హిచ్ కాక్ సైకో షవర్ సీన్ ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు
x

హిచ్ కాక్ 'సైకో' షవర్ సీన్ ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు

హంతకుడి చేతిలోని కత్తి హీరోయిన్ శరీరాన్ని తాకకపోవడం చిత్రీకరించిన అద్భుతమైన సీన్ ఎలా చిత్రీకరించారో తెలుసా. అదే హిచ్ కాక్ గొప్పతనం.

ఊరికి చివరగా ఓ హోటల్. అందులో ఓ గదిలో బాత్రూం తలుపులు చేరవేసి నగ్నంగా స్నానం చేస్తుంటుంది హీరోయిన్. ఉన్నట్టుండి సుడిగాలిలా బాత్రూం తలుపులు తెరుచుకుని లోపలికి ప్రవేశిస్తుంది ఒక అస్పష్టమైన ఆకారం . వచ్చి ఆ అమ్మాయిని కత్తితో పొడిచి చంపి మాయమైమవుతుంది. నిర్జీవమైన నగ్న శరీరం నేలకొరిగి పోవడం, బాత్రూం గోడలమీదా, నేలమీదా చిందిన నెత్తురు నీళ్ళలో కరిగి సింకు దగ్గర సుడులు తిరిగి పైపు లోపలకి జారిపోవడం జరుగుతూంటుంది. ఈ సీన్ చూసిన వాళ్లకు మెదళ్లలో అలా గుర్తిండిపోతుంది. తెర మీద 45 సెకండ్ల సేపు మాత్రమే కనిపించే ఈ సీన్ లో 70 షాట్స్ ఉన్నాయంటే నమ్ముతారా. అంటే 70 సార్లు కెమెరా పొజిషన్ ని మార్చాల్సి వచ్చిందన్న మాట. ఇంకో విశేషం ఏమిటంటే అసలు షూటింగ్ లో హంతకుడి చేతిలోని కత్తి ఒక్కసారి కూడా హీరోయిన్ శరీరాన్ని తాకకపోవడం. అదే హిచ్ కాక్ గొప్పతనం. ఏ ఎఫెక్ట్ ని ఎలా తేవాలో ఆయనకు తెలిసినట్లు మరొకరుకి తెలియదు.

సినిమా చరిత్రలో అతి భయంకరమైన మర్డర్ సీన్ గా చెప్పుకునే ఈ 'షవర్ బాత్ మర్డర్" హిచ్ కాక్ డైరక్ట్ చేసిన 'సైకో' Psycho సినిమా లోదే . ఆ సినిమాలో భయోత్పాతం కలిగించే సస్పెన్స్ సంఘటనలను గురించి ప్రముఖంగా చెప్పుకొనేవారు. ఆ సీన్ లో ఆంధోనీ పెర్ కిన్స్ (Anthony Perkins) అందమైన జెనెట్ లైన్ (Janet Leigh) ను స్నానాల గదిలో గదిలో చంపే సీన్ ప్రేక్షకులను భయపెట్టింది. అంత భయంకరంగా చిత్రీకరించారు దాన్ని.

అప్పట్లో ఆ సీన్ ఇంపాక్ట్ ఎంతలా ఉండేదంటే ఆ రోజుల్లో 'సైకో' సినిమా చూసి వచ్చిన వాళ్ళు స్నానాలగదిలో కొన్నాళ్ళపాటు ఒంటరిగా స్నానం చేయడానికి భయపడేవారు. ప్రేక్షకుల మీద అంతటి ప్రభావాన్ని కలిగించిన ఆ హత్యని చిత్రీకరించడంలో తన ప్రతిభనంతా వినియోగించాడు హిచ్ కాక్ . అయితే డైరక్ట్ చేయలేదు. మరి ఎవరు డైరక్ట్ చేసారు ?ఇంట్రస్టింగ్ ఇన్ఫో మీ కోసం.

