఈ కూడా అక్షింతలు వేసింది.
ధర్నాకు వెళుతున్న గా కిడ్నాప్
మోహన్ బాబు విశ్వవిద్యాలయం (ఎంబీయు) లో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడానికి
ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్ ఎస్ఎఫ్ఐ ఎస్వీ యూనివర్సిటీ నాయకుడు వినోదు కార్యకర్తలతో కలిసి బయలుదేరారు.
తిరుపతి నుంచి తిరుచానూరు మీదుగా వెళితే తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వస్తుంది. ఎస్ఎఫ్ఐ నాయకులు కార్యకర్తలు ఈ మార్గంలో వెళుతుండగానే పెద్ద సంఖ్యలో వాహనాల్లో వచ్చిన 30 మందికి పైగానే మోహన్ బాబు కాలేజీకి మద్దతుదారులుగా భావిస్తున్న వారు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఎస్ఎఫ్ఐ నాయకులు బలవంతంగా వాహనాల వేసుకొని కిడ్నాప్ చేసినట్లు సమాచారం అందింది.
చర్యలు తీసుకోండి
ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను నాయకులను కాపాడాలని cpm రాష్ట్ర నాయకుడు కందార్ మురళి డిమాండ్ చేశారు. మాకు సమాచారం అందిన వెంటనే తిరుపతి అదనపు ఎస్పి రవి మనోహరచారి దృష్టికి తీసుకువెళ్లామని మురళి ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు.
విద్యార్థుల సమస్యలపై ధర్నా చేయడానికి వెళుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులు కార్యకర్తలపై మోహన్ బాబు మద్దతుదారులు దాడులకు పాల్పడడం నీచమైన చర్య అని కందర మురళి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారితోపాటు ఈ సంఘటన వెనుక ఉన్న వారిని కూడా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
సీపీఎం నేత కొద్ది సేపటి కిందట అంటే మధ్యాహ్నం 2.30 గంటలకు ఓ వీడియో విడుదల చేశారు.
"మోహన్ బాబు విశ్వవిద్యాలయంలోని కొందరు కిడ్నాప్ చేసిన ఎస్ఎఫ్ఐ నేతలను నారావారిపల్లె సమీపంలోని ఫాం హౌస్ లో బంధించారు" అని సీపీఎం నేత కందారపు మురళీ ఆరోపించారు. ఈ ఫాం హౌస్ మోహన బాబుకు చెందినదే అని ఆయన తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

