‘ఛాంపియన్’ మూడుళ్ల కల… మూడు రోజుల్లో కూలిపోయిందా?
x

‘ఛాంపియన్’ మూడుళ్ల కల… మూడు రోజుల్లో కూలిపోయిందా?

తప్పు ఎక్కడ జరిగింది?


స్టార్ కిడ్ ట్యాగ్ కాదు… పోటీ తత్వం ఉన్న హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలన్న ఆశతో, ఒక్క సినిమా కోసం మూడేళ్లు జీవితాన్ని పెట్టుబడి పెట్టాడు రోషన్. పీరియాడిక్ సెటప్, స్పోర్ట్స్ డ్రామా, భారీ బడ్జెట్, “ఇది కెరీర్ టర్నింగ్ పాయింట్” అనే ఇండస్ట్రీ బజ్… రిలీజ్‌కు ముందు వరకూ ‘ఛాంపియన్’ ఒక హాట్ టాపిక్.

కట్ చేస్తే —

థియేటర్‌లో మాత్రం చప్పటి స్పందన, బాక్సాఫీస్ దగ్గర నిశ్శబ్దం

ఎందుకిలా జరిగింది?

క్రేజ్ గెలవాల్సిన చోట… కంటెంట్ ఓడిపోయిందా?

ఇంతకాలం వెయిట్ చేసిన రోషన్‌కు, ఈ సినిమా నిజంగానే ఛాన్స్ మిస్ అయ్యిందా?

ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో వినిపిస్తున్న అసలైన ప్రశ్న. ఛాంపియన్ సినిమాపై రిలీజ్‌కు ముందు భారీ అంచనాలే ఉన్నాయి. ‘పెళ్లి సందD’తో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసిన యువ నటుడు రోషన్, ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తాడని ట్రేడ్ కూడా భావించింది. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా, భారీ బడ్జెట్, డిఫరెంట్ సబ్జెక్ట్… ఇవన్నీ కలిసి ‘ఛాంపియన్’పై రిలీజ్‌కు ముందే మంచి క్రేజ్ తీసుకొచ్చాయి.

కానీ… రిలీజ్ రోజు నుంచే గేమ్ మారిపోయింది. ఏం జరిగింది?

* క్రిస్మస్ వీకెండ్‌కు రిలీజ్ అయిన ఛాంపియన్, ఓపెనింగ్స్ విషయంలో ఆశించిన స్థాయిలో స్టార్ట్ కాలేకపోయింది.

* పండగ సీజన్ అయినా కలెక్షన్లు పికప్ కాలేదు.

* మౌత్ టాక్ బలహీనంగా ఉండటంతో వీకెండ్ గ్రోత్ కూడా కనిపించలేదు.

మూడు సంవత్సరాల శ్రమ… ఫలితం శూన్యం?

ఈ సినిమా కోసం రోషన్ మూడు సంవత్సరాలు పూర్తిగా డెడికేట్ అయ్యాడు. ఇతర ప్రాజెక్టులు ఏవీ సైన్ చేయకుండా, మొత్తం టైమ్ ‘ఛాంపియన్’కే ఇచ్చాడు. అదే ఇప్పుడు అతనికి పెద్ద మైనస్‌గా మారిందన్న టాక్ వినిపిస్తోంది.

బడ్జెట్ భారమే శాపమా?

దాదాపు 45 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా

* మేకర్స్ సూపర్ కాన్ఫిడెన్స్‌తో అడ్వాన్స్ బేసిస్‌లో స్వయంగా రిలీజ్ చేశారు

* కానీ ప్రస్తుతం ట్రేడ్ లెక్కల ప్రకారం నిర్మాతలకు నష్టాలు తప్పేలా లేవు

‘ఛాంపియన్’ ఎందుకు వర్కవుట్ కాలేదు? – క్రేజ్ ఉన్నా కూలిపోయిన సినిమా వెనుక అసలైన కారణమేంటి

‘ఛాంపియన్’ ఎందుకు వర్కవుట్ అవ్వడం అనేది ఒక్క కారణంతో జరగదు. ఇది స్క్రిప్ట్ నుంచి స్క్రీన్ దాకా జరిగిన చిన్న చిన్న తప్పుల సమాహారం. లోతుగా చూస్తే, ‘ఛాంపియన్’ ఫెయిల్యూర్ వెనుక క్రేజ్–కంటెంట్ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది.

1. కాన్సెప్ట్ స్ట్రాంగ్… కాని న్యారేషన్ వీక్

పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా అంటే ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే ఎలిమెంట్స్ చాలా క్లియర్‌గా ఉంటాయి. అండర్‌డాగ్ జర్నీ, ఎమోషనల్ హైస్, స్పోర్ట్స్‌లో థ్రిల్, క్లైమాక్స్‌లో కాథార్సిస్

కానీ ‘ఛాంపియన్’లో కథా ఐడియా బాగున్నా, దాన్ని చెప్పిన విధానం ఫ్లాట్‌గా మారింది. సీన్స్ మధ్య టెన్షన్ పెరగలేదు, హీరో జర్నీకి కావాల్సిన ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయింది. ఆడియన్స్ “ఎం జరుగుతుందో” చూస్తారు… కానీ “ఎందుకు జరుగుతుందో” ఫీల్ కాలేదు.

