దీపావళి బాక్సాఫీస్ యుద్ధం 2025: బ్రేక్ ఈవెన్ దాటి హిట్ కొట్టేదెవరు?
x

దీపావళి బాక్సాఫీస్ యుద్ధం 2025: బ్రేక్ ఈవెన్ దాటి హిట్ కొట్టేదెవరు?

పండుగ కాదు — పరీక్ష ఇది!


దసరా హాలిడే రన్ ముగిసింది. “కాంతారా: చాప్టర్ 1” పూర్తిగా బాక్సాఫీస్‌ను డామినేట్ చేసింది. పవన్ కళ్యాణ్ “ఓజీ” మిక్స్‌డ్ టాక్‌తో బ్రేక్ ఈవెన్ లైన్‌ దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి దీపావళి విండోపై పడింది — తెలుగు మార్కెట్‌లో ఇది కేవలం పండుగ కాదు, “పరీక్షల సీజన్.”

ఎందుకంటే టాలీవుడ్‌లో దీపావళి సీజన్ అనే పదం చాలా కాలం తర్వాత తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చింది. 2010 ఆ టైమ్ లలో దీపావళి అంటే పెద్దగా తెలుగు సినిమాలకు ఫెస్టివల్ లాభం ఉండేది కాదు. ఆ టైమ్ తమిళ్ మార్కెట్ ఈ సీజన్‌ను డామినేట్ చేసేది. కానీ 2022 తర్వాత పరిస్థితి మారింది.

మల్టీప్లెక్స్ కల్చర్, హాలిడే ప్యాటర్న్, మరియు ఫ్యామిలీ అవుటింగ్ కల్చర్ పెరగడంతో — దీపావళి కూడా ఇప్పుడు సెకండ్ డసరా సీజన్ లా మారింది.

దీపావళి సీజన్‌ బాక్సాఫీస్‌కు ఎందుకు కీలకం?

ఫెస్టివల్ సీజన్‌ అంటే తెలుగు మార్కెట్‌లో హై రిస్క్ – హై రివార్డ్ పీరియడ్‌. హాలిడేస్ ఉండటంతో ఫస్ట్ వీక్ కలెక్షన్‌లు బలంగా వస్తాయి, కానీ పోటీ ఎక్కువగా ఉండటం వల్ల. అయితే కంటెంట్ స్ట్రాంగ్ కాకపోతే, రెండో రోజు నుంచే డ్రాప్ గ్యారెంటీ. అందుకే ట్రేడ్ సర్కిల్స్ ఫోకస్ ఇదే — “దీపావళి సీజన్‌లో ఎవరి టాక్‌ సర్వైవ్ అవుతుందో, అదే సినిమా మొత్తం పండగ రన్‌ని దోచుకుంటుంది.”

ఫ్యామిలీ + యూత్ మిక్స్ ఆడియెన్స్:

దసరా వరకు మాస్ సెంటర్స్ బలంగా ఉంటాయి, కానీ దీపావళి వారంలో మల్టీప్లెక్స్ ఆడియెన్స్ యాక్టివ్ అవుతుంది. సెలవులు ఎక్కువగా అర్బన్ సర్క్యూట్‌లో కనబడటంతో, ఇది ఫ్యామిలీ మరియు యూత్‌కి కామన్ కన్వర్జెన్స్ సీజన్.

థియేటర్ బూస్ట్ & కాంపిటీషన్ ఎఫెక్ట్

దీపావళి వారం అంటే, ఒక సీజన్‌లో థియేటర్ రివెన్యూ 100–120% పెరుగుతుంది. కానీ అదే సమయంలో 3–4 సినిమాలు క్లాష్ కావడం వల్ల సర్వైవల్ కర్వ్ చాలా స్టీప్ అవుతుంది. అంటే — మొదటి 3 రోజుల్లో టాక్ బాగుంటేనే సినిమా నిలబడుతుంది.

