ఎన్టీఆర్ సినిమాపై ’వెట్ట‌యాన్’ఎఫెక్ట్? ఆలోచనైతే మొదలైంది
x

ఎన్టీఆర్ సినిమాపై ’వెట్ట‌యాన్’ఎఫెక్ట్? ఆలోచనైతే మొదలైంది

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) వెట్ట‌యాన్ (Vettaiyan) రిలీజ్‌కు స‌మ‌యంలో మేక‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు కొత్త త‌ల‌నొప్పి వ‌చ్చి ప‌డిన సంగతి తెలిసిందే.


సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) వెట్ట‌యాన్ (Vettaiyan) రిలీజ్‌కు స‌మ‌యంలో మేక‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు కొత్త త‌ల‌నొప్పి వ‌చ్చి ప‌డిన సంగతి తెలిసిందే. సినిమా టైటిల్ తెలుగులో కాకుండా త‌మిళ పేరే కంటిన్యూ చేస్తున్న నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో పెద్ద దుమారం మొద‌లైంది. ఈక్ర‌మంలో ఈ వెట్ట‌యాన్ (Vettaiyan) సినిమాను ఏషియన్ సురేష్, దిల్ రాజు సంస్థలు.. తెలుగులో రిలీజ్ చేస్తున్న నేప‌థ్యంలో నిర్మాతలు సురేష్ బాబు (Suresh Babu), దిల్ రాజు (Dil Raju), రానా దగ్గుబాటి రామానాయుడు (Rana Daggubati) స్టూడియోలో ప్రెస్ మీట్ నిర్వహించి మరీ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

దిల్ రాజు (Dil Raju) మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో..తెలుగులో వెట్టాయన్ (Vettaiyan) అనే టైటిల్‌ను కాంట్రవర్సీ చేస్తున్నారు. సినిమా గ్లోబల్ అయ్యింది సాధ్యమైనంత వరకు టైటిల్స్ లోకల్ పేరుతో పెడుతున్నారు లేని పక్షంలో ఆ టైటిల్ ని కంటిన్యూ చేస్తున్నారు.. సినిమాని సినిమాగా చూడండి అని అన్నారు. ఈ సినిమాకు తెలుగులో వేట‌గాడు అని పెట్టాల‌ని ప్ర‌య‌త్నించినా అందుబాటులోకి లేక అదే కంటిన్యూ చేశార‌న్నారు.

పాన్ ఇండియా సినిమా చేసేటప్పుడు కొన్ని భాష‌లలో టైటిల్ విషయంలో స‌మ‌స్య‌లు ఉంటాయి, గేమ్ చేంజర్ విషయంలో కూడా రెండు మూడు లాంగ్వేజ్‌లలో ఇబ్బంది అయ్యిందన్నారు. అయినా సినిమా వర్కవుట్ కాలేదు. టైటిల్ తో పోయిందని కొందరు అన్నారు. కంటెంట్ సరిగ్గా వర్కవుట్ కాలేదని మరికొందరు అన్నారు. ఏదైతేనేం ఓ రకంగా పెద్ద సినిమాల్లో వణుకు పుట్టించింది. తెలుగు టైటిల్ ఉంటే బాగుండేది కదా అనే ఆలోచన పుట్టించింది.

ఈ క్రమంలో ఇప్పుడు ఎన్టీఆర్ తాజా చిత్రానికి సైతం తెలుగు టైటిల్ ని పెట్టడానికే ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీతోనే బాలీవుడ్‍లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరో హృతిక్ రోషన్‍తో కలిసి ఆయన నటిస్తున్నారు.వార్ 2 చిత్రానికి తెలుగులో టైటిల్ పెడితే బాగుంటుందని ఎన్టీఆర్ సూచించారట. ఈ చిత్రం తెలుగులో ‘వార్ 2 - యుద్ధభూమి’ పేరుతో వస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ టైటిల్ మూవీ టీమ్ రిజిస్టర్ చేయించిందనే అంటున్నాయి.

మరో ప్రక్క ఇంగ్లీష్ టైటిల్స్ తో సమస్య రావడం లేదని, వార్ అనేది అర్థమయ్యే టైటిల్ కాబట్టి ఇబ్బంది ఉండదని నిర్మాతలకు తెలుగు నుంచి సలహాలు వెళ్తున్నాయట. ఇప్పటికే ‘వార్ 2’ టైటిల్ జనాల్లోకి విపరీతంగా వెళ్లిపోయింది కాబట్టి మార్చవద్దు అంటున్నారట. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘వార్’ కూడా అదే పేరుతో తెలుగులో వచ్చింది. ‘వార్ 2’ను కూడా తెలుగులో అదే టైటిల్‍తో రిలీజ్ చేస్తే అని మేకర్స్ కు చెప్తున్నారట. అయితే వార్ 2 అని పెట్టి తెలుగులో క్రింద యుద్దభూమి అని తెలుగు కాప్షన్ ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నారట. ,

వార్ 2 గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. వార్ 2 మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. 2019లో హృతిక్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ చిత్రానికి సీక్వెల్‍గా ఈ మూవీ రూపొందుతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగానే వార్ 2 తెరకెక్కుతోంది. భారీ యాక్షన్ సీక్వెన్సులతో ఈ మూవీ ఉండనుంది.దీంతో సినిమాపై జనాల్లో క్యూరియాసిటీ పెరుగుతోంది. ఈ ఛేజ్ సీక్వెన్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య ఉంటుందట..

ఇందులో హృతిక్ నగరంలోని రూఫ్‌టాప్‌లు, షార్ట్‌కట్ మార్గాల్లో ఎన్టీఆర్‌ని వెంబడిస్తున్నట్లు చూపించనున్నారని అంటున్నారు. ఒక బిల్డింగ్‌పై నుంచి మరో భవనంపైకి దూకడం, జారిపోవడం వంటి సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్ ఉంటాయట. ఈ ఛేజింగ్ సీన్‌లో జూనియర్ ఎన్టీఆర్ కూడా టెక్నాలజీ సహాయం తప్పించుకుంటూ ఉంటారని అంటున్నారు. ఎన్టీఆర్ పాత్ర టెక్నాలజీని చాలా ఇష్టపడే వ్యక్తిగా,కొద్దిపాటి నెగిటివ్ టచ్ తో ఉండబోతోందని అంటున్నారు.

ఇవన్నీ ప్రక్కన పెడితే..వార్ 2 కు తెలుగు టైటిల్ పెడతారా లేదా అనేదాని కన్నా అసలంటూ డిస్కషన్ మొదలైంది. ఖచ్చితంగా ఇక నుంచి తంగలాన్, వేట్టయాన్ అంటూ తమళ పేర్లు మనపై రుద్దే సమయంలో కచ్చితంగా నిర్మాతలు ఆలోచనలో పడతారు అని తెలుగు భాష అభిమానులు అంటున్నారు. అయితే సూర్య కంగువ అనే టైటిల్ తో వస్తున్నారు. తెలుగులోనూ అదే టైటిల్ తో రిలీజ్ అవుతోంది.

Read More
Next Story