నన్ను వెంటాడే సినిమాలు- 1
x

నన్ను వెంటాడే సినిమాలు- 1

బాలూ మహేంద్ర ‘వీడు‘ ఎందుకు వెంటాడుతుంది (ఫిల్మ్ క్రిటిక్ రామ్ సి మూవీ కాలమ్)


-రామ్ సి

ఆ సినిమాలు చూడడానికి భయంకరమైనవో ,జుగుప్సాకరమైనవో కావు. నా వరకు అవి అతి సున్నితమైనవి. నాలో నాటుకుపోయినవి. వాటిని ఒక సారికి మించి చూసే ధైర్యం నాకు లేనివి. నా మనసును అతలాకుతలం చెయ్యగలిగేవి. తలచుకొంటేనే హృదయం ద్రవించిపోతుందని. అటువంటి సంఘటన మూలంగా తెరకెక్కించిన ఆ కథ అంటే నాకు ఎదో తెలియని కోపం. అవి చూసి తిరిగి మాములు స్థితికి కుదురుకోవడానికి నాకు కొన్ని సార్లు రోజులు,వారాలు, మరికొన్ని అలా నేటికీ కొనసాగుతూనే ఉన్నాయ్. ఆ చూడ్డం కొన్ని ఆలోచనలు నన్ను కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కారణమైయ్యాయి.అటువంటివి సినిమా అనుభవాలు నన్ను పలు సందర్భాల్లో వెంటాడినవి ఇక్కడ పంచుకొంటున్నాను.

అది 1988. స్కూల్ లో 'శాకుంతల' అనే ఓ నృత్య నాటకం కేవలం సంగీతం ఆధారంగా రూపుదిద్దుకొన్నది. దుశ్యంతుvడి పాత్ర పోషిస్తున్న నాకు, ఆ సంగీతంలో ఎదో అద్భుతం ఉందని తోచి, వివరాలు అడిగాను. అప్పుడు తెలిసింది అది 'వీడు' (Veedu :ఇల్లు) అనే తమిళ సినిమాలోని నేపధ్య సంగీతమని, ఆ సినిమాకు నేషనల్ అవార్డులు వచ్చాయని. థియేటర్లో చూసే అవకాశం లేక పోవడంతో, కొద్దీ నెలలకు టీవీలో ప్రసారమవడంతో చూసే అవకాశం వచ్చింది.

'వీడు' సగటు మధ్యతరగతి సొంత ఇంటి ఆశల గుండె చప్పుడు. బాలూ మహేంద్ర (Balu Mahendra) దర్శకత్వం ఇంటి నిర్మాణం చుట్టూ ఉండే అధికార యంత్రాంగం, నిశబ్దంగా జరిగే దోపిడీ, మధ్యతరగతి ఆకాంక్షలు, సంక్షోభం, సామాజిక వాస్తవికత, సామాన్యుని భావోద్వేగల ప్రయాణం. ఇప్పుదేనట డబల్ బెదురూమ్లే ఉచితంగా ఇస్తున్నారు కానీ, కానీ ఓ ముప్పై ఏళ్ల ముందు పరిస్థితులు వేరు.

మధ్యతరగతి కలల నిర్దయమైన వాస్తవికత ఒక సాధారణ సినిమా కాదు, ఇది ఒక అనుభవం. మధ్యతరగతి కుటుంబం సొంతింటి కళను సాకారం చేసుకొనే ప్రయత్నంలో ఎదుర్కొనే నిర్దయమైన పోరాటాన్ని మానవీయ కోణంలో చూపించే చిత్రమిది. సాధారణ చిత్రాలు సమస్యలకు పరిష్కారాలను చూపించడానికో లేదా ఓదార్పును అందించడానికో మార్గం చూపుతాయి. కానీ 'వీడు' అలా కాదు. ఇది మన జీవితాల్లోని కఠినమైన వాస్తవాలను ఎటువంటి అలంకరణలూ లేకుండా చూపిస్తుంది.

సినిమా కథాంశం ఆశపై ఆధారపడినప్పటికీ, అది చుట్టూ ఉన్న వ్యవస్థలు అణచివేసే తీరును అద్భుతంగా చిత్రీకరిస్తుంది. అధికార యంత్రాంగం ఉల్లంఘనల పేరిట, ఉద్యోగుల ఆర్థిక భారాలు, సామాజిక ఒత్తిళ్ల కారణంగా క్రమంగా క్షీణిస్తున్న పరిణామాన్ని తెలియచేస్తుంది. ఓ సాదాసీదా ఇల్లు కట్టాలనే చిన్న కల చివరికి ఓ పరీక్షగా మారుతుంది. విషమంగా తయారవుతుంది. అచేతనం ఆవహిస్తుంది. ఇందులో సామాన్యునికి మనోధైర్యం, క్రమశిక్షణ మాత్రమే ఉంటె సరిపోదు, మనుషుల అవినీతి, వ్యవస్తీకృత అలసత్వాలు ఎదుర్కోవాల్సిన శక్తి కావాలని సూచిస్తుంది.ఈ చిత్రం కేవలం పోరాటాన్ని చూపించదు, ఆ పోరాటం ఎంత భారంగా మారుతుందో ప్రేక్షకులకు అనుభవపరచిస్తుంది.

ఈ కథ సుధ(అర్చన) అనే స్వతంత్ర ఆలోచన కలిగిన చెన్నై మహానగరంలోని యువతిని అనుసరిస్తుంది. ఆమెకు తోడుగా గోపి(భానుచందర్), ఓ తాత(చొక్కలింగం భాగవతార్), చెల్లెలు కోసం ఓ ఇల్లు నిర్మించాలనుకుంటుంది. అద్దె ఇళ్ల జీవితాన్ని వీడి, ఒక స్థిరమైన ఆశ్రయం కలిగి ఉండాలనుకునే ఆమె, ఈ ప్రయాణంలో ఎన్నో కఠినమైన పరీక్షలు ఎదుర్కొంటుంది.

