
“లోక: Chapter 1” ఎలా ఇండియన్ సినిమా రూల్స్ మార్చేస్తోంది?!”
స్టార్ పవర్ కాదు…స్టోరీ పవర్
ప్రపంచ సినిమా పరిశ్రమ ఇప్పుడు ఒక రీసెట్ మోడ్‌లో ఉంది. మార్వెల్, DC లాంటి బిలియన్-డాలర్ ఫ్రాంచైజ్‌లు వరుసగా బాక్సాఫీస్ వద్ద జారిపడుతున్నాయి. స్టార్ పవర్ + CGI స్పెక్టాకిల్ మాత్రమే ఇక ఆడియన్స్‌ను ఆకట్టుకోలేవు అని ఇవి ప్రూవ్ చేస్తున్నాయి. గ్లోబుల్ వైపుకు ప్రయాణిస్తున్న భారతీయ మార్కెట్‌లో కూడా ఇదే పరిస్థితి. వందల కోట్ల బడ్జెట్‌తో వచ్చిన పాన్-ఇండియా సినిమాలు, రెండో వారం కల్లా బతకడం కష్టంగా మారింది.
ఇలాంటి క్రైసిస్ సమయంలో, ఎవరు ఊహించని ఒక చిన్న ఇండస్ట్రీ – మలయాళం – ఒక అద్భుతం సృష్టించింది. అది లోక: Chapter 1. కేవలం 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తీసిన ఒక ఫీమేల్ లెడ్ సూపర్‌హీరో ఫాంటసీ , అది కూడా ఫోక్‌లోర్, మైథాలజీ రూట్స్‌తో. ఇది కేవలం హిట్ కావడమే కాదు – భారతీయ సినీ మార్కెట్ మొత్తానికి బిజినెస్ టెంప్లేట్గా నిలుస్తోంది. కేవలం హిట్ కాదు – ఇది ఒక కాన్వర్సేషన్ ఛేంజర్.
మారుతున్న గ్లోబల్ ట్రెండ్స్
ప్రేక్షకులు ఇప్పుడు గ్లోబల్ యూనివర్సల్ ఎమోషన్స్ కోరుకుంటున్నారు, కాపీ-పేస్ట్ CGI యుద్ధాలు కాదు. కొరియన్ సినిమా Parasite చూపించింది. లోకల్ కథలు, లోకల్ రూట్స్ ఉన్నప్పుడు అవే వరల్డ్-లెవెల్ కనెక్ట్ అవుతాయి. అదే ఫార్ములా లోక కూడా రిపీట్ చేసింది – కేరళ పురాణాలు, యక్షిని లెజండ్స్ నుంచి తీసుకుని ఆధునిక సూపర్‌హీరో ఫాంటసీగా మార్చింది.
బడ్జెట్ చిన్నది – లాభం మహా పెద్దది
మలయాళ ఇండస్ట్రీకి 30 కోట్ల బడ్జెట్ కూడా పెద్దదే. అదే సినిమాతో 200 కోట్ల వరకూ వసూలు అవ్వడం అంటే ఆరు రెట్లు రిటర్న్. పెద్ద స్టార్ మార్కెట్‌పై ఆధారపడని ఒక “రిస్క్ మోడల్” కూడా లాభదాయకమని ప్రూవ్ చేసింది. 30 కోట్లు ఇన్వెస్ట్‌మెంట్‌తో, 200+ కోట్లు రాబడే ప్రాజెక్ట్ అంటే ROI (Return on Investment) లెసన్‌గా మారింది. తెలుగులోనూ ఈ సినిమా మంచి లాభాలనే తెచ్చిపెడుతోంది. ఇప్పుడు బాలీవుడ్ కూడా గమనిస్తోంది – “పాన్-ఇండియా” అనే బలవంతపు ట్యాగ్ కంటే, ఆర్గానిక్ పాన్-వరల్డ్ రీచ్ అవటమే భవిష్యత్తు.
ఒకప్పుడు “మాస్ హీరో ఎంట్రీ” కోసం థియేటర్‌కి వెళ్లిన ఆడియన్స్, ఇప్పుడు “మాస్ స్టోరీ ఎంట్రీ” కోసం వస్తున్నారు. లోక కేస్ స్టడీ చెబుతోంది – కంటెంట్ రూటెడ్‌గా ఉంటే, అది బోర్డర్‌లను దాటేస్తుంది.
స్టోరీనే సూపర్‌హీరో!
“No screenplay is ever finished, only abandoned.” – Paul Schrader
ఇందుకు లోక బాగా సరిపోతుంది. ఎందుకంటే కథలోని రూట్స్ ఎక్కడ ముగుస్తాయో అనిపించగానే, అక్కడి నుంచి కొత్త మైథాలిజీ, కొత్త కాంప్లిక్ట్ లేయర్స్ పుట్టుకొస్తాయి. చంద్ర (కల్యాణి ప్రియదర్శన్) అంటే ఒక మిథ్ ఫిగర్ – కల్లియంకట్టు నీలి. సైన్స్ కాదు, జానపదం + హిస్టరీ. ఇదే ఒరిజినాలిటిని తీసుకువచ్చింది.
Marvelలో “Peter Parker gets bitten by a spider.”
కానీ లోకలో “Chandra gets bitten by history itself.”
