టైమ్ మ్యాగజైన్ లో భారత మహిళా రెజ్లర్ కు చోటు..
x

టైమ్ మ్యాగజైన్ లో భారత మహిళా రెజ్లర్ కు చోటు..

ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ లో భారత మహిళా రెజ్లర్ కు చోటు దక్కింది. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బ్రిజ్ భూషణ్ సింగ్ ను పదవి నుంచి తప్పించి..


టైమ్ మ్యాగజైన్ 2024లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో ఒలింపిక్ పతక విజేత భారత రెజ్లర్ సాక్షి మాలిక్ చోటు దక్కించుకుంది.

మహిళా రెజ్లింగ్‌లో దేశం తరఫున తొలి పతకం సాధించింది సాక్షి మాలిక్. కొన్ని సంవత్సరాలుగా మహిళా రెజ్లర్‌లపై డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపుకలు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సాక్షి మాలిక్ వీధి పోరాటాలు చేస్తోంది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను పదవి నుంచి తొలగించి చట్టపరంగా శిక్షించాల్సిందిగా ఆమె అలుపెరగని పోరాటం చేసినందుకు ఈ జాబితాలో చోటు దక్కించుకుంది.
రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత వినేష్ ఫోగట్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత బజరంగ్ పునియాతో కలిసి సాక్షి జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలకు నాయకత్వం వహించింది. దేశంలోని మహిళా రెజర్లను బెదిరించి, లైంగికంగా వేధించినందుకు బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలని వీరు డిమాండ్ చేశారు.
గత ఏడాది జనవరిలో ప్రారంభమైన నిరసన, ఇటూ భారత దేశంతో పాటు, ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ నిరసనలు దాదాపు సంవత్సరం పాటు జరిగాయి. అయితే ఈ ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ సింగ్ ఖండించాడు. కొంతమంది ఆరోపణలు చేసిన తేదీల్లో సింగ్ అసలు ఇండియాలోనే లేనట్లు తరువాత నిరూపణ అయింది.
"ఈ పోరాటం ఇకపై భారత మహిళా మల్లయోధుల కోసం మాత్రమే కాదు, దేశ కుమార్తెల కోసం " అని సాక్షి చెప్పింది. బ్రిజ్ భూషణ్ సింగ్ తన పదవిని వదులుకున్న కొద్దికాలానికే, అతని సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి సంజయ్ సింగ్ WFI అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్‌ఐ బాధ్యతలు చేపట్టిన రోజునే సాక్షి క్రీడకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుంది.
ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇతర భారతీయుల్లో నటి అలియా భట్, ఇండో-బ్రిటీష్ నటుడు దేవ్ పటేల్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఉన్నారు.
Read More
Next Story