పుష్ప -2 పై బాయ్ కాట్ ఎఫెక్ట్ ఉండబోతోందా?
x

'పుష్ప -2' పై బాయ్ కాట్ ఎఫెక్ట్ ఉండబోతోందా?

సెలబ్రిటీలు ముఖ్యంగా సినిమా స్టార్స్ వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పనిని ఫ్యాన్స్ గమనిస్తుంటారు. సోషల్ మీడియాలో డిస్కషన్ పెడుతుంటారు.

సెలబ్రిటీలు ముఖ్యంగా సినిమా స్టార్స్ వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పనిని ఫ్యాన్స్ గమనిస్తుంటారు. సోషల్ మీడియాలో డిస్కషన్ పెడుతుంటారు. తమకై తాము నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అవి చిలికి ,చిలికి గాలి వాన అయ్యినట్లుగా ఒక్కోసారి పెద్ద చర్చకు దారితీస్తూ ఉంటాయి. ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పనిపై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే అయిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కి మద్దతు తెలిపేందుకు నంద్యాల వెళ్లారు. సతీసమేతంగా నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్.. వైసీపీ అభ్యర్థి చేయి పట్టుకుని మరీ మద్దతు ప్రకటించారు. అది పవన్ కళ్యాణ్ అభిమానులను హర్ట్ చేసింది.

వేరే ఎవరో చేస్తే పట్టించుకోక పోదురు కానీ మెగా క్యాంప్ కు చెందిన అల్లు అర్జున్ చేయడం వారు తట్టుకోలేకపోయారు. అప్పటి నుంచి వారు అల్లు అర్జున్ పై తమ నిరసనను బహిరంగంగా ప్రకటిస్తూనే ఉన్నారు. నాగబాబు ట్వీట్ కూడా అప్పట్లో దానికి ఊతం ఇచ్చింది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా టాలీవుడ్ ఎవరి తాత సొత్తు కాదంటూ చేసిన వ్యాఖ్యలు అల్లు ఫ్యామిలీని ఉద్దేశించినవే అన్న ఊహాగానాలకు తెరలేపాయి. ఇదే సమయంలో మెగా కాంపౌండ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌, నాగబాబు కుమార్తె నిహారిక… తమ ఎక్స్‌ ఖాతాలో అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేశారు.

ఇదిలా ఉంటే ఆ మధ్యన ఈ వివాదాల మధ్యన అల్లు అర్జున్‌పై పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చిందా..? అనే సందేహం వచ్చేలా బెంగళూరు పర్యటనలో పవన్‌ పుష్ప సినిమాను టార్గెట్‌ చేస్తూ చేసిన విమర్శలు టాలీవుడ్‌లో సంచలనం సృష్టించాయి. గత కొంతకాలంగా మెగా, అల్లు ఫ్యామిలీ ల మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో పవన్‌ చేసిన వ్యాఖ్యలతో ఆ ప్రచారం నిజమేనని నమ్మాల్సి వస్తోందనే ప్రచారం మొదలైంది.

ఎన్నికల్లో హండ్రడ్‌ పర్సంట్‌ స్ట్రైక్‌ రేట్‌తో విక్టరీ కొట్టిన పవన్‌.. మెగాస్టార్‌ చిరంజీవి ఇంటికి వెళ్లగా కుటుంబ సభ్యులు అపూర్వ స్వాగతం పలికారు. ఆ సమయంలోనూ అల్లు కుటుంబం కనిపించకపోవడంతో విభేదాలు మరింత తీవ్రమైనట్లు చెప్పుకున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని పవన్‌ తొలిసారిగా పుష్ప సినిమా ఇతివృత్తాన్నే టార్గెట్‌ చేస్తున్నట్లు విమర్శలు చేయడం సంచలనమైంది.

ఈ వరుస సంఘటనలతో అల్లు ఫ్యామిలీతో మెగా కాంపౌండ్‌కి గ్యాప్‌ వచ్చిందనే టాక్‌ తీవ్రమైంది.అయితే ఆ సంఘటన జరిగి చాలా నెలలు అయిపోయాయి. ఎవరి పనుల్లో వారు పడ్డారు. కానీ పవన్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మాత్రం చల్లారలేదు.సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు పుష్ప2 ని బాయ్ కాట్ చేస్తామని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నిప్పుకు ఆజ్యం పోస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప . భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా గుర్తింపును అందించింది. అంతేకాదు ఈ సినిమా సీక్వెల్ పుష్ప -2 త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ చేస్తున్న వ్యాఖ్యలను మెగా అభిమానులు తప్పుపడుతూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.

పుష్ప 2 చిత్రం రిలీజ్ దగ్గర అవుతున్న ఈ సమయంలో కొందరు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న బాయ్ కాట్ పుష్ప 2 అనే ఇంపాక్ట్ ఏ విధంగా నెగిటివ్ రిజల్ట్ ఇస్తుందనే చర్చ మొదలైంది. ఓపినింగ్స్ పై తెలుగు రాష్ట్రాల్లో,ఓవర్ సీస్ లో ఈ ప్రభావం ఉండబోతోందా అని లెక్కలు వేస్తున్నారు. ఎందుకంటే మెగాభిమానులు, పవన్ అభిమానులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మొదటి రోజు అందరూ చూస్తేనే ఓపినింగ్స్ అదిరిపోతాయి. అలాగే పుష్ప 2 రిలీజ్ రోజు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వకుండా చూడాలి. అయితే బాయ్ కాట్ కాల్ పెద్దగా ఇంపాక్ట్ చూపకపోవచ్చు అనే మాట సైతం వినపడుతోంది. అల్లు అర్జున్ సినిమాగా మాత్రమే కాకుండా సుకుమార్ సినిమాగానూ పుష్ప 2 ను చూస్తున్నారనేది నిజం.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తాజాగా బాలకృష్ణ సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాప్ బుల్ విత్ ఎన్బీకే లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ లో బన్నీ ఎన్నో విషయాలను పంచుకున్నారు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో తన స్నేహితులు, మిగతా హీరోస్ గురించి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. బాలయ్య పవన్ కళ్యాణ్ చూపించగా.. ఆయన ధైర్యం అంటే చాలా ఇష్టమని అన్నారు బన్నీ.

సొసైటీలో చాలా మంది లీడర్స్, బిజినెస్ పీపుల్స్ చూశానని.. కానీ తన జీవితంలో దగ్గర్నుంచి పవన్ కళ్యాణ్ ను చూశానని.. చాలా డేరింగ్ పర్సన్ కళ్యాణ్ గారు అని అన్నారు. దీంతో అల్లు అర్జున్ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. కొన్ని రోజులుగా పవన్, అల్లు అర్జున్ గురించి అనేక రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ఇప్పుడు అన్ స్టాప్ బుల్ వేదికగా క్లారిటీ ఇచ్చారు బన్నీ అని చాలామంది అన్నారు. మరి మెగా ఫ్యాన్స్ ఇప్పటికైనా శాంతిస్తారా లేదా అనేది చూడాలి.

Read More
Next Story