లాడ్జిలో AIIMS డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం
x

లాడ్జిలో AIIMS డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం

తల్లి, ఐదేళ్ల చిన్నారి మృతి చెందగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉంది.


పల్నాడు జిల్లా నరసరావుపేటలోని దినేష్ గ్రాండ్ లాడ్జి లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో తల్లి, ఐదేళ్ల కుమార్తె ప్రాణాలు కోల్పోగా.. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. మరో మూడేళ్ల చిన్నారి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

ఘటన వివరాలు
పోలీసుల సమాచారం ప్రకారం, గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన గోపి, శంకర కుమారి దంపతులు భోపాల్ ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. భర్త గోపి అక్కడ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తుండగా, భార్య శంకర కుమారి నర్సుగా పనిచేస్తున్నారు. వీరికి ఐదేళ్ల మౌనిక, మరో మూడేళ్ల కుమార్తె ఉన్నారు. నిన్న రాత్రి భోపాల్ నుంచి నరసరావుపేట చేరుకున్న వీరు, రైల్వే స్టేషన్ సమీపంలోని దినేష్ గ్రాండ్ లాడ్జిలో గది తీసుకున్నారు.
మత్తు ఇంజెక్షన్లతో అగాయిత్యం?
గది నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా.. శంకర కుమారి, చిన్నారి మౌనిక అప్పటికే మృతి చెంది ఉన్నారు. గోపి అపస్మారక స్థితిలో పడి ఉండటంతో వెంటనే ఆయనను నరసరావుపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. దంపతులు ఇద్దరూ వైద్య వృత్తిలో ఉన్నవారు కావడంతో, అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్లు (Anesthesia/Sedatives) ఇచ్చుకుని ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
కారణాలపై పోలీసుల ఆరా
మంచి హోదాలో ఉండి, విదేశీ స్థాయి సౌకర్యాలున్న ఎయిమ్స్ వంటి సంస్థలో పనిచేస్తున్న ఈ దంపతులు ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది మిస్టరీగా మారింది. కుటుంబ కలహాలా? లేక ఆర్థికపరమైన ఇబ్బందులా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.
Read More
Next Story