హిచ్ కాక్ డైరక్ట్ చేయని సీన్ ఇది

ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ (Hitchcock) తన కెరీర్ లో ఎన్నో సస్పెన్స్ సినిమాలు డైరక్ట్ చేసారు. అయితే ఆయన సైకో (1960) ని సినిమాని మాత్రం దాదాపు 65 ఏళ్లు అవుతున్నా ఎవరూ మర్చిపోరు. ముఖ్యంగా ఆ సినిమాలోని షవర్ సీన్ చూస్తే మనస్సులో అలా ముద్రించుకుపోతుంది. సినిమా చరిత్రలో ఎక్కువగా విశ్లేషించబడిన సీన్ అది. ఈ సీన్ ఈ సీన్ హిచ్ కాక్ కు ఎంత పేరు తెచ్చిపెట్టిందో చెప్పలేము. కెమెరా, లైటింగ్, సౌండ్, ఎడిటింగ్ ప్లస్ డైరెక్షన్ కలిసి సాధించిన అపూర్వ విజయం షవర్ బాత్ మర్డర్ -సీన్ ని చెప్తూంటారు. తెరమీద 45 సెకండ్లు మాత్రమే సాగే ఈ హత్యా సన్నివేశాన్ని షూట్ చేయటానికి వారం రోజులు పట్టింది. అయితే హిచ్ కాక్ కేవలం పర్యవేక్షణ మాత్రమే చేసారు డైరక్ట్ చేయలేదు. ఆ సీన్ ని హిచ్ కాక్ డైరక్ట్ చేయలేదని ఆయన జీవిత చరిత్ర రాసిన డోనాల్డ్ స్పాటో పేర్కొన్నారు. ఆ వివరాలను వివరిస్తూ... శ్యామూల్ బాస్ ..హిచ్ కాక్ దగ్గర గ్రాఫిక్ డిజైనర్. అతనే సైకో సినిమాకు టైటిల్ డిజైన్ సీక్వెన్స్ చేసింది. సైకో చిత్రం తీయకముందు స్టోరీ డిస్కషన్స్ లో అతనూ పాల్గొన్నాడు. అలాగే స్టోరీ బోర్డ్ వేసాడు. ఆ సీన్ అతని క్రియేషన్. అతను ఆ సీన్ ని నేరేట్ చేసే విధానం, స్టోరీ బోర్డ్ వేసిన పద్దతి ఫెరఫెక్ట్ గా అనిపించి, హిచ్ కాక్ కు తెగ నచ్చాయట. దాంతో ఆ నేరేషన్ ని పదే పదే చెప్పించుకున్నారట. రికార్డ్ చేసి మరీ వినేవారట. చివరకు ఓ రోజు పిలిచి నువ్వు చెప్పిన ఆ సీన్ ని నువ్వే డైరక్ట్ చేయి అన్నారు.


మొదట శ్యామూల్ ఒప్పుకోకపోయినా హిచ్ కాక్ గట్టిగా చెప్పటంలో తీయక తప్పింది కాదు. కానీ అద్బుతంగా ఆ సీన్ ని తీసారు. ఆ సమయంలో హిచ్ కాక్ సెట్ లో ఓ మూల కూర్చున్నారు. ఆ సీన్ తీయటం పూర్తయ్యాక ఎడిట్ చేసి ఏ షాట్ ఎక్కడ పెడితే ఎక్కువ సస్పెన్స్ వస్తుందో డిజైన్ చేసింది మరొకరు. అతనూ హిచ్ కాక్ దగ్గర ఉద్యోగే. మొత్తం మీద హిచ్ కాక్ జనాలకు ఎంతో నచ్చే సీన్ ని తన శిష్యులతో తీయించారు. ఆ విషయాలను శ్యామూల్ ...బయోపిక్ రాసిన స్పాటోకు చెప్తూ...ఆయన మా గురువు..శిష్యులను తీర్చిదిద్ది తర్ఫీదు ఇవ్వటంలో అతన్ని మించిన వాళ్లు లేరు. అందుకే చివరి రోజు దాకా ఆయనతోనే ఉన్నాం. ఆయన్ని విడిచిపెట్టింది లేదు అన్నారు.

