
ఓవర్సీస్ రివ్యూలకు ‘మాస్ జాతర’ టీమ్ కౌంటర్ షాక్!
మాస్ సినిమాలకు కొత్త దారి
ప్రస్తుత పరిస్దితుల్లో పెద్ద సినిమాలు భాక్సాఫీస్ దగ్గర గెలవలంటే చాలా కష్టపడాల్సి వస్తోంది. సక్సెస్ వస్తే ఏ స్దాయిలో ఉంటోందో, తేడా కొడితే అంతకు మించి ఇబ్బందులు వస్తున్నాయి. ఓటిటి కూడా రేట్లు సగానికి సగం తగ్గిపోతున్నాయి. దాంతో సినిమా రిలీజ్ నుంచి ప్రతీ అడుగు జాగ్రత్తలు తీసుకునే పరిస్దితి. టాక్ బాగుండేదుకు దర్శక,నిర్మాతలు అనేక స్ట్రాటజీలు అలు చేస్తున్నారు. రకరకాల ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. రిలీజ్ ని దృష్టిలో పెట్టుకుని తీసుకునే ప్రతీ నిర్ణయం ఓపినింగ్స్, కలెక్షన్స్ విషయంలో భారీ ఇంపాక్ట్ చూపెడుతుంది. ముఖ్యంగా సినిమాకు ఓపినింగ్స్, రివ్యూలు, సోషల్ మీడియా టాక్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్దితులు వచ్చాయి.
ఇప్పటి సినీ యుగంలో — సినిమా ఇండియా రిలీజ్ కంటే ముందే ఓవర్సీస్ రివ్యూలు, సోషల్ మీడియా టాక్, రేటింగ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. అదే ఒకప్పుడు కేవలం "ఫస్ట్ షో రిపోర్ట్"గా ఉండేది, ఇప్పుడు అది బాక్సాఫీస్ ఫేట్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అయిపోయింది.
చాలా సార్లు చూశాం —
ఓవర్సీస్‌లో కొన్ని మైనస్ రివ్యూలు వచ్చినా, మాస్ సినిమాలు రిలీజైన వెంటనే నెగటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. సినిమా చూడకముందే సోషల్ మీడియాలో “అవర్ ఆఫ్ కంటెంట్” టాక్, “సేమ్ టెంప్లేట్” కామెంట్స్ ట్రెండ్ అవుతాయి. దీని వల్ల మాస్ బెల్ట్స్‌లో ఫస్ట్ డే ఓపెనింగ్స్, బుకింగ్స్ పై పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. మాస్ సినిమాలు అనేవి ఎమోషన్ & ఎనర్జీ మీద నడిచే సినిమాలు. ఆ ఎమోషన్ ని మొదటగా ఫీల్ చేయాల్సిన వారు మన B & C సెంటర్ ఆడియెన్స్.
కానీ ఓవర్సీస్ రివ్యూలు ముందుగా వస్తే, ఆ థ్రిల్, ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ పాడవుతుంది. ఇక థియేటర్ లో సీన్ కు వచ్చే కేకలు, విజిల్స్ హంగామా, హడావుడి తగ్గిపోతుంది.ఇది గత కొంతకాలంగా నిర్మాతలు గమనిస్తున్నారు. అయితే ఏం చేయాలి అనే ప్లాన్ చేసుకునేలాగ ఆ ఇంపాక్ట్ పడిపోతోంది. ఆ తర్వాత ఓవర్సీస్ రివ్యూలను తిట్టుకోవటం తప్పించి చేసేదేమీ కనపడటం లేదు.
“మాస్ జాతర” టీమ్ కొత్త ప్లాన్ !
రవి తేజ & టీమ్ దీనిని బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ఈసారి భారతీయ ప్రేక్షకులకే ఫస్ట్ ప్రాధాన్యత ఇద్దామని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇండియా షోలు అక్టోబర్ 31 సాయంత్రం 6 గంటలకు మొదలవుతాయి, కానీ ఓవర్సీస్ షోలు మాత్రం 10 PM (IST) తర్వాతే మొదలవుతాయి. దీంతో ఏమవుతుంది అంటే — మొదటి టాక్, మొదటి క్లాప్స్, మొదటి “మాస్ ఫీల్” అన్నీ మన ఇండియన్ థియేటర్ల నుంచే వస్తాయి. మాస్ సినిమాకు మాస్ ఆడియెన్స్ నుంచే పాజిటివ్ బజ్ రావాలి — ఇదే అసలైన మార్కెటింగ్ సెన్స్. https://www.youtube.com/watch?v=Qm-wNxOcEL4
ట్రైలర్ టాక్ & బజ్
ట్రైలర్‌లో రవి తేజ చూపించిన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ — అన్నీ స్పష్టంగా చెబుతున్నాయి ఇది ఒక ప్యూర్ మాస్ సెలబ్రేషన్.
“మాస్ జాతర” టైటిల్ కంటే పెద్ద ఫెస్టివల్ మాస్ బెల్ట్స్‌లో ఏదీ ఉండదు.
పైనల్ గా..
ఓవర్సీస్ రివ్యూలు ముందుగా రావటం వలన మాస్ సినిమాల స్పిరిట్ తగ్గిపోతుంది. కానీ “మాస్ జాతర” టీమ్ దాన్ని అర్థం చేసుకొని స్ట్రాటజీని రివర్స్ చేశారు. ఇప్పుడు మొదటి కేక, మొదటి రివ్యూ, మొదటి మాస్ రెస్పాన్స్ — ఇండియా నుంచే! 31 అక్టోబర్ సాయంత్రం 6 గంటలకు…
రవి తేజ తిరిగి రానున్నాడు — మాస్ జాతర మొదలవబోతోంది!
అంటే ఈసారి కథ మారింది.
ఓవర్సీస్ టాక్ కాదు… ఇండియా టాక్ సినిమా గేమ్ మార్చబోతోందా లేదా అనేది చూడాలి!

