ఏపీని వదలనంటున్న ప్రైవేటు బస్సుల ఘోరాలు
x

ఏపీని వదలనంటున్న ప్రైవేటు బస్సుల ఘోరాలు

సాయి ఆర్కేటీ బస్సుకు మంటలు, సురక్షితంగా బయటపడిన ప్రయాణీకులు


మొన్న కర్నూలు, నిన్న మార్కాపురం.. ఇవాళ రావులపాలెం.. ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనలు జరిగిన ప్రాంతాలు ఇవి.. తాజాగా మరో బస్సు రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళుతూ మంటల్లో చిక్కుకుంది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. రాత్రి 9 గంటల ప్రాంతంలో రావులపాలెం నుంచి బయల్దేరిన ఈ బస్సు విజయవాడ సమీపంలోకి వచ్చే సమయంలో ప్రమాదానికి లోనయింది. నిజానికి పెద్ద ముప్పుతప్పినట్టే భావించాలి.

సాయి ఆర్కెటీ (SAIRKT) ట్రావెల్స్ కి చెందిన బస్సు రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. విజయవాడ బస్టాండ్‌ వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత సమయంలో ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణీకులను బయటకు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 34 మంది వరకు ఉన్నట్టు సమాచారం. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఏసీ షార్ట్ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి బస్సుకు నిప్పు అంటుకున్నట్టు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More
Next Story