వివాదాస్పద ఎండోమెంట్స్ అధికారి శాంతి ఇంట్లో ఏమైనా దొరికాయా?
x
ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతి

వివాదాస్పద ఎండోమెంట్స్ అధికారి శాంతి ఇంట్లో ఏమైనా దొరికాయా?

ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో ఆ అధికారి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు..


పలు వివాదాల్లో చిక్కుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతి ఇంటిపై ఏసీబీ అధికారులు ఇవాళ దాడులు జరిపారు. దాదాపు ఆరు గంటలు సోదాలు జరిగినట్టు సమాచారం. ఆమె ఇంటితో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాలోని పలువురి ఇళ్లపైనా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు.

తాడేపల్లిలో నివాసం ఉంటున్న ఎండోమెంట్‌ అసిస్టెంట్ కమిషనర్ కలిగిరి శాంతికి రెండు మూడు ఇళ్లు ఉన్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. ఆమె నివాసంలో ఏసీబీ బృందాలు పలు కీలక పత్రాలు, ఆస్తుల వివరాలను పరిశీలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. విజయవాడ, తాడేపల్లిలోని శాంతికి చెందిన మూడు ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పలుకుబడితో ఆమె ఈ పదవిని అలంకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అదే సందర్భంలో వచ్చిన ఆరోపణలను వారు ఇరువురూ కూడా ఖండించారు. ఇప్పుడు ఆమె ఇళ్లపై ఏసీబీ దాడులు జరుపుతోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణపై ఈ దాడులు చేస్తున్నట్టు సమాచారం.
Read More
Next Story