అయ్యో.. పెళ్లికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారే!
x
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పోలీసు అధికారులు

అయ్యో.. పెళ్లికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారే!

తుంగభద్ర నదిలో మునిగి నలుగురు ప్రాణాలు పొగొట్టుకున్నారు..


ఊరుగాని ఊరు.. పెళ్లికి వచ్చారు. సంతోషంగా గడిపారు. ఊరి పక్కనే తుంగభద్ర నది ప్రవహిస్తున్నట్టు తెలిసింది. సరదాగా ఈత కొడదామనుకున్నారు. అనుకున్నదే తడువుగా నదిలో ఈతకు దిగారు. ఊరితో పాటు నది కూడా కొత్తదే కావడంతో ఎక్కడ ఏముంటుందో తెలియక నీటి మడుగులో మునిగిపోయారు. నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన కర్నూలు జిల్లా కొసిగి మండలం కందుకూరు వద్ద జరిగింది. పెళ్లింట విషాదం నెలకొంది.
అసలేం జరిగిందంటే..

కోసిగి మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో దాసరి ఆదిశేషు పెళ్లి గురువారం ఘనంగా జరిగింది. చుట్టుపక్కల బంధువులు, దూరపుబంధువులు గ్రామస్తులతో పెళ్లి మండపం కళకళలాడింది. పెళ్లి అనంతరం శుక్రవారం కందుకూరు గ్రామ సమీపాన ఉన్న ( ఆర్డీఎస్ ) రాజోలి బండ డైవర్షన్స్ స్కీమ్ వద్ద పెళ్ళికి వచ్చిన కర్ణాటక వాసులు బంధువులతో కలిసి బట్టలు ఉతికేందుకు వెళ్లారు. సరదాగా ఈత కొడదామంటూ కట్టనుంచి దిగువకు 100 మీటర్ల దూరంలో ఉన్న నీటిమడుగులో దిగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చుట్టుపక్కల చూసినవారు గ్రామస్తులు తెలిపారు. నదిలో గత రెండు, మూడు నెలలుగా నీరు లేకపోవడంతో తుంగభద్ర నది కళావిహీనంగా మారింది.

మూడు రోజుల క్రితం తుంగభద్ర డ్యామ్ నుంచి దిగువకు నీరు వదలడంతో ఆర్డీఎస్ ఆనకట్టపై నుంచి ఒకటిన్నర అడుగు నీరు ప్రవహిస్తుంది. నీటి ఉధృతి ఎక్కువ కావటంతో గమనించలేకపోయిన వీళ్లు.. ఈత కొడుతూ ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగిపోయారు.

ఈ ప్రమాదంలో మరణించిన వారి వివరాలు

దాసరి ఉమావతి @ సంగీత, వయస్సు సుమారు 28ఏళ్లు

దాసరి రత్నమ్మ, వయస్సు సుమారు 26ఏళ్లు

దాసరి శివానంద, వయస్సు సుమారు 20ఏళ్లు

. దాసరి మహంతేష్, వయస్సు సుమారు 20ఏళ్లు ఏళ్లు ఉన్నట్లు తెలిసింది.

మృతులు కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కురిడి గ్రామనికి చెందినవారుగా గుర్తించారు. నీటిలో మునిగిపోయిన వారిని చుట్టుపక్కల గ్రామస్తులు శవాలను తీసి ఆనకట్ట ఒడ్డుకు చేర్చారు. సంఘటన స్థలానికి డి.ఎస్.పి భార్గవి , సిఐ మంజునాథ్ , ఎస్సై రమేష్ రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చనిపోయిన మృతదేహలను పరిశీలించి అక్కడి నుంచి పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.

తుంగభద్ర నదిలో నలుగురు మృతి చెందిన వార్తను తెలుసుకొని మంత్రాలయం టిడిపి ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి మృతదేహాలను పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మృతుని కుటుంబాలను ఆదుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ ఘటనతో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లికి వచ్చి ప్రాణాలు పొగొట్టుకున్నారే అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు హుటాహుటిన ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లారు.

Read More
Next Story