ట్రేడ్ టాక్:  బాక్సాఫీస్ దేవతగా మారిన రష్మిక – హీరోలు చేతులెత్తేశారు!
x

ట్రేడ్ టాక్: బాక్సాఫీస్ దేవతగా మారిన రష్మిక – హీరోలు చేతులెత్తేశారు!

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇటీవల ఒక సంచలన నిర్ణయం తీసుకుంది

ఈ వారాంతం తెలుగు బాక్సాఫీస్‌ మీద చిన్న సినిమాల రిలీజ్‌లు వరదలా సాగాయి. కానీ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగింది ఒక్క సినిమా అది.. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మాత్రమే. గొప్ప రివ్యూలు రాకపోయినా, అర్జున్ రెడ్డికు ఫిమేల్ వెర్షన్ అనే విమర్శలు వచ్చినా, ఓపినింగ్స్,అలాగే స్టడీగా మల్టిప్లెక్స్ లు, ఏ సెంటర్స్ లో కలెక్షన్స్ కనపడ్డాయి. అందుకు కారణం రష్మిక మందన్నానే అంటోంది ట్రేడ్. ఆమె తన స్టార్ పవర్ తో మరోసారి బాక్సాఫీస్‌ను కాపాడిందని చెప్పాలి.

The Girlfriend – రష్మిక ఫ్యాక్టర్ వర్కవుట్ అయ్యింది!

విమర్శకుల మిశ్రమ స్పందన వచ్చినా, పబ్లిక్‌లో ఈ సినిమా మీద హైప్ ని రష్మిక ఒక్కరే , పడిపోకండా నిలబెట్టింది. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు సాధారణంగా ఓ మాదిరి ఓపెనింగ్స్‌ కూడా తీసుకురావడం కష్టమే. కానీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా వీకెండ్‌లోనే రూ.10 కోట్ల గ్రాస్‌ దాటింది.

కలెక్షన్స్:

ఇండియా నెట్: ₹6.85 కోట్లు

USA: $375k

టోటల్ WW గ్రాస్: ₹10.5 కోట్లు

వర్డిక్ట్: Decent

ఎందుకు వర్క్ అయ్యింది?

రష్మిక ఇమేజ్ & సోషల్ మీడియా కనెక్ట్

ఎమోషనల్ డ్రామా & మోడ్రన్ రిలేషన్ థీమ్

యూత్ ఆడియన్స్‌కి రిలేటబుల్ న్యారేటివ్

The Great Pre-Wedding Show – మంచి టాక్, కానీ జనం లేరు!

తిరువీర్ ఈసారి ఫన్ తో కూడిన మంచి కాన్సెప్ట్‌తో వచ్చాడు. మూవీకి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చినా, అది బాక్సాఫీస్‌గా మారలేదు. థియేటర్లలో టాక్ ఉన్నా ట్రేడ్‌లో కలెక్షన్‌లు మాత్రం సైలెంట్‌. ఇది టీమ్ కు కన్ఫూజన్ గా మారింది. సినిమా బాగుందని అంటున్నారు చూసిన వాళ్ళు. అయితే ఆ చూసేవాళ్లే కరువు అయ్యారు. తిరువీర్ స్టార్ పవర్ లేకపోవటంతో డీసెంట్ ఓపినింగ్స్ ని రాబట్టలేకపోయింది.

కలెక్షన్స్:

ఇండియా నెట్: ₹1.5 కోట్లు

USA: $60k

టోటల్ WW గ్రాస్: ₹2 కోట్లు

వర్డిక్ట్: Low Opening

ఎందుకు ఫెయిల్ అయ్యింది?

హీరోకి లిమిటెడ్ మార్కెట్ రీచ్

మల్టీప్లెక్స్‌లలో సీట్ ఫిల్లింగ్ తక్కువ

ఎమోషన్ ఉన్నా, బజ్ సరిగ్గా బిల్డ్ కాలేదు

జటాధర – స్టార్డమ్ కాపాడలేకపోయిన సుధీర్ బాబు!

సుధీర్ బాబు – సోనాక్షి సిన్హా కాంబినేషన్‌పై కొంత ఆసక్తి ఉన్నా, సినిమా ఎక్కడో ప్రేక్షకుడుకి కనెక్ట్ కాకపోయింది. హాలీవుడ్ లుక్ ఉన్నా, హృదయానికి తాకే కంటెంట్ లేకపోవడం పెద్ద నష్టం అయ్యింది. సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

కలెక్షన్స్:

ఇండియా నెట్: ₹3.13 కోట్లు

USA: $10k

టోటల్ WW గ్రాస్: ₹3.25 కోట్లు

వర్డిక్ట్: Flop

ఎందుకు దెబ్బ తిన్నది?

ప్రమోషన్‌లో హీరో ఎనర్జీ కనిపించలేదు

ట్రైలర్ టోన్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉండటం

సోనాక్షి డెబ్యూ అయినా, ఆమె రోల్ లిమిటెడ్‌గా ఉండటం

డబ్బింగ్ సినిమాలు – ఎవరికీ పట్టలేదు!

‘ఆర్యాన్’, ‘ప్రేమిస్తున్నా’, ‘కృష్ణలీలా’ లాంటి చిన్న సినిమాలు థియేటర్లకు వచ్చి వెళ్లిపోయాయి. కంటెంట్ లేదా కాస్టింగ్ రెండూ ఆకట్టుకోకపోవడంతో ఎవరూ ఆసక్తి చూపలేదు.

ఫైనల్ అనాలసిస్:

ఈ వీకెండ్ రిపోర్ట్ ఒక విషయం స్పష్టంగా చెబుతోంది —

స్టార్ పవర్ ఇంకా వర్క్ అవుతోంది, కానీ అందుకు తగ్గ కంటెంట్ లేకపోతే లైఫ్ షార్ట్.

కొన్ని ఇంట్రస్టింగ్ థీమ్స్‌కి మంచి టాక్ రావొచ్చు కానీ రీచ్ రాబట్టాలంటే ఫేస్ వాల్యూ కూడా కావాలి.

రష్మిక తేల్చేసింది – ఎమోషన్, స్టైల్, స్టార్ ఫ్యాక్టర్ కలిస్తే చిన్న సినిమాలకూ పెద్ద కలెక్షన్ సాధ్యమని.

సుధీర్ బాబు మాత్రం మళ్లీ ఆలోచించాల్సిందే — "మాస్ కనెక్ట్ లేకుండా సినిమాలు ఎందుకు పనికిరావని?"

Read More
Next Story