
కష్టాల్లో పూజా హెగ్డే...
ఫ్లాప్స్ తర్వాత ‘ప్లాన్ బి’... అదిరిందా?
సినిమా ప్రపంచంలో సక్సెస్‌లు తాత్కాలికం… ఫెయిల్యూర్స్ సాధారణం. కానీ — వాటి మధ్య నిలబడి, పడిపోకుండా చూసుకోవటం,పడితే అంతే బలంగా లేవటం మాత్రం అసాధారణం. ఒక్కోసారి కెరీర్‌ను కొనసాగించేందుకు కేవలం టాలెంట్ చాలదు… టైమింగ్, స్ట్రాటజీ, దిశ అన్నీ మళ్లీ డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పనిలో ఉంది పూజా హెగ్డే.
ఒక సమయంలో గ్లామర్ ఐకాన్‌గా తెలుగు తెరపై వెలిగిన ఆమె, వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ‘గ్లామర్’ అనే కవచాన్ని పక్కకు పెట్టి… పెర్ఫార్మెన్స్ అనే ఆయుధంతో మళ్లీ స్క్రీన్ పై వెలగాలని సిద్ధమవుతోంది. ఇది యాదృచ్ఛిక మార్పు కాదు – పూర్తిగా ప్లాన్ చేసిన "రీబూట్".ఇప్పుడీ అసాధారణ ప్రయత్నంలోనే ఉంది పూజా హెగ్డే… స్క్రీన్‌పైన తన బ్రైట్‌ను తిరిగి వెలిగించేందుకు ఒక కొత్త గేమ్ ప్లాన్‌తో! అదేంటో చూద్దాం.
తెలుగు తెరపై కొంతకాలం పాటు గ్లామర్ క్వీన్‌గా రాజ్యమేలిన పూజా హెగ్డే… ఇటీవల మాత్రం వరుస పరాజయాలతో కెరీర్‌ని మళ్లీ రీలాంచ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. "అల వైకుంఠపురములో", "మహర్షి", "అరవింద సమేత" లాంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో టాప్ గేర్‌లో నడిచిన పూజా… కొంతకాలంగా వరుసగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్‌ను ఎదుర్కొంటోంది.
"రాధే శ్యామ్", "ఆచార్య", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్" వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో నిలవకపోవడంతో… పూజా కెరీర్‌కి ఓ బ్రేక్ పడినట్టయింది. బాలీవుడ్‌లోనూ ఆమె పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు గేమ్ మార్చాల్సిన టైం వచ్చింది. కానీ పూజా ప్లాన్ సింపుల్ కాదు... స్మార్ట్!
"గ్లామర్ కాదు... గ్రిప్ కావాలి!" – కొత్త గేమ్ ప్లాన్
తన రీలాంచ్ కోసం తమిళ పరిశ్రమను ఎంచుకుంది. తమిళ పరిశ్రమలో తాను ఎప్పటికీ ఒక అపరిచితురాలిని కాదనే విషయంలో పూజాకు స్పష్టంగా తెలుసు. ఆమె రీసెంట్ తమిళ చిత్రం Retro (సూర్యతో) ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, తనకు కోలీవుడ్‌లో ఓ సెట్ ఆఫ్ మార్కెట్ ఉందనే విషయాన్ని గ్రహించింది.
ఈ నేపధ్యంలో, తలపతి విజయ్‌తో నటించిన Jana Nayagan పూర్తయ్యింది. ఇది 2026 జనవరి 9న విడుదల కానుంది. ఈ సినిమా పూజకు గేమ్ ఛేంజర్ కావచ్చు.
D54 – ధనుష్ సినిమాతో పూజ రీ-ఇమేజ్?
ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ – ధనుష్ తదుపరి చిత్రం (#D54) లో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు పొలిటికల్ ఎమోషనల్ డ్రామా జానర్ ఉన్నట్లు సమాచారం. దర్శకుడు – విఘ్నేశ్ రాజా.
ధనుష్ ఇప్పటికే తెలుగు (కుబేరా), హిందీ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి, మళ్లీ తమిళ్ సెంట్రిక్ కథలపై దృష్టిపెడుతున్నాడు. ఇదే సందర్భంలో #D54 సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
ఎందుకు పూజానే?
* పాన్-ఇండియా మార్కెట్ – ఆమెకు తెలుగులో, తమిళంలో, హిందీలో, కన్నడంలో మినిమమ్ మార్కెట్ ఉంది
* డేట్స్ అందుబాటులో ఉన్నాయి
* రెమ్యునరేషన్‌కు ఫ్లెక్సిబుల్
* మరీ ముఖ్యంగా – ఇప్పుడు గ్లామర్ పాత్రలకంటే కంటెంట్ బేస్డ్ పాత్రలపై ఫోకస్
Career Timeline – బౌన్స్‌బ్యాక్ దిశగా
2017–2020 – Telugu Blockbusters ఎరా
గ్లామర్, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో స్టార్‌డమ్ సాధించింది. అల్లు అర్జున్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ వంటి స్టార్‌లతో హిట్స్.
2021–2023 – Flop Phase & Bollywood Mismatch
సరైన కంటెంట్ లేకపోవడం, తెలుగులో అవకాశాలు తగ్గిపోవటం, బాలీవుడ్ లో ఫెయిల్యూర్స్ పలకరించటం
2024–2026 – Tamil Comeback Strategy
Retro → Jana Nayagan → # D54
పూజ లేసెస్ట్ గేమ్ ప్లాన్
తనుకు ఇన్నాళ్లూ గ్లామర్ ఓరియెంటెండ్ కథలే వస్తున్నాయి. తమిళం నుంచి అయితే తన పాత్రను హై కు తీసుకువెళ్లి తన నటనకు స్కోప్ ఉండే పాత్రలు వస్తాయనే ఆశ. అందుకే తన పాత్ర నచ్చితే ఎంత తక్కువ ఇచ్చినా చేస్తానని చెప్పి మరీ తమిళంలో వేషాలు పట్టుకునే పనిలో ఉందిట.
రివైవల్ ట్రై (2024-2026): తమిళంలో ప్రూవ్ చేసుకుని ఇటు తెలుగులోకి రావాలని నిర్ణయించుకుంది. తలపతి విజయ్, ధనుష్ లాంటి స్టార్ హీరోలతో నటించడం ఈ ప్లాన్‌లో భాగమే.
ఫైనల్ గ్లిమ్ప్స
పూజా హెగ్డే కు ఇది డ్రై స్టేజ్. తమిళంలో స్ట్రాంగ్ బ్యాక్ తీసుకురావాలంటే Jana Nayagan, #D54 వంటి సినిమాలు హిట్ అవ్వాల్సిందే. ఆపై మళ్లీ తెలుగు మార్కెట్‌లో తిరిగి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమె ప్లాన్ క్లియర్ — గ్లామర్ తో కాదు, పర్ఫార్మెన్స్‌తో తిరిగి వెలిగిపోవాలని ! పూజా హెగ్డే ఈసారి తను ప్లే చేయబోయే పాత్రల ద్వారా – నటనను రీడిఫైన్ చేయాలనుకుంటోంది. డెఫ్త్ వున్న కథలతో తాను వేరే లెవెల్‌లో రీ-ఎంట్రీ ఇవ్వాలనుకుంటోంది.
"స్టార్‌గా సింహాసనం కోల్పోవచ్చు… కానీ నటిగా అయితే ఎప్పుడూ గేమ్‌లో ఉండవచ్చు!" – పూజా ఈ విషయాన్నే నమ్ముతోంది! 2026లో… పూజా రీబ్రాండెడ్ వర్షన్!