విద్యపై యూజీసీ నిబంధనలు ప్రమాదకరం..
గవర్నర్లకు విస్తృత అధికారాలు ఇవ్వడం రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించడమే
వి వాసంతి దేవీ
భారతీయ ఉన్నత విద్య చాలాకాలంగా అనేక రకాల రుగ్మతలతో కునారిల్లుతోంది. దానికి శస్త్రచికిత్స అవసరమనేది వాస్తవం. అయితే ఇటీవల యూజీసీ ప్రవేశపెట్టిన మార్గదర్శకాల ముసాయిదా దానికి ఉన్న వ్యాధిని పరిష్కరించడానికి బదులు కొత్త విపత్తుకు దారి తీసేలా కనిపిస్తోంది.
కేంద్ర విద్యా మంత్రి ధరేంద్ర ప్రధాన్ ఇటీవల యూజీసీకి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలు కలయికతో కొత్త బిల్లును 2025 ను ప్రవేశపెట్టారు. ఈ నిబంధనలపై రెండు అభ్యంతరాలు ఉన్నాయి. అందులో ఒకటి సమాఖ్య హక్కులకు ముప్పు. రెండోది విశ్వవిద్యాలయాల్లో అన్ని స్థాయిల్లో ప్రమాణాలు క్షీణిస్తాయని భయం.
దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరం..
దక్షిణాది రాష్ట్రాలు ఈ కొత్త బిల్లును వ్యతిరేకించాయి. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకంలో గవర్నర్లకు ఎక్కువ అధికారాన్ని ఇవ్వడానికి ఇందులో అనుమతి ఇవ్వడంపై అవి విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి.
తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలు వీటిని వ్యతిరేకించాయి. ఇవి రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించాయి. కేంద్రం వాటిని అతిక్రమిస్తోందని విమర్శలు గుప్పించాయి.
దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని శాసనసభ ఆమోదించింది. కేంద్రం ప్రవేశపెట్టిన నియమాలను పటిష్టమైన రాష్ట్ర విద్యా వ్యవస్థను బలహీన పరిచే విధంగా ఉందని, విశ్వ విద్యాలయాలను నాశనం చేస్తుందని ఆరోపించింది.
ఈ తీర్మానానికి బీజేపీ మినహ అన్ని రాజకీయ పార్టీలు మద్ధతు ఇచ్చాయి. బీజేపీయేతర రాష్ట్రాలు కూడా తీర్మానాలు చేయాలని స్టాలిన్ కోరారు. కేరళ కూడా ఈ మార్గదర్శకాలను తీవ్రంగా తిరస్కరించింది. రాష్ట్రాల ప్రయోజనాలను రక్షించడానికి ఇతర రాష్ట్రాలతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొంది.
ఛాన్సలర్ల ఆధిపత్యం..
తాజా మార్గదర్శకాల ప్రకారం యూనివర్శిటీల ఛాన్సలర్లను నియమించడానికి ముగ్గురు సభ్యుల కమిటీలను నియమించే అధికారం గవర్నర్ కమ్ ఛాన్సలర్ కు లభిస్తుంది. ఛాన్స్ లర్ నామినీ కూడా ప్యానెల్ కు చైర్ పర్సన్ గా ఉంటారు. దీని వలన ఎంపిక కమిటీ నియామకంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు. కేవలం ప్రేక్షకపాత్రకే అంకితం.
గతంలో ఛాన్సలర్, సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ సిఫార్సు చేసిన ప్యానెల్ నుంచి వైస్ ఛాన్సులర్ ను నియమించే వారు. ఈ కమిటీ కూర్పు సాధారణంగా సంబంధిత విశ్వవిద్యాలయ చట్టంలో నిర్వచించబడుతుంది. దీనికి సంబంధించిన ఏకైక నిబంధన ఏంటంటే.. కమిటీలోని ఒక సభ్యుడిని యూజీసీ చైర్ పర్సన్ నామినేట్ చేయాలి.
ఖర్చు రాష్ట్రాలది.. నియంత్రణ మాత్రం..
కొత్త నియమాల ప్రకారం.. విద్యపై ఆదాయ వ్యయంలో 85 శాతం రాష్ట్రాలు భరిస్తుండగా, కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు దాని అధికారం కేంద్రానికి దఖలు పడుతుంది. అంటే వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారం కేంద్రానికి వెళ్తుంది.
గవర్నర్లు అంటేనే కేంద్రం ప్రతినిధులుగా వ్యవహరిస్తుండటంతో వారి ద్వారా కేంద్రం విశ్వవిద్యాలయాలను నియంత్రించే ప్రమాదం కనిపిస్తోంది. అలాగే విశ్వవిద్యాలయాలు మతతత్వంలోకి మారిపోతాయనే భయం వెంటాడుతోంది.
అర్హత ప్రమాణాలు..
