
ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోల లొంగిబాటు
భారీ డంప్‌ను కనుగొన్న ప్రత్యేక బలగాలు.
నక్సలిజం నిర్మూలనకు కేంద్ర బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. జన జీవన స్రవంతి కలిసిపోవాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం 108 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయారు. వీరిపై సుమారు రూ.3.95 కోట్ల రివార్డు ఉందని అధికారులు తెలిపారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన బీజాపూర్ నుంచి 37 మంది, దంతేవాడలో 30 మంది, సుక్మాలో 18 మంది, బస్తర్లో 16 మంది, నారాయణపూర్లో నలుగురు, కాంకేర్లో ముగ్గురు మావోయిస్టులు ప్రభుత్వ ప్రత్యేక బలగాల ముందు ఆయుధాలను అప్పగించారని వారు తెలిపారు.
లొంగిపోయిన గెరిల్లాలలో ఆరుగురు డివిజనల్ కమాండర్లు ఉన్నారని, వీరిలో ఒక్కొక్కరిపై రూ. లక్షల రివార్డు ఉంటుందని అధికారులు తెలిపారు. భద్రతా దళాలు భారీ ఆయుధాల డంప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాయి. దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా పారద్రోలేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్చి 31, 2026 ను డెడ్‌లైన్‌గా పెట్టుకున్నారు.

