ట్రంప్ ఆర్డర్ పై కోర్టును ఆశ్రయించిన 22 రాష్ట్రాలు
జన్మ పౌరసత్వాన్ని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్దమని వ్యాఖ్య
జన్మతహ పౌరసత్వం( బర్త్ రైట్ ) సిటిజన్ షిప్ అని అమలులో ఉన్న శతాబ్ధాల నాటి ఇమ్మిగ్రేషన్ పద్దతిని ముగించడానికి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 22 అమెరికన్ రాష్ట్రాల అటార్నీ జనరల్ లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తను ప్రచారంలో చెప్పినట్లుగా కార్యనిర్వహాక ఉత్తర్వులు జారీ చేశారు. అందులో సుమారు 700 పదాలతో బర్త్ రైట్ రద్దు చేస్తూ ఆయన ఆర్డర్ జారీ చేశారు. దీని ప్రకారం అమెరికాలో ఎవరైన జన్మిస్తే వారికి సిటిజన్ షిప్ లభించదు. దానికి అనేక నిబంధనలు అమల్లోకి తెచ్చారు. అయితే ఈ విధానంపై సుదీర్ఘ న్యాయపోరాటం జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఉత్తర్వూలు ఎంతవరకూ కోర్టులు అంగీకరిస్తున్నాయో చూడాలి.
డెమోక్రాటిక్ అటార్నీ జనరల్, వలస హక్కులు, జన్మహక్కు పౌరసత్వం స్థిరపడిన చట్టమని, అధ్యక్షులకు విస్తృత అధికారం ఉన్నప్పటికీ వారే సుప్రీంకాదని చెప్పారు. ప్రెసిడెంట్ పెన్ స్ట్రోక్ 14 వ సవరణను కాలరాయలేరని న్యూజెర్సీ అటార్నీ జనరల్ మాట్ ప్లాట్ కిన్ అన్నారు. అయితే కోర్టులో వ్యాజ్యాలు ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నామని వైట్ హౌజ్ పేర్కొంది. ఇది వామపక్షాల ప్రతిఘటన మాత్రమే అని పేర్కొంది.
వేగంగా మార్పులు..
ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వూలను వేగవంతంగా అమలు చేయాడానికి కసరత్తులు చేస్తున్నారు. కార్యనిర్వహాక అధికారులను ఉపయోగించి ఇష్టానుసారంగా ఉన్నతాధికారులను తొలగిస్తున్నారు. మంగళవారం డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీని రీకాల్ చేయడానికి ఆదేశం జారీ చేశారు. అలాగే ట్రాన్స్ పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ కోస్ట్ గార్డ్ ఉన్నతాధికారులను ఇలాగే విధుల నుంచి తప్పించారు. అలాగే ఏవియేషన్ సెక్యూరిటీ అడ్వైజరీ గ్రూప్ లోని సభ్యులందరినీ తొలగించారు.
ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేస్తున్న అధికారులు, ఇప్పుడూ పాఠశాలలు, చర్చిల వంటి సున్నితమైన ప్రదేశాలలో కూడా అక్రమ వలసదారులు ఉంటే అరెస్ట్ చేయడానికి వీలుగా ఉత్తర్వూలు జారీ చేసింది.
Next Story