క్రైస్తవ మతంలోకి మారితే SC హోదా రద్దు
x

క్రైస్తవ మతంలోకి మారితే SC హోదా రద్దు

గుంటూరు జిల్లా పాస్టర్ వేసిన పిటీషన్ కొట్టి వేసిన సుప్రీం కోర్టు


దళితులు క్రైస్తవంలోకి మారితే, షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. హిందూ, బౌద్ధం,శిక్ మతాలలో మాత్రమే ఎస్ సి హోదా ఉంటుందని, క్రైస్తవంలోకి మారితే ఆ హోదా పోతుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ల ధర్మాసనం సంచలన తీర్పు చెప్పింది.

ఇలా క్రైస్తవంలోకి మారిన వారు షెడ్యూల్డ్ కులాల, తెగల అత్యాచారాల చట్టం (Scheduled Castes and Scheduled Tribes (Prevention of Atrocities) Act (SC/ST Act) లోని అంశాలను వినియోగించుకునే హక్కు కోల్పోతారని కూడా న్యాయమూర్తులు చెప్పారు.


"No person who professes a religion other than Hindu, Sikh or Buddhist shall be a member of Scheduled Caste. Conversion to any other religion results in loss of Scheduled Caste status,అని కోర్టు చెప్పింది.

క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావులేదని, కాబట్టి అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసే హక్కు ఉండదని కోర్టు స్పష్టంచేసింది. తహశీల్దార్ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ, మత మార్పిడి తర్వాత ఆ రక్షణ పొందేందుకు అర్హత ఉండదని ధర్మాసనం చెప్పింది.

1950లో వచ్చిన షెడ్యల్డ్ కులాలకు చెందిన రాజ్యాంగ ఉత్తర్వులు Constitution (Scheduled Caste) Order, 1950) ఈ విషయంలో చాలా స్పష్టంగా నిషేధం విధించిందని, అది తిరుగులేనిదని సుప్రీంకోర్టు కోర్టు పేర్కొంది.

ఈ ఉత్తర్వులోని 3 అధికరణం ప్రకారం, పుట్టుకతో సంబంధం లేకుండా, క్రైస్తవం లోకి మారిన దళితులు వెంటనే షెడ్యూల్డ్ కులాల హోదా కోల్పోతారుని సుప్రీం కోర్టు వివరించింది.

2025 మే నెలలో ఈ మేరకు వచ్చిన హైకోర్టు తీర్పు ను సవాల్ చేస్తూ ఆంధ్రప్దదేశ్ గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంకు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ పిటిషన్ విచారించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

తనకు అక్కాల రామిరెడ్డితో పలువురు వ్యక్తులుకుల వివక్ష, వేధింపులను ఎదుర్కుంటున్నానని, వారిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసులు దాని ఆధారంగా ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ ఐ ఆర్ ను కొట్టి వేయాలని రామిరెడ్డి కేసును కొట్టివేయాలని అమరావతి హైకోర్టును ఆశ్రయించారు. ఆనంద్ క్రైస్తవ మతంలోకి మారడంతో తన ఎస్సీ హోదాను కోల్పోయాడని, అందువల్ల ఎస్సీ/ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేడని పేర్కొంటూ హైకోర్టు జస్టిస్ ఎన్ హరినాథ్ బెంచ్ ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసింది. ఎస్సీ సర్టిఫికేట్ ఉండటం అతని కేసుకు సహాయపడదని, ఎందుకంటే కుల భేదాలు లేని క్రైస్తవ మతంలోకి మారడంతో ఎస్సీ హోదా పోయిందని కోర్టు పేర్కొంది.

అనంతరం ఆనంద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది.

Read More
Next Story