టికెట్ రేట్ పెంపు భారతీయుడు 2కు కలిసొస్తుందా?
భారతీయుడు సినిమా టికెట్ ధరలు పెంచడానికి తెలంగాణ సర్కార్ ఓకే చెప్పింది. దీని వల్ల సినిమాకు లాభముంటుందా? నష్టమే ఎక్కువని అంతా అంటున్నారు. ఎందుకో..
భారీ సినిమాలకు రేట్లు పెంపు, ఎక్స్‌స్ట్రా షోలు, బెనిఫిట్ షోలకు ప్రభుత్వాన్ని పర్మిషన్ అడగటం షరా మూమూలే. ప్రభుత్వాలకు కూడా ఇది రెగ్యులర్‌గా జరిగే తతంగమే. దాంతో లాంఛనంగా అప్లికేషన్ చూసి ఫర్మిషన్స్ ఇచ్చేస్తూంటారు. రీసెంట్‌గా ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రేట్లు పెంపుకు, ఎక్స్‌స్ట్రా షోలకు ఫర్మిషన్ ఇచ్చింది. దాని నిమిత్తం నిర్మాత బాగానే బెనిఫిట్ పొందారు. అయితే అన్ని సినిమాలకు వాళ్ళు పర్మిషన్ అడగరు. ఎందుకంటే ప్రతీదానికి ఓ లెక్క ఉంటుంది. ఓ రేంజి బజ్ ఉంటేనే ఇలాంటివన్నీ వర్కవుట్ అవుతాయి. ఇదంతా ఎందుకు అంటే...భారతీయుడు 2 చిత్రం మరికొద్ది గంటల్లో రిలీజ్ కానుంది. దానికి సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఇక్కడే పెద్ద డౌట్ వస్తోంది.
అదేంటంటే ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో బజ్ లేదు. సరైన ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం లేదు. అలాంటప్పుడు ఈ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచడం ద్వారా కొంతమంది ప్రేక్షకులను దూరం చేసుకోవడం తప్పించి ప్రత్యేకంగా ఒరిగేముంటుంది. గతంలో ఇలా రేట్లు పెంచిన సినిమాలు సరైన బజ్ లేక దాంతో ఓపినింగ్స్ లేక మొదటి రోజే చతికిలపడ్డాయి. ఈ సినిమాకు అలా జరుగుతుందని కాదు..కీడెంచి మేలెంచమన్నారు కదా. అలాగే ఇప్పుడు ఈ సినిమాకు స్పెషల్ షోలు వేసినా హిట్ టాక్ వస్తే తప్పించి కలిసొచ్చేదేమీ లేదు. కల్కి మాదిరిగా సినిమా ఎలా ఉన్నా చూసేద్దామని వీకెండ్ మొత్తం సీట్లు ఫీల్ అయ్యే పరిస్థితి ఈ సినిమాకు కనపడటం లేదు. బెనిఫిట్ షోలు అయితే ఇక్కడ కష్టమే.
ఇక ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) సినిమా టికెట్ ధరల పెంపు విషయానికి వస్తే ...సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 75 పెంచుకునేందుకు వీలు కల్పించింది. సినిమా విడుదలకానున్న రోజు (శుక్రవారం) నుంచి ఈ నెల 19 వరకు ధరల పెంపునకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారంపాటు ఐదో షోకూ అనుమతి ఇచ్చింది. సినిమా ప్రారంభానికి ముందు.. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై ప్రకటనలు ప్రదర్శించాలనే షరతు పెట్టింది.
భారతీయుడు 2 చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శంకర్ డైరెక్షన్‌లో 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్ కావడం విశేషం. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సేనాపతి పాత్రలో కమల్ హాసన్ కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటించారు.