
పశ్చిమ బెంగాల్‌లో భూకంపం
రిక్టార్ స్కేల్‌పై 5.5గా నమోదు-ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
పశ్చిమ బెంగాల్‌లో శుక్రవారం 10 సెకన్లపాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.5గా నమోదైంది. కోల్‌కతా, సాల్ట్‌లేక్, నబన్నా ప్రాంతాల్లో మధ్యాహ్నం 1:22 గంటలకు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని సమాచారం. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భూకంప కేంద్రం బంగ్లాదేశ్‌లో ఉందని భారత వాతావరణ విభాగం (IMD) అధికారులు గుర్తించారు.
Next Story