గోపి ఇచ్చిన ధైర్యంతో ముందడుగు వేసి, ఉత్సాహంతో ముందుకు సాగుతుంది. కష్టపడి పని చేస్తే ఏదైనా సాధ్యమేనని నమ్ముతుంది.ఓ స్థలాన్ని కొంటుంది, అవసరమైన అనుమతులు కోసం దరఖాస్తు చేస్తుంది, మరియు తన మిత్రులు, బంధువుల సహాయంతో నిర్మాణాన్ని ప్రారంభిస్తుంది. అక్కడ మొదలండి అసలైన వ్యథ; అధికార వ్యవస్థల గండం, ఆలస్యాల లయ నృత్యం. నిర్మాణ ప్రక్రియ సులభంగా సాగుతుందని అనుకుంటుంది కానీ, అనుమతులు పొందడం అంత సులభం కాదు.అధికారులు అనవసరమైన తప్పులు ఎత్తిచూపుతూ, కొత్త కట్టుబాట్లు విధిస్తూ, లంచాలు అడుగుతూ ఆమె ప్రయాణాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తారు.ప్రతి దశలో అవినీతి, ప్రణాళికల లోపాలు, అనవసరమైన ఆలస్యాలు చోటుచేసుకుంటాయి.

మరో పక్క ఆర్థిక భావోద్వేగ ఒత్తిళ్లు. నిర్మాణ వ్యయం ఊహించిన దానికంటే ఎక్కువగా పెరుగుతుంది. ఆమె జీతం ఆ ఖర్చులను భరించలేని స్థితికి చేరుకుంటుంది. ఒత్తిడికి లోనై, ఆమె శారీరకంగా, మానసికంగా క్షీణించడం ప్రారంభమవుతుంది.మిత్రులు, బంధువులు మొదట సహాయం చేసినా, ఆమె పరిస్థితి మరింత దిగజారిన కొద్దీ దూరమవుతారు. ఎన్నో అవరోధాలను దాటుకుని, తాను అనుకున్నట్లు ఇంటిని పూర్తిచేస్తుంది, కానీ ఆ క్లైమాక్స్ తమిళ సినిమా చరిత్రలోనే అత్యంత హృదయ విదారకమైన ముగింపులలో ఒకటిగా నిలుస్తుంది.

ఎన్నో అవరోధాలను దాటుకుని, తాను అనుకున్నట్లు ఇంటిని పూర్తిచేస్తుంది. కానీ ఈ క్రమంలో తానూ ఎదుర్కొనే కఠినమైన పోరాటం, తీవ్ర ఒత్తిడి, ఆర్థిక నష్టాలు ఆమెను పూర్తిగా మానసికంగా, శారీరకంగా ఖాళీగా మారుస్తాయి.తాత గారు ఇంటిలో అడుగుపెట్టకముందే కన్నుమూయడం కలచివేస్తుంది. ఈ తాతగారు మనకు సినిమా ఇచ్చే ఓ గొప్ప బంధుత్వం. ఒకప్పుడూ గృహసంకల్పనకు ప్రతీకగా భావించిన ఆ ఇంటి గోడలు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తాయి, ఆమె పోరాటం వల్ల లభించినదానికంటే కోల్పోయిందే ఎక్కువని తేలుతుంది.

చివరి ఫ్రేమ్ ఆ జీవితపు చేదు నిజాన్ని ప్రతిబింబిస్తూ, మనం కొన్ని లక్ష్యాలను సాధించేలోపే, వాటిని సాధించాల్సిన అసలు కారణాలు మన చేతుల్లో లేకుండా పోయే ప్రమాదం ఉంటుందని గ్రహిస్తాము. పసివాడ్ని ఆ ముగింపులోని కఠినమైన వాస్తవాలను అంగీకరించడం నా వాళ్ళ కాలేదు. చలించిపోయాను. ఇక ఎప్పటికి సొంతిల్లు అనేది నా జీవితంలో నేను చేయకూడని ప్రయతన్మగా ఉండాలని తీర్మానించుకొన్నాను. కొనసాగిస్తున్నాను. సామాజిక వ్యాఖ్యానం, మరియు మానవ జీవితంలోని నిజమైన పోరాటాన్ని వెల్లడించే ఒక నిశ్శబ్ద గీతం,ఇళయరాజా చేసిన ఆ background మ్యూజిక్ మాయ.

ఈ చిత్రం మానవతావాదాన్ని ప్రశ్నించదు, కానీ సమాజ వ్యవస్థలో మధ్యతరగతి వ్యక్తులు పడే కష్టం ఎంత తీవ్రమై ఉంటుందో హృద్యంగా ,వాస్తవికతకు దగ్గరగా చిత్రీకరిస్తుంది. కళా సాకారానికి , కాకపోవడానికి మధ్య ఉన్న సున్నితమైన గీతను ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఈ సినిమా ఆదర్శాలను కాదు, వాస్తవాలను చూపించటం, ఓ కుటుంబం కళను సాకారం చేసుకోలేక పడే కష్టం, మరో సారి చూసే శక్తి ధైర్యం లేక మళ్లి చూడలేదు. ఆ మ్యూజిక్ ఇక్కడ లింక్ పెట్టాను వినండి, సారాంశం మీకు చేరుతుంది.

Read More
Next Story