ప్రపంచ సినిమా అధ్యయనం చేసేవారికి ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ ఖచ్చితంగా పరిచయం అవుతాడు. మొదట్లో ప్రెండ్ గా తర్వాత గురువుగా మారిపోతాడు. ఇంటెన్స్ తో కూడిన ఇన్విస్టిగేషన్ డ్రామాలను డైరక్ట్ చేయటంలో ఆయన్ని దాటిన వాళ్లు లేరు. హిచ్ కాక్ సినిమాల్లో సైకో, ది బర్డ్స్ సినిమాలు అద్బుతాలు. సైకో లో హంతకుడు మేడమెట్లు మీద నుంచి కత్తితో రావటం, స్నానాల గదిలో హత్య, అలాగే ది బర్డ్స్ లో పక్షులు రావటం వళ్లు జలదరించేలా తీసాడు. భయపడే సీన్స్ ఉన్నాయని తెలిసినా జనం పదే పదే చూసారు.

డబ్బు ఇచ్చి మరీ భయాన్ని ఎందుకు కొనుక్కుంటున్నారు

ఈ సందర్బంలో హిచ్ కాక్ ని ఓ మీడియా వ్యక్తి...ప్రేక్షకులు డబ్బిచ్చి మరీ భయాన్ని ఎందుకు కొనుక్కుంటున్నారు అని అడిగితే ఆయన గమ్మత్తైన సమాధానం ఇచ్చారు. ప్రతీ మనిషికీ తను ధైర్యవంతుడిని అనే భావన ఉంటుంది. అలాంటి తనని భయపెట్టే విషయాలు కూడా ఉన్నాయని తెలిసి..అవి ఎలా ఉంటాయో తెలుసుకుందామని ఇలాంటి భయపెట్టే సినిమాలకు వస్తూంటారు అన్నారు.

'సైకో' చిత్రం ప్రపంచ సినిమా చరిత్రలోనే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. తనకి అన్నివిధాలా పరిపూర్ణమైన సంతృప్తిని కలిగించిన ప్యూర్ సినిమా 'సైకో' అని చెప్పుకున్నాడు హిచ్ కాక్ . మనదేశంలోని కొన్ని థియేటర్లలో సంవత్సరం పైగా ఆడింది 'సైకో' అంటే నమ్మలేం . ఇండియాలో అన్ని రోజులు ప్రదర్శించబడిన మొదటి ఇంగ్లీషు సినిమా బహుశ ఇదే అంటారు. ఎనిమిది లక్షల డాలర్లతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించింది. హిచ్ కాక్, తన చిత్రాలలో సస్పెన్స్ కు పెద్ద పీట వేస్తూ సాగారు. ఇది జనాన్ని భలేగా ఆకట్టుకునేది.

లేటుగా వస్తే లోపలకి రానివ్వం

ఇక సైకో చిత్రం థియేటర్ లో రిలీజ్ అప్పుడు హిచ్ కాక్ కొన్ని రూల్స్ పెట్టారు. తన లీడ్ స్టార్స్ ఆంధోనీ పెర్ కిన్స్, జెనెట్ లైన్ ప్రమోషన్స్ పేరుతో మీడియా టూర్స్ వేయకూడదు. మీడియాలో కనిపించకూడదు. క్రిటిక్స్ కు ప్రెవేట్ స్క్రీనింగ్స్ వెయ్యమని చెప్పేసారు. అలాగే సినిమా ఆడుతున్న థియేటర్స్ లో లేటుగా వస్తే వారిని లోపలకి రానిచ్చేవారు కాదు. మొదటి షాట్ మిస్ కాకూడదని ఆయన రూల్ పెట్టారు. ఆ రూల్ ని థియేటర్స్ దగ్గర చాలా స్ట్రిక్ట్ గా ఫాలో చేసారు. థియేటర్స్ దగ్గర ఆ విషయాన్ని చెప్తూ పెద్ద బోర్డ్ లు పెట్టారు. మొదట థియేటర్ మేనేజర్స్ టిక్కెట్లు నష్టపోతామని భయపడ్డారు. కానీ ఆయన ఆ బోర్డ్ పెట్టగానే జనం ఎగబడి వచ్చి పెద్ద పెద్ద క్యూలలో నిలబడి సినిమా ప్రారంభానికి గంట ముందే ఉండేవారు. అలా హిచ్ కాక్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ సినిమా విషయంలో .

Read More
Next Story