ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనెగళ్ మృతి
x

ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనెగళ్ మృతి

ఆయన హైదరాబాద్ లో జన్మించారు.



భారతీయ సినీ పరిశ్రమకు, ముఖ్యంగా తెలంగాణ సీని ప్రేక్షక ప్రపంచానికి నేడొక దుర్దినం. తెలంగాణ ఆత్మని తెరపై ఆవిష్కరించిన అతికొద్ది గొప్ప డైరెక్టర్లలో ఒకరైన శ్యామ్ బెనెగల్ సోమవారం సాయంత్రం మృతి చెందారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ముంబై వోక్ హార్డ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కూతరు పియా బెనెగళ్ వెల్లడించారు. అంకుర్, భూమిక, నిషాంత్, కలుగ్, మంతన్ సహా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. 1934లో డిసెంబర్ 14న హైదరాబాదు తిరుమలగిరిలో జన్మించిన ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే సహా పలు అవార్డులు వరించాయి.

డిసెంబర్ న ఆయన తన 90వ జన్మదినోత్సవ ం కూడా జరుపుకున్నారు. సినిమాల్లోకి రాకముందు ఆయన అడ్వర్టయిజ్ రంగంలో పని చేశారు. సినిమాలతో పాటు ఆయన పలు టివి సీరియళ్లు కూడా నిర్మించారు.

ఆయన తొలి సినిమా అంకుర్ (1974) భారతదేశంలో ఒక కొత్త ప్రయోగం. న్యూవేవ్ సినిమా వరవడిని సృష్టించిన సినిమా అది. షబానా ఆజ్మీ, స్మితా పాటిల్ వంటి గొప్పనటులను వెండితెరకు పరిచయం చేసింది ఆయనే.

2023లో ఆయన తీసిన బయోగ్రాఫికల్ డ్రామా ‘ముజిబ్ : ది మేకింగ్ అఫ్ ది నేషన్ ( Mujib: The Making of a Nation) ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం. ముజీబుర్‌ రెహ్మాన్‌ కూతురు ప్రస్తుత అప్పటి బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా రిక్వెస్ట్‌ మీద ఈ సినిమా తీశారు.

చేనేత కార్మికుల సమస్యలు, సహకార సంఘాలు విఫలమయ్యాక, మిల్లులు విజృంభించడం, ప్రభుత్వం నుంచి రక్షణ లేకపోవడంతో చేనేత రంగం ఎలా కుదేలయిందో ఆయన 1987లో సుస్మన్ పేరుతో ఒక సినిమా తీశారు. ఇది తెలంగాణ చేనేత కార్మికుల జీవిత చిత్రం. ఈ చిత్రానికి ఎనలేని ఖ్యాతి వచ్చింది. ఎన్నో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ ప్రదర్శింపబడింది.అంతేకాదు, దీనినే కాంచీవరం పేరుతో ప్రియదర్శన్ తమిళ్ లో తీశారు.

Read More
Next Story