త్రిష ఐడెంటిటీ ఓటీటీ మూవీ రివ్యూ!
x

త్రిష 'ఐడెంటిటీ' ఓటీటీ మూవీ రివ్యూ!

మళయాళ దర్శకులు బాగా చిన్న పాయింట్ల‌తో సినిమా తీస్తున్నారు. పాయింట్ బాగుంటుంది.

మళయాళ దర్శకులు బాగా చిన్న పాయింట్ల‌తో సినిమా తీస్తున్నారు. పాయింట్ బాగుంటుంది. కానీ దాన్ని ప‌ట్టుకొని రెండున్న‌ర గంట‌ల సినిమా తీయ‌డం మాత్రం క‌త్తి మీద సాము లాంటి వ్య‌వ‌హారమే. ‘ఐడెంటిటీ’ ఓ చిన్న పాయింట్ ని బేస్ చేసుకొన్న క‌థ‌. పాయింట్ గా చూస్తే… ఓ థ్రిల్ల‌ర్ కి ఉండాల్సిన ఇంట్ర‌స్టింగ్ ఎలిమెంట్స్ క‌నిపిస్తున్నాయి. అలా టోవినో థామస్ హీరోగా మలయాళంలో రూపొందిన సినిమానే 'ఐడెంటిటీ'. అఖిల్ పాల్ - అనాస్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జనవరి నెల 2వ తేదీన అక్కడి థియేటర్లలో విడుదలైంది. నెలలోపే స్ట్రీమింగ్ కు వచ్చేసింది. త్రిష కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా కథేమిటి, చూడదగ్గ కంటెంటేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ అలీషా అబ్దుల్ సల్మాన్ (త్రిష). ఆమె ఓ కేసుని ఇన్విస్టిగేట్ చేస్తున్న క్రమంలో ఒక హత్యను కళ్లారా చూస్తుంది. అక్కడ నుంచి వచ్చేస్తూ అనుకోకుండా రోడ్డు యాక్సిడెంట్ కు గురవుతుంది. ఇక ఆ హత్య కేసు ని సీఐ అలెన్‌ జాకబ్‌ (వినయ్‌ రాయ్‌) డీల్ చేస్తూంటాడు. కీలకమైన ప్రత్యక్ష సాక్షి అలీషాకు ప్రాణహాని ఉండటంతో.. ఆమెను మారుపేరుతో ఓ చోట ఉంచి, తన చెల్లిగా చెప్పి విచారణ చేస్తూంటాడు. రోడ్డు ప్రమాదంలో మెదడు దెబ్బ తినడం వల్ల అలీషా మనుషుల్ని గుర్తు పట్టలేకపోతుంది.

అలీషా చూసిన హంతకుడు బొమ్మ గీయటానికి స్కెచ్‌ ఆర్టిస్ట్‌ హరన్‌ శంకర్‌ (టొవినో థామస్‌) ని తీసుకొస్తారు. హరన్ శంకర్ ... అలీషా చెప్పినట్లుగా హంతకుడి ఊహా చిత్రాన్ని గీసి అలెన్‌కు ఇస్తాడు. అయితే ఆమె చెప్పిన క్లూలు అన్నీ ఆ స్కెచ్ ఆర్టిస్ట్ ని పోలి ఉంటాయి. దాంతో ఆమె ఏం చెప్తోందో...తెలియటం లేదని అంటారు. అప్పుడే అలెన్‌కు కేసు విషయమై ఓ క్లూ దొరుకుతుంది. దీంతో అక్కడి నుంచి హరన్‌ను ఛేజ్ చేయటం మొదలు పెడతాడు. ఈ ప్రాసెస్ లో ఏ నిజాలు బయిటకు వచ్చాయి? అసలు హరన్‌ శంకర్‌ ఎవరు? తను స్కెచ్‌ ఆర్టిస్ట్‌గా అలెన్‌ కేసులోకి ఎందుకొచ్చాడు? ఇంతకీ హంతకుడు ఎవరు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉంది

దర్శకుడు అఖిల్ పాల్ సినిమాల్లో ఓ ప్రత్యేకత ఉంటుంది, రెగ్యులర్ గా మన జీవితాల్లో జరిగే విషయాలను తీసుకుని స్క్రిప్టు రాస్తాడు. గతంలో వచ్చిన సెవంత్ డే, ఫోర్సినిక్ సినిమాలు కూడా అలాంటివే. అలాగే ఆడియన్స్ ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే కథలో క్యారక్టర్స్ విషయాలు తెలిసేలా స్క్రీన్ ప్లే రాసుకోవటం తో చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి సీన్స్. ఐడెంటిటీ విషయానికి వస్తే ఓ సింపుల్ రివేంజ్ స్టోరీలాగ కనిపిస్తుంది కానీ దాన్ని భారీగా స్క్రీన్ ప్లే చేయటంతో సినిమా ఓ స్దాయికి వచ్చేసరికి అలిసిపోతాము.

కొంత అర్దమవుతున్నట్లే ఉంటుంది అర్దంకాదు. డైరక్టర్ ఉద్దేస్యం కూడా అదే కావచ్చు. ఒక్కో ముడి విప్పే విధానం కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది. చివర్లో అసలేం జరిగిందో ఎక్సప్లై్ చేసేటప్పుడు మొత్తం ఎనర్జీ లాగేసుకుంటారు. దాంతో ఈ సంక్లిష్టత ఎక్కువ అవటంతో సినిమాలో ఏదైతే హైలెట్ కావాలో ఆ వావ్ ఫ్యాక్టర్ మిస్సైంది. లీనియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హీరో ..పూర్తిగా విలన్ కథలో ఓ సబ్ ప్లాట్ లా కనపడతాడు కానీ హీరోగా అనిపించడు. కనిపించడు.

టెక్నికల్ గా చూస్తే...

పాయింట్ గా చిన్న‌దే అయినా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేసారు. ముఖ్యంగా ఫ‌స్టాఫ్‌లో సెటప్ సీన్స్ బాగా డీల్ చేశాడు. క్వాలిటీ మేకింగ్ కనిపించింది. పాట‌ల‌కు స్కోప్ లేదు. అన‌వ‌స‌రంగా వాటిని ఇరికించే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు. అయితే కథ విష‌యంలో ద‌ర్శ‌కుడు ఇంకాస్త జాగ్ర‌త్త తీసుకొని కరసత్తు చేస్తే క‌చ్చితంగా ఈ సినిమా ఓ స్థాయిలో నిలిచేది. స్క్రీన్ ప్లే లోపాలు, చిన్న పాయింట్ కావ‌డం వ‌ల్ల‌..ఆ ప్ర‌య‌త్నం స‌గంలోనే ఆగిపోయింది.

నటీనటుల్లో టోవినో థామస్ .. వినయ్ రాయ్ ఈ సినిమాకి హైలైట్ గా చేసారు. త్రిష సినిమా మొత్తం కనిపిస్తుంది. కానీ కథలో పెద్దగా కీలకమైన మార్పులు తీసుకురాదు.

చూడచ్చా

సినిమాపైనే పూర్తి దృష్టి పెట్టి, వేరే ఏవిగేషన్స్ లేకుండా చూడగలిగితేనే ఈ సినిమాని ఎంజాయ్ చేయగలుతారు. స్క్రీన్ ప్లే మొత్తం కాంప్లెక్సిటీ తో నిండి ఉండటంతో రెగ్యులర్ ఆడియెన్స్ ఎంజాయ్ చేయటం కాస్తంత కష్టమే. బ్రెయిన్ కి పూర్తి పని పెట్టాలంటే ఓ లుక్కేయండి

ఎక్కడుంది.

జీ5 ఓటిటిలో తెలుగులో ఉంది.

Read More
Next Story