ముసాయిదా మార్గదర్శకాల విశ్వవిద్యాలయాల ప్రాథమిక స్వభావం, పాత్రను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంది. విశ్వవిద్యాలయ వ్యవస్థలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి వైస్ ఛాన్సలర్ల వరకూ దాదాపు ప్రతి పదవికి అర్హతల పేరుతో తగ్గించేస్తున్నారు.
‘‘విభిన్న కలుపుగొలుపుతనాన్ని ప్రొత్సహించడం, విభిన్న ప్రతిభను గుర్తించడం ద్వారా దేశానికి డైనిమిక్ విద్యా వ్యవస్థను నిర్మించబోతున్నాం. దానికి మార్గదర్శనం చేయబోతున్నాం’’ అని కేంద్ర మంత్రి అన్నారు. ఇవి నిజంగానే సాధ్యమవుతాయా?
వైస్ ఛాన్సలర్ల పాత్రకు లోతైన విద్యానైపుణ్యం, ఉన్నత విద్యావ్యవస్థప అవగాహన అవసరం. గతంలో వైస్ ఛాన్సలర్ల పదవికి అభ్యర్థులు విశిష్ట విద్యా వేత్తలుగా ఉండాలి.
కనీసం పది సంవత్సరాల అనుభవం ఒక విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ గా లేదా ప్రముఖ పరిశోధన లేదా విద్యా పరిపాలనా పాత్రంలో విద్యా, నాయకత్వాన్ని ప్రదర్శించే అనుభవం ఉండాలి.
కొత్త ముసాయిదా నిబంధనలలోని అర్హత ప్రమాణాలలో పరిశ్రమ, ప్రజా పరిపాలన, ప్రజా విధానంలో అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు. అందువల్ల విశ్వ విద్యాలయాలు జ్ఞాన అన్వేషణ, జ్ఞాన వ్యాప్తికి కోటలుగా ఉండటం పై తీవ్ర ఆందోళనలు తలెత్తుతున్నాయి.
విద్య కేంద్రీకృతం కాకూడదు..
కొత్త మార్గదర్శకాలు విశ్వ విద్యాలయలలో అధ్యాపక సభ్యులను నియమించడానికి నిబంధనలు కూడా సవరించే అవకాశం ఉంది. ఒక విభాగంలో పోస్ట్ గ్రాడ్యూయెట్ డిగ్రీ ఉన్న వ్యక్తులు నేరుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియామకం కావచ్చు. దీని వల్ల కొన్ని నిబంధనలు రాజీపడే అవకాశం కనిపిస్తోంది.
ఏ దేశంలోనైనా విద్యలో అధికార కేంద్రీకరణ ఆమోదయోగ్యం కాదు. భారత్ వంటి అపారమైన సాంస్కృతిక భాషా, చారిత్రక వైవిధ్యం ఉన్న దేశంలో ఇది క్షమించారానిది. ఆత్మహత్యాసదృశం. కొత్త విద్యా విధానం, 2020 మనం కొలవడానికి ప్రపంచ ప్రమాణాలను నిరంతరం నిలుపుకునే ఉంటుంది.
విద్యాపరంగా అభివృద్ది చెందిన ఏ దేశంలో నైనా విద్య అనేది పాలనా రంగంలో అతి తక్కువ కేంద్రీకృతమై ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కాకుండా స్థానిక ప్రభుత్వాలు కూడా గణనీయమైన అధికారాన్ని కలిగి ఉంటాయి.
ప్రస్తుతం గవర్నర్లకు వైస్ ఛాన్సలర్లకు అధికారాలు ఇవ్వడం ప్రపంచంలోనే అసాధారణమైనవి. ప్రపంచంలోనే అనేక సంస్థలు స్వయం పాలన సంస్థలు, పండితులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, దాతలతో ట్రస్టీలుగా ఏర్పడి వాటిని నడుపుతున్నాయి.
సమాఖ్య హక్కులు..
ప్రస్తుతం సవరించిన మార్గదర్శకాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ అకస్మాత్తుగా జరిగింది కాదు. కానీ చాలాకాలంగా విద్యలో అన్ని అధికారాలను కేంద్రీకరిస్తే దానిని భరించలేని స్థితి ఉంటుంది. జాతీయ విద్యా విధానం 2020 లో ఈ క్షీణతలో ఒక ముఖ్యమైన మలుపు.
కానీ 1977 లో అత్యవసర పరిస్థితి సమయంలో విద్యను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు మార్చడం చాలా దోహదపడింది. నేడు అది కాస్త కేంద్ర జాబితాలోకి ప్రవేశించడంతో అది మరింత దిగజారింది.
రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగా పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకూ విద్యను మొత్తంగా అత్యవసర పరిస్థితికి ముందు ఉన్న రాష్ట్ర జాబితాకు బదిలీ చేయడమే నేటీ జాతీయ ప్రయత్నంగా ఉండాలి.
Next Story