2. హీరో క్యారెక్టర్ ఆర్క్ సరిగా బిల్డ్ కాలేదు

రోషన్ ఈ సినిమాకు పూర్తిగా కమిట్ అయ్యాడు – అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. కానీ సమస్య నటనలో కాదు… రచనలో . హీరో ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నాడు?, అతని లోపల భయం ఏమిటి?, గెలుపు అతనికి ఎందుకు అవసరం? ఈ ప్రశ్నలకు స్క్రిప్ట్ క్లియర్ ఆన్సర్స్ ఇవ్వలేదు. దాంతో హీరో విజయం వచ్చినా ఆడియన్స్‌కు అది పర్సనల్ విక్టరీలా అనిపించలేదు.

3. పీరియాడిక్ సెటప్ – విజువల్‌గా మాత్రమే మిగిలిపోయింది

పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ అంటే కేవలం కాస్ట్యూమ్స్, సెట్స్ మాత్రమే కాదు. ఆ కాలం సైకాలజీ, పొలిటికల్ టెన్షన్, సోషల్ ప్రెజర్** కూడా చూపాలి. ‘ఛాంపియన్’లో కాలం బ్యాక్‌డ్రాప్‌గా ఉంది. కానీ కథను ప్రభావితం చేసే ఫ్యాక్టర్‌గా లేదు

అంటే… పీరియడ్ కథను నడిపించలేదు, కథ పీరియడ్‌ని వాడుకుంది.

4. మిస్సైన టెన్షన్

పీరియడ్ డ్రామాలో కావాల్సిన “ టెన్షన్ ఎలిమెంట్” లేకపోవడం . ఇలాంటి సినిమాల్లో ప్రతి సీన్ ఒక యుద్ధం. ప్రతి ఓటమి ఒక దెబ్బ . కానీ ఇక్కడ సీన్స్ ప్రిడిక్టబుల్‌గా అనిపించాయి. థ్రిల్ కంటే ప్రెజెంటేషన్ ఎక్కువైంది. ప్రధానంగా గెలుస్తాడని ముందే తెలిసిన హీరోని చూడడం… గెలిస్తే వచ్చే ఎగ్జైట్‌మెంట్‌ని చంపేసింది.

5. మ్యూజిక్ + BGM ఇంపాక్ట్ మిస్

మిక్కీ జే మేయర్ లాంటి కంపోజర్ ఉన్నా, ఈ సినిమాకు కావాల్సిన రైజింగ్ మాంటాజ్ మ్యూజిక్ ,పుష్ ఇచ్చే థీమ్ స్ట్రాంగ్‌గా నిలవలేదు. స్పోర్ట్స్ డ్రామాలో మ్యూజిక్ ఒక అదనపు క్యారెక్టర్. ఇక్కడ అది బ్యాక్‌గ్రౌండ్‌కే పరిమితమైంది.

6. బడ్జెట్–అంచనాలు… కంటెంట్‌కు మించి పెరగడం

45 కోట్లకు పైగా బడ్జెట్. ఆడియన్స్‌లో “ఇది నెక్స్ట్ లెవల్ సినిమా” అనే భావన తీసుకొచ్చింది. కానీ స్క్రీన్ మీద వచ్చిన సినిమా. ఆ స్థాయి ఫీల్ ఇవ్వకపోవడంతో డిసప్పాయింట్‌మెంట్ డబుల్ అయింది. చిన్న సినిమా అయితే క్షమించేవారు… పెద్ద సినిమా కాబట్టి ప్రశ్నించారు.

7. మార్కెటింగ్ క్రేజ్ ఎక్కువ… కంటెంట్ టీజర్ తక్కువ

రిలీజ్ ముందు “రోషన్ కెరీర్ టర్నింగ్ పాయింట్”. “డిఫరెంట్ స్పోర్ట్స్ డ్రామా” అని హైప్ చేశారు కానీ ట్రైలర్, ప్రమోషన్లలో అసలు కథా ఎమోషన్ బయటపడలేదు. రిలీజ్ తర్వాత “ఇది మనం ఊహించిన సినిమా కాదు” అన్న ఫీలింగ్ డామినేట్ చేసింది.

మొత్తానికి… భారీ క్రేజ్‌తో వచ్చిన ‘ఛాంపియన్’… బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఛాంపియన్ కాలేకపోయింది. కానీ ఇది రోషన్ కెరీర్‌కు ఫుల్ స్టాప్ కాదు… ఇది ఒక గట్టి లెసన్ మాత్రమే.

Read More
Next Story