వరల్డ్ బిల్డింగ్ – బడ్జెట్ కంటే విజన్
₹30 కోట్లు మాత్రమే ఖర్చయినా, లోకహ్ లో చూపించిన విజువల్ యాంబియెన్స్ ఒక Netflix Global Original స్టాండర్డ్స్ రేంజ్‌లో ఉంది. బెంగళూరు నేరో స్ట్రీట్ లలో నియోన్ షేడ్స్, యానిమేషన్ సీక్వెన్స్ లు, జానపదం ఆధారంగా సెటప్ చేసిన యాక్షన్ బీట్స్ –ఈ ఛాయిస్ లే వరల్డ్ బిల్డింగ్ కు అధెంసిటీని తెచ్చాయి. గమనిస్తే ఇక్కడ ఫ్రాంచైజ్ ని ఫోర్స్ చేయలేదు. కానీ Moothon network, Chathan siblings లాంటి hints futureకి anticipationని బిల్డ్ చేశాయి.
కాన్ఫ్లిక్ట్ – విలన్ కూడా హీరోగా!
నాచయిప్ప పాత్ర (శాండీ) ఒక స్టైయిట్ విలన్ కాదు. ఆయన కూడా యక్షణిలా అవడం వల్ల, monster vs monster conflict వచ్చింది.
ఇది బాక్స్‌ఆఫీస్‌కి కొత్త థ్రిల్ ఇచ్చింది.
ఇక్కడ ఆడియన్స్ కి క్లారిటీ కాదు – క్యూరియాసిటీ వస్తుంది: వీళ్లలో అసలు ఎవరు ఎక్కువ డేంజరస్? యక్షిణి అయిన చంద్ర సొసైటికి థ్రెట్ అవుతుందా లేక ప్రొటెక్టర్ అవుతుందా?
ప్రేక్షకుల టేస్ట్ మారుతోంది
ఓటీటీ బూమ్ తర్వాత, జనం ప్రతి వారం కొత్త కంటెంట్ చూస్తున్నారు. కొరియన్ చిత్రాలు (పారసైట్, ట్రైన్ టు బుసాన్ ), స్పానిష్ షోలు ( మనీ హీస్ట్ ), జపాన్ అనిమే ( డీమన్ స్లేయర్ )… ఇవన్నీ ఒకే పాఠం చెబుతున్నాయి. ప్రాంతీయ కథలు కూడా ప్రపంచవ్యాప్తంగా హిట్ అవుతాయి.
ప్రపంచ సినిమా ఇప్పుడు ఒకే విషయాన్ని చెబుతోంది: జెనరిక్ కథలు కాదు, ప్రాంతీయ వాసన కలిగిన కథలే హిట్ అవుతాయి.
ఆర్ ఆర్ ఆర్ – దేశీ ఫ్లేవర్‌తో ప్రపంచవ్యాప్తంగా నడిచింది.
ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ – ఆసియా కల్చర్‌తో ఆస్కార్ గెలిచింది.
లోక కూడా అదే మార్గంలో ఉంది – కేరళ జానపద పురాణాన్ని సూపర్‌హీరో రూపంలో ప్రపంచానికి పరిచయం చేసింది.
“కథ ఎంత వ్యక్తిగతంగా ఉంటే, అంత ఎక్కువగా విశ్వవ్యాప్తంగా పంచుతుంది.” అని – అకిరా కురోసావా చెప్పిన మాటలు నిజం అవుతున్నాయి. లోకా కూడా కేరళలోని పురాణాన్ని తీసుకుని, భావోద్వేగాలతో మిళితం చేసి చూపించింది. అందుకే కేరళ సరిహద్దులు దాటి ప్రేక్షకుల మనసు గెలిచింది.
ఫ్రాంచైజ్ బిల్డింగ్
ఇతర ఇండస్ట్రీల్లో “సినిమాటిక్ యూనివర్స్” అనే మాట ఫస్ట్ ఫిల్మ్ రాకముందే వస్తుంది. కాని లోక మాత్రం సహజంగా అల్లుకుంది. మూతోన్న్ నెట్‌వర్క్, చథన్ సిబ్లింగ్స్ లాంటి చిన్న క్లూస్ వదిలి, ఆడియన్స్‌లో ఆసక్తి రేకెత్తించింది.
“ప్రేక్షకులు కోరుకున్నది ఇవ్వకండి, వాళ్లకు అవసరమని తెలియనిదే ఇవ్వండి.” – డేవిడ్ ఫించర్
స్టార్ సిస్టమ్ బలహీనమవుతోంది
ఇటీవల పాన్-ఇండియా సినిమాలు స్టార్లపై ఆధారపడి వచ్చి బోల్తా పడ్డాయి. కానీ లోక మాత్రం హీరోయిన్ లీడ్ తో, పెద్ద స్టార్ లేకుండా – విజయాన్ని సాధించింది. ఇది ఒక సంకేతం: ఇక ముందు హిట్ అయ్యేది కంటెంట్, కాదు స్టార్ ఫేస్.
కెమెరా వెనక బోల్డ్ నెస్ – దుల్కల్ సల్మాన్
దుల్కర్ నిర్మాతగా పెట్టిన రిస్క్ ఈ ప్రాజెక్ట్‌కి బ్యాక్ బోన్. స్టార్ ఫేస్ లేకుండా,ఫిమేల్ సూపర్ హీరోతో, రూటెడ్ జానపదం ఎటెమ్ట్ చేయడం… ఇదే అసలు పాన్-ఇండియన్ రిస్క్. ఫలితం?జాతీయ స్దాయిలో చర్చ.
ఏదైమైనా...
లోక : Chapter 1 చెప్పేది ఒకటే... ప్రేక్షకులు ఇక భారీ బడ్జెట్‌లకు కాదు, నిజమైన స్టోరీ వరల్డ్ కి డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు.కంటెంట్ స్థానికమైనా, భావోద్వేగాలు యూనివర్సల్ అయితే ప్రపంచమే వింటుంది.