వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ
x

వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ

సంక్రాంతి పండక్కీ, ఫ్యామిలతో చూసే ఫన్ మూవీస్ కు ఓ అవినాభావ సంబందం ఉంది.

సంక్రాంతి పండక్కీ, ఫ్యామిలతో చూసే ఫన్ మూవీస్ కు ఓ అవినాభావ సంబందం ఉంది. కొత్త అల్లుళ్లుతో కలిసి సరదాగా అలా థియేటర్ కు వెళ్లి పండగ మూడ్ ని ఎంజాయ్ చేద్దామనుకునే వాళ్లు ఎక్కువ ఉంటారు. అది కనిపెట్టిన చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు ఫన్ తో మిక్స్ చేసిన సినిమలతో వస్తుంటారు. ఈ సంక్రాంతికి కూడా టైటిల్ లోనే సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టుకుని మరీ థియేటర్స్ లో దిగారు. రెండు యాక్షన్ సినిమాలుతో సీరియస్ గా ఉన్న సినిమా ప్రేమికులు ఏ మాత్రం నవ్వించినా బ్లాక్ బస్టర్ చేస్తారనే నమ్మకం వాళ్లది. అది నిజం కాబోతోందా, అసలు ఈ సినిమా కథేంటి, వర్కవుట్ అయ్యే కాన్సెప్ట్ యేనా వంటి విషయాలు చూద్దాం.

స్టోరీ లైన్

యాదగిరి దామోదర రాజు ( విక్టరీ వెంకటేష్) ఓ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌. అన్యాయం జరిగితే తట్టుకోలేడు. రాజును తొలి చూపులోనే చూసి ఇష్టపడుతుంది డీసీపీ మీనాక్షి (మీనాక్షి చౌదరి). అయితే కొన్ని రాజు కొన్ని కారణాలతో ఉద్యోగం విడిచిపెట్టేస్తారు. అది ఇష్టపడని మీనాక్షి బ్రేకప్ చెప్పేస్తుంది. దాంతో ఇద్దరూ విడిపోయి ఎవరి ప్రపంచంలో వాళ్లు పడిపోతారు. రాజు తన ఊరు రాజమండ్రి వెళ్లిపోతాడు. భాగ్యలక్ష్మీ అలియాస్ భాగ్యం (ఐశ్వర్య రాజేశ్)ను పెళ్లి చేసుకుని ఇల్లరికం వెళ్తాడు. నలుగురు పిల్లలు పుడతారు. అలా లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో అతని మాజీ ప్రేయసి జీవితంలోకి ఊహించని ఎంట్రి ఇస్తుంది.

అదెలా అంటే... అమెరికా నుంచి పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ సిఈఓ ఆకెళ్ల సత్యం (అవసరాల శ్రీనివాస్)‌ ఇండియాకు వస్తాడు. ఆయన్ని బిజూ పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. సిఎం (నరేష్)కు ఇది పెద్ద సమస్యగా మారుతుంది. తన అన్న పాప పాండేను విడిచిపెడితేనే ఆకెళ్లను విడిచిపెడతామని చెప్తారు బిజూ గ్యాంగ్. దాంతో ఆకెళ్లను కాపాడటానికి సస్పెండ్ అయిన రాజును డీసీపీ మీనాక్షి సాయంతో వెనక్కి తీసుకొస్తాడు సిఎం.

మీనాక్షి వచ్చీ రావడంతోనే తాను రాజు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌ అని లీక్ చేస్తుంది. దీంతో రాజు జీవితంలో మరో అధ్యాయం ప్రారంభిస్తుంది. అప్పటి వరకు తన భర్తు శ్రీరామ చంద్రుడు అని ఎలాంటి ఫ్లాష్‌ బ్యాక్‌ లు లేవని నమ్మిన భార్య విశ్వరూపం చూపిస్తుంది. వీళ్లిద్దరి మధ్యా యుద్దం మొదలవుతుంది. అంతేకాకుండా తన భర్తను పోలీస్ ఆపరేషన్‌కి పంపేందుకు నిరాకరిస్తుంది. అంతగా వెళ్లాలంటే తాను కూడా వెంటే ఉంటానని కండీషన్‌ పెడుతుంది. ఓ వైపు భార్య, మరోవైపు ప్రియురాలి మధ్య రాజు ఎలా నలిగిపోయాడు?

ఆ తర్వాత ఏం జరిగింది..? అసలు సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్‌తో కథకు లింక్ ఏంటి అనేది స్క్రీన్ మీద చూడాలి.

ఎలా ఉంది

నవ్వించటమే లక్ష్యంగా పెట్టుకుని చేసిన సినిమా ఇది. లాజిక్ వెతకటం మొదలెడితే ఫన్ మిస్సవుతుంది. దర్శకుడు అనీల్ రావిపూడి సినిమా అంటే ఇలాగే ఉంటుందని తెలుసు కాబట్టి చూసేవాళ్లు లైట్ అనుకుంటారు. అలాగే ఫస్టాఫ్ ఫన్ తో పరుగెత్తింది. అయితే సెకండాఫ్ కు వచ్చేసరికి యాక్షన్ ఎపిసోడ్స్ కు చోటు ఇవ్వటం కోసం ఫన్ ని తగ్గించుకుంటూ వెళ్లారు. మళ్లీ ఫన్ తగ్గిపోతోందనే భయంతో ఫోర్సెడ్ గా కొన్ని సీన్స్ కలిపారు. అలా సెకండాఫ్ నవ్వుల డోస్ తగ్గిపోయింది. ఎఫ్ 2 టైప్ లో ఆడ లేడీస్ పై పంచులు బాగానే పేల్చాడు. అలాగే వెంకటేష్ కామెడీ ఇమేజ్ ని వాడుకునే ప్రయత్నం ఫస్ట్ నుంచి చివరి దాకా చేసాడు. మరీ నవ్వులాట కాలేదు. అద్బుతం కాలేదు. అలా ఎపిసోడిక్ నవ్వులతో నడిచిపోయింది.

టెక్నికల్ గా ..

కామెడీ సినిమానే అయినా టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసారు. డైరక్టర్ అనీల్ రావిపూడికి మంచి కామెడీ టైమింగ్ ఉందని మరోసారి ప్రూవ్ అయ్యింది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. పాటల్లో రెండు బ్లాక్ బస్టర్స్...థియేటర్స్ లో జనం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హీరోయిన్స్ ఇద్దరూ పోటీ పడ్డారు ..వెంకటేష్ కామెడీ టైమింగ్ ని అందుకోవటానికి . అయినా ఐశ్వర్యా రాజేష్ ఫుల్ మార్కులు కొట్టేసింది.

చూడచ్చా

మరీ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకపోతే సినిమా బాగానే నచ్చుతుంది. ఫన్ని ఎపిసోడ్స్ ని పండగ నేపథ్యం ఎంజాయ్ చేయచ్చు.

Read More
Next Story