ముందు కొచ్చింది ముగ్గురు హీరోలే
x

'ముందు' కొచ్చింది ముగ్గురు హీరోలే

తెలుగు రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తాయి. ఈ క్రమంలో ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలు రెండు రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు.


తెలుగు రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తాయి. పలువురు ప్రాణాలు కోల్పోవడంతో పాటు తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. ఇంకా కొన్ని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీళ్లలోనే మునిగి ఉన్నాయి. ఈ క్రమంలో ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలు రెండు రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు. జూనియర్ ఎన్ఠీఆర్, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నల గడ్డ తమవంతు సహాయాన్ని ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ ఉభయ రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆయనతోపాటు యువ హీరోలు కూడా తమవంతు ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు.

"రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం న నియంతగాను కలచివేసింది అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయనిధికి చెరొక రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.

డీజే టిల్లు సినిమాతో ఉభయ రాష్ట్రాల్లో అభిమానుల్ని సంపాదించుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా కీలక ప్రకటన చేశారు. "తెలుగు రాష్ట్రాలను ఇలా వరదలు ముంచెత్తడం చాలా బాధాకరమైన విషయం. ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఇంకెవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు అనిపిస్తోంది. ఈ వరదలు చాలా కుటుంబాలను కష్టాల్లోకి నెట్టేసాయి. ఇలాంటి సమయాల్లో మనం ఒకరికొకరు తోడుగా ఉండటం అత్యవసరం. వరద బాధితులకు నా వంతు సహకారంగా 30 లక్షల ఆర్థిక సహాయాన్ని (రూ.15 లక్షలు ఆంధ్ర ప్రదేశ్ కి + రూ.15 లక్షలు తెలంగాణకి) వరద సహాయ నిధికి ప్రకటిస్తున్నాను. ఇది కొంతమందికైనా ఏదో ఒకవిధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను" అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఇటీవల కల్కి మూవీతో భారీ సక్సెస్ అందుకున్న వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి విరాళం ప్రకటించింది. రూ. 25లక్షలు డొనేట్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ రాష్ట్రం మాకు చాలా ఇచ్చింది, మరి ఇలాంటి క్లిష్టమైన సమయంలో తిరిగి ఇవ్వడం మా బాధ్యత అని మేము భావిస్తున్నాము అంటూ యాజమాన్యం చెప్పుకొచ్చింది.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నా వంతు సహాయంగా తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరొక ఐదు లక్షలు ప్రకటిస్తున్నానని చెప్పారు హీరో విశ్వక్సేన్. "ఈ విపత్తు సమయంలో, రాష్ట్రంలో వరద సహాయక చర్యలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి రూ. 5 లక్షలు, ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి రూ. 5 లక్షలు విరాళంగా ఇస్తున్నాను. వరదల వల్ల నష్టపోయిన వారి బాధలను తగ్గించే దిశగా ఈ సహకారం ఒక చిన్న అడుగు" అంటూ ట్వీట్ చేశారు.

Read More
Next Story