వర్డ్ ఆఫ్ మౌత్ డొమినేషన్

దీపావళి సీజన్‌లో మీడియా హైప్, సోషల్ బజ్, షార్ట్ రివ్యూలు — ఇవన్నీ కలిపి మొదటి రోజు నుంచే సినిమా ఫేట్ నిర్ణయిస్తాయి. ఇక్కడ “పబ్లిసిటీ కాదు — పర్సెప్షన్” హిట్ అవుతుంది. అంటే, ఎవరి సినిమాకు పాజిటివ్ వైబ్ వస్తే, అది 48 గంటల్లో డబుల్ వాల్యూ సాధిస్తుంది.

ఈసారి సీజన్ స్పెషాలిటీ – నలుగురు కొత్త దర్శకుల డెబ్యూ ఫైర్‌టెస్ట్!

ఈ దీపావళి సీజన్‌కి నిజమైన ట్విస్ట్ ఇదే — నాలుగు సినిమాలు, నలుగురు కొత్త దర్శకులు. పండుగ సీజన్‌లో కొత్త క్రియేటర్స్ పరీక్షించడం అంటే రిస్క్‌ కూడా, అవకాశం కూడా.

మిత్ర మండలి – నవ్వులు పూయించలేకపోయిన కామెడీ స్టార్ట్

ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎం నటించిన ‘మిత్ర మండలి’ ద్వారా కొత్త దర్శకుడు విజయేందర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా హైప్ ఉన్నా, మార్నింగ్ షోకే నెగటివ్ టాక్ రావడంతో ఈ మూవీ ఫస్ట్ డే ఫెయిల్ అయింది.

ట్రేడ్ యాంగిల్ ప్రకారం

“మిత్ర మండలి” మేకర్స్ సొంతంగా రిలీజ్ చేయడం వల్ల పెద్ద నష్టం లేనప్పటికీ, కంటెంట్ రిజిస్టర్ కాకపోవడం థియేటర్ రన్‌ను కట్ చేసింది. ఇది ఒక రిమైండర్ — పండుగ సీజన్‌లోనూ కంటెంట్ ఫస్ట్ ఇంప్రెషన్‌కి ప్రత్యామ్నాయం లేదు.

తెలుసు కదా – స్టైల్ ఉన్నా సబ్‌స్టెన్స్ మిస్సింగ్

సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కాంబినేషన్‌లో వచ్చిన ‘తెలుసు కదా’, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ కాబట్టి బాక్సాఫీస్ వద్ద హై ఎక్సపెక్టేషన్‌తో వచ్చింది. కానీ డైరెక్టర్ నీరజా కోన తన మొదటి సినిమాకి తీసుకున్న స్టైలైజ్డ్ టోన్ కథలో డెప్త్ లేకపోవడంతో నెగటివ్ అయింది.

రివ్యూస్ ఇలా: “విజువల్స్ రిచ్‌గా ఉన్నా, ఎమోషన్ లేయర్ లోపించింది.”

ట్రేడ్ టాక్

ఫస్ట్ డే గుడ్ ఓపెనింగ్ – సెకండ్ డే డ్రాప్ 40% వరకు అంచనా. ఇది క్లాసిక్ ఉదాహరణ — సినిమా కాదు, వర్డ్ ఆఫ్ మౌత్ రన్ చేయిస్తుంది.

డ్యూడ్ – ప్రదీప్ రంగనాథన్ యూత్ కనెక్ట్ క్వశ్చన్ మార్క్

తమిళ్ మార్కెట్‌లో బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ప్రదీప్ రంగనాథన్ “డ్యూడ్”తో మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ చేసి మైత్రి మూవీ మేకర్స్ సపోర్ట్ తీసుకున్నాడు. డైరెక్టర్ కీర్తిశ్వరన్ ఈ మూవీ ద్వారా పరిచయం అయ్యాడు. కాన్సెప్ట్ “కన్యాదానం థీమ్” కావడంతో ఫ్యామిలీ, యూత్ మిక్స్ కంటెంట్‌గా బజ్ వచ్చింది. కానీ టాక్ ఇలా ఉంది — “కంటెంట్ ఎమోషన్ బాగుంది కానీ కొత్తగా లేదు.”

ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూ:

మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌లో డీసెంట్ ఫుట్‌ఫాల్ ఉన్నా, మాస్ సర్క్యూట్‌లో “లవ్ టుడే” రేంజ్ అందుకోలేదు. మొత్తానికి – “డ్యూడ్” వర్కబుల్ కానీ సెన్సేషన్ కాదు.

K ర్యాంప్ – మాస్ ఫాలోయింగ్‌పై కిరణ్ అబ్బవరం నమ్మకం

అక్టోబర్ 18న రిలీజ్ అవుతున్న K ర్యాంప్ ఈ దీపావళి రేస్‌లో లాస్ట్ ఎంట్రీ, హై హోప్. కిరణ్ అబ్బవరం కంటిన్యూ చేస్తున్న “మాస్ యువతర్ ఇమేజ్” ఇక్కడ కూడా కనపడుతోంది. డైరెక్టర్ జైన్స్ నాని తొలి చిత్రమిది, కామ్నా జెఠ్మలానీ స్పెషల్ రోల్‌, యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించారు.

ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం:

“K ర్యాంప్ ట్రైలర్ యూత్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్‌లో వర్డ్ ఆఫ్ మౌత్ హెల్ప్ చేస్తే సర్ప్రైజ్ హిట్ అవ్వొచ్చు.” ఈ సినిమా మాస్ + రొమాంటిక్ కాంబినేషన్ కావడం వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా కట్టిపడేసే అవకాశం ఉంది.

ట్రేడ్ ఎనాలసిస్ – దీపావళి బాక్సాఫీస్ ఈసారి ఎవరి చేతుల్లో?

మిత్ర మండలి – నెగటివ్ టాక్‌తో అవుట్

తెలుసు కదా – మిక్స్‌డ్ రివ్యూస్, సేఫ్ జోన్ డౌట్

డ్యూడ్ – డీసెంట్ ఓపెనింగ్, స్లో సస్టైన్

K ర్యాంప్ – లాస్ట్ ఎంట్రీ, బిగ్ హోప్

ఈ నాలుగు సినిమాల ఫేట్ ఒక పాయింట్ మీదే నిలిచిపోయింది — వర్డ్ ఆఫ్ మౌత్!

దీపావళి సీజన్‌లో సోషల్ మీడియాలో ఒక్క నెగటివ్ హ్యాష్‌ట్యాగ్‌ కూడా బాక్సాఫీస్ కలెక్షన్‌ను కట్ చేయగలదు. ఇకపోతే ఒక పాజిటివ్ రివ్యూ వైరల్ అయితే, మధ్యస్థాయి సినిమా సడెన్‌గా బ్లాక్‌బస్టర్ ట్రాక్‌లోకి వెళ్తుంది.

ట్రేడ్ వర్గాల అంచనా

“దీపావళి వారం లో ఎవరికి కంటెంట్ బలంగా ఉంటుందో అదే సినిమా వచ్చే నెల కలెక్షన్‌లకు టోన్ సెట్ చేస్తుంది.” “ఇది నంబర్స్ గేమ్ కాదు, పర్సెప్షన్ గేమ్. ఎవరికి సోషల్ వైబ్ వర్కౌట్ అవుతుందో, అదే సీజన్ కింగ్.”

ఫైనల్ లైన్

ఈ దీపావళి సీజన్ టాలీవుడ్‌కి ఒక రియాలిటీ చెక్ లాంటిది. ఇక్కడ స్టార్ పవర్‌కి మించినది కంటెంట్, మార్కెటింగ్ కంటే బలమైనది మౌత్ టాక్,

బడ్జెట్ కంటే విలువైనది ఆడియెన్స్ కనెక్ట్. నలుగురు కొత్త దర్శకులు, నాలుగు వేర్వేరు కాన్సెప్ట్‌లు, ఒకే పండుగ రేస్‌ — ఇది టెస్ట్ ఆఫ్ కరేజ్ మాత్రమే కాదు, టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ.

మరి ఈ దివాళీకి ఏ సినిమా లక్ష్మీ బాంబ్ లా సౌండ్ చేస్తుంటే.. ఏది తస్సుమంటుందో చూడాలి.

Read More
Next Story