రివేంజ్ కాన్సెప్టు : 'రేవు' రివ్యూ
ఈ చిన్న సినిమా కేవలం దిల్ రాజు వంటి నిర్మాత ఇచ్చిన ఓ స్టేట్మెంట్ మూలంగానే జనాలకు తెలిసింది. దిల్ రాజు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ లో మాట్లాడుతూ..
ఈ చిన్న సినిమా కేవలం దిల్ రాజు వంటి నిర్మాత ఇచ్చిన ఓ స్టేట్మెంట్ మూలంగానే జనాలకు తెలిసింది. దిల్ రాజు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ లో మాట్లాడుతూ.. ‘ఈ సినిమా రివ్యూ నేను రాస్తా’అన్నారు. అలాగే ప్రమోషన్స్ లో భాగంగా ‘రేవు పార్టీ’ అని రీల్స్ చేసి చేసి వదిలారు. తెలుసున్న ఆర్టిస్ట్ లు ఎవరూ లేకపోయినా రీసెంట్ గా వచ్చిన కమిటీ కుర్రాళ్లు, ఆయ్ సినిమాలు డిసెంట్ టాక్ తెచ్చుకుని, మంచి రెవిన్యూని రాబట్టుకుని ఒడ్డునపడ్డాయి. మరి ఈ సినిమాకూడా అలాంటిదేనా, అసలు రేవు టైటిల్ కు సినిమా కథకు సంభంధం ఏమిటి... చిత్రం కాన్సెప్ట్ ఏమిటి, చూడదగ్గ సినిమానేనా?
స్టోరీ లైన్
కోస్తా తీరం కాకినాడ ప్రాంతంలో 1993లో ఈ కథ జరుగుతుంది. అక్కడ పాల రేవు అనే ఊళ్లో ఉన్న బావాబామ్మర్దులు అంకులు(వంశీరామ్ పెండ్యాల), గంగయ్య(అజయ్) కు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఎప్పుడూ ఏదో ఒక గొడవ. వీళ్ళు చిన్న నాటు పడవలలో చేపల వేట పోతూంటారు. గొడవలు పడ్డా వీళ్ల జీవితాలు ఏ లోటు లేకుండా కష్టపడి తెచ్చుకున్న సొమ్ముతో బాగానే నడిచిపోతుంది. అయితే వీళ్లు వెళ్లే రేవులోకి నాగేశు(యేపూరి హరి) రావటంతో సీన్ మారిపోతుంది. వీళ్ల జీవితాలు తల క్రిందలు అయ్యే పరిస్దితి వస్తుంది.
నాగేశు ఎన్నో అక్రమ వ్యాపారాలు చేసిన తన డబ్బునంత పెట్టి ఓ పెద్ద మిషన్ బోటు కొని రేవులో వేటకి దిగుతాడు. సముద్రంలో తన బోటుతో వీరవిహారం చేస్తూంటాడు. మరో ప్రక్క అంకాలు, గంగయ్య లవి నాటుబొట్లు. రేవుదాటి వేట చేయలేవు. ఈ క్రమంలో నగేష్ వేటలో పెద్ద మొత్తంలో సరుకు దొరుకుతుంటుంది. దీంతో చేపలు కొనుగోలు చేసే కంపెనీ అంకాలు, గంగయ్య తెచ్చే చిన్న సరకు కొనడం మానేస్తుంది. దాంతో తమ పరిస్దితి తారు మారు అవుతోందని గమనిస్తారు.
ఈ క్రమంలో తమ నాటుబొట్లకి మిషన్ పెడితే సముద్రంలోకి వేటకి వెళ్ళొచ్చనే ఆలోచనతో ఓ పాత మిషన్ కొంటాడు అంకాలు. అక్కడ నుంచి గొడవలు మొదలవుతాయి. అవి ఒకరిని ఒకరిని చంపుకునేదాకా వెళ్తాయి. జీవిన పోరాటం కాస్తా అస్దిత్వ పోరాటంగా మారుంది. అప్పుడు నాగేశ్ ఏం నిర్ణయం తీసుుకంటాడు , అంకాలు, గంగయ్య పరిస్దితి ఏమైంది ? ఈ వేటలో పైచేయి సాధించిదెవరు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
ఎన్నో సార్లు చెప్పుకున్నదే మరోసారి..చిన్న సినిమాకు కథే బలం. కథలో మలుపులు మాత్రమే కాకుండా ఎమోషన్ బలంగా ఉంటేనే నటీనటులు కొత్తా, పాత అని తేడాలేకుండా జనం చూస్తారు. అదే ఈ సినిమాలో లోపించింది. ఫస్టాఫ్ బాగానే నడిచిపోయినా సెకండాఫ్ లో పడవ ముందుకు వెళ్లనని రేవు చేరనని మొండికేసింది. పాత్రల మధ్య సంఘర్షణతో పాటు ఎవరిని ఫాలో అవ్వాలి అనే సంశయం చూసేవారిలో కలిగింది. దానికి తోడు హింసకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఎమోషన్ లేని చోట హింస, అయినా మరొకటి అయినా పలకదు.పండదు. దాని దారి దానిదే..చూసేవాడి దారి చూసేవాడిదే అన్నట్లు ముందుకు వెళ్తుంది. అదే ఈ సినిమాకు జరిగింది. సమస్య వస్తే రోజువారి తగువు పడేవాళఅలు సైతం ఎలా కలిసి నిలపడతారు అనేది చెప్పేలని దర్శకుడు ఉద్దేశ్యం. అయితే ఆ మెయిన్ థీమ్ చెప్పటంలో తడబడ్డారు. ముఖ్యంగా సినిమాలో పాత్రల పరిచయాలు, అసలు కథలోకి తీసుకు వెళ్లేందుకు ఇంటర్వెల్ దాకా సమయం తీసుకోవటంతో ఏమీ జరిగినట్లు అనిపించదు. పోనీ ఇంటర్వెల్ తరువాత నుంచి ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేస్తాడా అదీ పెద్దగా లేదు. ఏదో చూపెడతారు అనుకుంటే ఏమీ లేదు .తేలిపోయినట్లు అనిపించింది.
టెక్నికల్ గా ..
సినిమాని సహజత్వానికి దగ్గరగా రా అండ్ రస్టిక్‌గా తీసారు. మనకు తమిళ సినిమా ప్లేవర్ కనిపిస్తుంది. అలాగే సముద్రంలో చెప్పే కథలు మనకు మామూలే అయినా కొత్త కాంప్లిక్ట్ తీసుకుని గంగపుత్రుల జీవితాలను తెరపై ఆవిష్కరింప చేసే ప్రయత్నం చేసారు. ఇక కొత్తవాళ్లైనా నటీనటుల నుంచి మంచి పర్ఫార్మెన్స్‌లు రాబట్టడంలో దర్శకుడు చాలా వరకూ సక్సెస్ అయ్యాడు. సంగీత దర్శకుడు జాన్ కె జోసెఫ్ పాటలు జస్ట్ ఓకే. వైశాఖ్ మురళీధరన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక ఈ సినిమాలోని సినిమాటోగ్రఫీ బాగుంది. కోస్తా తీర అందాలను బాగా కాప్చర్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
చూడచ్చా
సహజత్వంలో ఉండే పాత్రలతో సాగే ఓ రివేంజ్ చూడాలని ఆసక్తి ఉంటే ఈ సినిమా మంచి ఆప్షన్
ఎక్కడ చూడచ్చు
ప్రస్తుతం థియేటర్స్ లో ఈ సినిమా ఉంది .