గ్రీన్ అమోనియా ఉత్పతికి ఏపీ అనుకూల రాష్ట్రం
x
గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

గ్రీన్ అమోనియా ఉత్పతికి ఏపీ అనుకూల రాష్ట్రం

భవిష్యత్తులో ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీ మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.


సౌర, పవన, జల విద్యుత్, పంప్డ్ స్టోరేజీ లాంటి విద్యుత్ ఉత్పత్తికి గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ఉత్పత్తికి అనుకూలమైన రాష్ట్రం ఏపీ అని పేర్కొన్నారు. కాకినాడలో ఏఎం గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ప్లాంటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ప్రాజెక్టు మన రాష్ట్రంలో ఏర్పాటు కావడం సంతోషకరం అన్నారు.

ఏఎం గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ప్రాజెక్టును ప్రారంభించిన ప్రమోటర్లకు అభినందనలు తెలిపారు. గత ఏడాది గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చామని చెప్పారు. 2027 జూన్ నాటికి 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడించారు. కాకినాడ నుంచి గ్రీన్ అమోనియా జర్మనీకి సరఫరా జరుగుతుందని తెలిపారు.


ఫొటో గ్యాలరీని పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

గతంలో గ్రే అమోనియా తయారీని నాగార్జునా ఫెర్టిలైజర్స్ చేపట్టిందని గుర్తుచేశారు. ఇప్పుడు అదే ప్రాంతంలో గ్రీన్ అమోనియా తయారుచేసి పర్యావరణ హిత ఉత్పత్తులు వస్తాయని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యత సాధించడమే ప్రస్తుత లక్ష్యమని చెప్పారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు జరుగుతున్నాయని వివరించారు.

ఏఎం గ్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్లాంట్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ అమోనియా ఇథనాల్ గ్రీన్ మాలిక్యూల్స్ లాంటి ఉత్పత్తులు వస్తాయని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ గురించి చర్చ వస్తే ప్రపంచ వ్యాప్తంగా కాకినాడ పేరు వినిపిస్తుందని అన్నారు. డీ కార్బనైజేషన్ గురించి అంతా మాట్లాడుతున్నాం కానీ యూరోప్ ఈ రంగంలో ముందుందని తెలిపారు. కాకినాడలోనే 2 గిగావాట్ల సామర్ధ్యం ఉన్న ఎలక్ట్రోలైజర్స్ తయారీకి నిర్ణయించడం అభినందనీయమని చెప్పారు.


ఏపీ క్లీన్ గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ పాలసీ 2024 దేశంలోనే అత్యుత్తమ విధానమని పేర్కొన్నారు. గ్రీన్ అమ్మోనియా ద్వారా ప్రకృతి సేద్యానికి ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పారు. ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల నీటిలో నైట్రోజన్ స్థాయిలు సెలినీటి ఎక్కువ కలిగిన రాష్ట్రంగా ఏపీ ఉందని అన్నారు. గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా దీనిని సరఫరా చేసేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని మెగా ప్రాజెక్టుకు ఇంత వేగంగా శంకుస్థాపన నిర్వహించడం అభినందనీయమని అన్నారు. 2029-30 నాటికి ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యుత్తమంగా మారాలని ఆకాంక్షించారు.

Read More
Next Story