జన నాయగన్ సెన్సార్ ఆలస్యం వల్ల  రూ.20 కోట్ల నష్టం
x

'జన నాయగన్' సెన్సార్ ఆలస్యం వల్ల రూ.20 కోట్ల నష్టం

విడుదల డేట్ ప్రటించాం, సెన్సార్ సర్టిఫికేట్ తొందరంగా ఇవ్వండి అంటే కుదరదు అంటున్న బోర్డు...


తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమా ‘జననాయగన్’ జనవరి 9న విడుదల కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాకు తొందరగా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలన్ని కేంద్ర సెన్సార్ బోర్డు ను ఆదేశించాలని సినిమా నిర్మాతలు వేసిన పిటిషన్ మీద మద్రాస్ హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.

కిరుభాకర్ పురుషోత్తమన్

విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా జనవరి 9న థియేటర్లలోకి రావాల్సి ఉంది. ఈ సినిమా సర్టిఫికేషను వేగవంతం చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేయడంతో ఆ సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది. ప్రకటించిన విడుదల తేదీ రోజే తీర్పు వెలువడే అవకాశం ఉన్నందున, సినిమా థియేటర్లలో విడుదలకు చివరి నిమిషంలో అడ్డంకి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి.
పిటిషన్ దేని గురించి?
జన నాయగన్ సినిమా విడుదలకు ముందే సమర్పించినప్పటికీ దానికి CEFC సర్టిఫికెట్ రాకపోవడంతో ఆ సినిమా నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. జనవరి 9న విడుదల అని ప్రకటించినందున సర్టిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలని CBFCని ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న సర్టిఫికేషన్ కోసం సమర్పించారు. అంటే విడుదల తేదీ కంటే చాలా ముందుగానే పంపారు. సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని సమీక్షించిన తర్వాత, U/A సర్టిఫికేషన్ ఇచ్చేందుకు నిర్ణయించింది. అయితే అనేక కోతలను సూచించింది.
ఆ తర్వాత నిర్మాతలు ఈసూచనల ప్రకారం చిత్రంలోని హింస, రక్తపాతానికి సంబంధించిన దృశ్యాలను కట్ చేసి డిసెంబర్ 24న చిత్రాన్ని తిరిగి సమర్పించారు. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇస్తామని CEFC చెప్పినట్లు నిర్మాత పేర్కొన్నారు. అయితే, జనవరి 5న, CEFC ఈ చిత్రాన్ని పునస్సమీక్ష కోసం ఒక కమిటీకి సమర్పిస్తున్నట్లు పేర్కొంది. దీని వల్ల సినిమా విడుదల జాప్యం అవుతుబందని దీని ఫలితంగా నిర్మాతలు న్యాయపరమైన పరిష్కారం కోరవలసి వచ్చింది.

విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి రాకముందు ఆయన చివరి చిత్రంగా జన నాయగన్ విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్నందున దాని విడుదల, సెన్సార్ సర్టిఫికేట్ చుట్టూ ఉహాగానాలతో సినిమా మరింత దృష్టిని ఆకర్షించింది.
CBFC క్లియరెన్స్ ఎందుకు నిలిచిపోయింది?
విచారణ సందర్భంగా, సర్టిఫికేషన్ ఆలస్యం కావడానికి గల కారణాలపై స్పష్టత ఇవ్వాలని హైకోర్టు కోరింది. ఫిర్యాదులు లేదా క్లియరెన్స్ నిలిపివేయబడిన విషయాలను రికార్డులో ఉంచాలని CEFCని కోరింది. ఈ చిత్రం మతపరమైన మనోభావాలను ఎలా దెబ్బతీసే అవకాశం ఉందో పేర్కొనాలని కూడా కోరింది.
విడుదల తేదీని బహిరంగంగా ప్రకటించినంత మాత్రాన చిత్రనిర్మాతలు "త్వరిత" సర్టిఫికేషన్ ఇవ్వలేమని, సర్టిఫికేట్ ఇచ్చేందుకు CEFC తగిన విధానాలు పాటించాలని CBFC కోర్టు ముందు వాదించింది.
బుధవారం ఏం జరిగింది?
సర్టిఫికేషన్ పై సమీక్ష కోసం బోర్డు నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన ఇమెయిల్ కాపీని CEFC కోర్టుకు
సమర్పించింది. అయితే, మెయిల్లో లేవనెత్తిన అన్ని ఇష్యూలను జన నాయగన్ చిత్రనిర్మాతలు ఇప్పటికే పరిష్కరించారని, వారు CEFC సూచించిన కోతలు మార్పులను అమలు చేశారు కదా, ఇంకా జాప్యం ఎందుకు అని కోర్టు ప్రశ్నించింది. సినిమాను సమీక్షించాలనే నిర్ణయం గురించి నిర్మాతలకు ఎందుకు తెలియజేయలేదని కూడా కోర్టు ప్రశ్నించింది. తర్వాత కోర్టు తీర్పును జనవరి 9కి రిజర్వ్ చేసింది.

ఆ సినిమాకుభారీ నష్టం

సినిమా విడుదల జాప్యం అయితే, నిర్మాతలకు కనీసం 20 కోట్ల నష్టం వాటిల్లుతుందని ట్రేడ్ విశ్లేషకుడు రమేష్ బాలా అంచనా వేశారు.

"సినిమా వాయిదా పడే ఖచ్చితమైన తేదీ మనకు తెలిస్తే, సినిమా ఎంత నష్టపోతుందో దాదాపు సరైన సంఖ్యను లెక్కించవచ్చు. అయినప్పటికీ, ఇప్పుడు కూడా, సినిమా 9వ తేదీన విడుదలయ్యే అవకాశం లేదు. కాబట్టి, దీని వల్ల కనీసం 20 కోట్ల నష్టం జరుగుతుంది" అని బాలా అన్నారు.

అంచనా వేసిన నష్టానికి గల కారణాలను వివరిస్తూ, "ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్ ఇప్పటికే పూర్తయింది, ఇప్పుడు అలాంటి షోలన్నీ రద్దు చేయబడతాయి. దానికి తోడు, తమిళం మరియు తెలుగు నుండి ఇతర సినిమాలు స్ట్రాట్లను బుక్ చేసుకున్నందున, ఈ సినిమాకు ఇప్పుడు ఉన్న స్క్రీన్ల సంఖ్య ఉండదు. కాబట్టి అది తక్కువ స్క్రీన్లకు దారి తీస్తుంది. ఇది కూడా నష్టమే" అని అన్నారు.


Read More
Next Story