అబ్బబ్బా.. సంక్రాంతికి ఇన్ని లక్షల మంది ఇళ్లకెళ్లారా!
x

అబ్బబ్బా.. సంక్రాంతికి ఇన్ని లక్షల మంది ఇళ్లకెళ్లారా!

ఉచితమైనా ఆర్టీసీకి ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా..


సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరగడంతో ఏపీఎస్‌ఆర్టీసీ ఆదాయంలో చరిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. జనవరి 19న ఒక్కరోజులోనే సంస్థకు రూ.27.68 కోట్ల ఆదాయం లభించినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అదే రోజు మొత్తం 50.6 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపారు.


ఆర్టీసీ చరిత్రలో ఒకే రోజులో ఇంత భారీ ఆదాయం నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ అపూర్వ విజయానికి కారణమైన డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, సూపర్‌వైజర్ల కృషిని గుర్తించిన ఆర్టీసీ ఎండీ, వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Read More
Next Story