PUSHPA 2 | పుష్ప-2 తొలి సమీక్షలు, అల్లు అర్జున్ కి ప్రశంసలు
అమెరికా తదితర ప్రాంతాల్లో సినిమా చూసిన వారు పోస్టు చేసిన వివరాల ప్రకారం తొలి రివ్యూలు సంచలం సృష్టిస్తున్నాయి. చాలా సానుకూలంగా స్పందనలు వస్తున్నాయి.
పుష్ప-2 సినిమా ఇంకా పూర్తిగా అన్ని థియేటర్లలో రిలీజ్ కాక ముందే తొలి రివ్యూలు బయటికి వచ్చాయి. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ నటించిన పుష్ప-2 కోసం కొన్ని వేల మంది ఈ తెల్లవారు జామునుంచే థియేటర్ల వద్ద క్యూ కట్టి ఉన్నారు. అమెరికా తదితర ప్రాంతాల్లో సినిమా చూసిన వారు పోస్టు చేసిన వివరాల ప్రకారం తొలి రివ్యూలు సంచలం సృష్టిస్తున్నాయి. చాలా సానుకూలంగా స్పందనలు వస్తున్నాయి. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ పవర్‌ఫుల్ గా నటించారని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా ప్రివ్యూ షోల నుంచి నెటిజన్లు అందిస్తున్న తొలి సమీక్షలు కూడా చాలా సానుకూలంగా ఉంది. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సీరిస్ లో ఇది రెండోది. మూడో పార్ట్ కూడా ఉందని ఇప్పటికే సుకుమార్ ప్రకటించారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ ప్రపంచంలో ఒక కార్మికుడు ఎదిగిన తీరు, పుష్ప రాజ్ ప్రయాణాన్ని ఈ సినిమా చూపిస్తోంది.
"సుకుమార్ రూపొందించిన ఈ మాస్ కమర్షియల్ టెంప్లేట్‌లో అల్లు అర్జున్ తన మోటు, గ్రామీణ యాస, నటనతో షోని రక్తికట్టించాడు అని ప్రీమియర్ షో చూసిన ఓ ప్రేక్షకుడు తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు.
#Pushpa2TheRule తన నటనకు ప్రశంసలు అందుకుంటున్న #FahadhFaasil అద్భుతంగా సపోర్ట్ ఇచ్చారు. #RashmikaMandanna అవసరమైన మేరకు అద్భుతంగా నటించి సినిమాను రక్తికట్టించారు. మొత్తం మీద సినిమా బాగుంది. మాస్ ఆడియన్స్ మెచ్చుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ప్రత్యేకించి జాతర సీక్వెన్స్ అలరించింది." అంటున్నారు సమీక్షకులు.
ఒక నెటిజన్ ఇలా వ్రాశాడు, "పుష్ప2 ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంది! జపాన్ పోర్ట్‌లో పుష్ప పరిచయ సన్నివేశం, షెకావత్‌తో ముఖాముఖి బాగుంది. రెండు పాటలు దుమ్మురేపాయి అని రాసుకొచ్చారు.
ఈ సినిమా యావరేజ్ అనే వాళ్లూ ఉన్నారు. అయినప్పటికీ చూడొచ్చు అని ఇలాంటి వాళ్లు ముగించారు. "#Pushpa2TheRule ఫస్ట్ హాఫ్ - ఎబోవ్ యావరేజ్ టు గుడ్ ఫర్ ఆల్ - ఇది వన్ మ్యాన్ #AlluArjun షో. నిడివి ఒక లోపంగా ఉందని, ఫహద్‌ఫాసిల్ మళ్లీ అదే ఆవేశంతో తిరిగి నటించారని, ఇది కేవలం కమర్షియల్ ఎలివేషన్ మాత్రమే అని పెదవి విరిచారు మరో ప్రేక్షకుడు.
అల్లు అర్జున్ అభిమానులు మాత్రం పుష్ప-2ని "మెగా-బ్లాక్‌బస్టర్" గా అభివర్ణిస్తున్నారు. అల్లు అర్జున్ నటనను మెచ్చుకుంటున్నారు. అభిమానుల లెక్కలో అర్జున్ ఓ అద్భుతం సృష్టించారు. సినిమా "సూపర్" అని పొగుడుకుంటున్నారు.
ప్రీమియర్ షోల నుంచే అనేక వీడియోలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తొలి భాగంతో పోలిస్తే, దర్శకుడు సుకుమార్ (pushpa 2 director) ‘పుష్ప’ ప్రపంచాన్ని, కథ, మేకింగ్ పరిధినీ పెంచాడు. నేషనల్ కాదు... ఇంటర్నేషనల్.. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నట్టుగానే అన్ని విషయాల్లోనూ పెరిగిన మోతాదు కనిపిస్తుంది. తొలి సినిమాలో అల్లు అర్జున్‌కు ఉన్న మాస్ ఇమేజ్‌నే నమ్ముకుని ఆయన పాత్ర, హీరోయిజంపైనే దృష్టిపెట్టిన సుకుమార్ ఈసారి తానూ ఛార్జ్ తీసుకున్నాడు. కథలో తన మార్క్ సైకలాజికల్ గేమ్‌ని మేళవించే ప్రయత్నం చేశాడు. దాంతో ఈసారి మరింత డ్రామా పండింది. దానికితోడు వైల్డ్ ఫైర్‌లాంటి పుష్పరాజ్ ఉండనే ఉన్నాడు. (Pushpa 2 Review) మరింత బలంగా తీర్చిదిద్దిన ఆ పాత్రపై అల్లు అర్జున్ పూర్తిస్థాయిలో ప్రభావం చూపించాడు. దాంతో ఈ సినిమా అభిమానులకు అసలు సిసలు సంబరమైతే, సాధారణ ప్రేక్షకులకూ ఓ మంచి మాస్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది.
పుష్ప- 2లో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ తమ పాత పేర్లతోనే పుష్ప రాజ్, శ్రీవల్లి, భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలను తిరిగి పోషించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రపంచంలోని ఆధిపత్య పోరాటాలపై దృష్టి సారించిన పుష్ప మొదటి భాగం సినిమాలో తన నటనకు అల్లు అర్జున్ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.
ఓవరాల్‌గా 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్‌తో ప్రారంభమైంది.
Next Story