మోదీకి శుభాకాంక్షలు తెలిపిన సూపర్ స్టార్
x

మోదీకి శుభాకాంక్షలు తెలిపిన సూపర్ స్టార్

వరుసగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోదీకి సూపర్ స్టార్ రజనీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు.


ప్రధానిగా మూడో సారి బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోదీకి సూపర్ స్టార్ రజనీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. మూడో సారి ప్రధానిగా ఎన్నిక కావడం గొప్ప విజయమని అన్నారు. అలాగే ప్రజలు బలమైన ప్రతిపక్షాన్ని సైతం ఎన్నుకున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన సంకేతమని సూపర్ స్టార్ వ్యాఖ్యానించారు.

తన నివాసం నుంచి ఢిల్లీకి బయలుదేరే ముందు విలేకరులతో ఆయన మాట్లాడారు. అగ్ర నాయకుడు జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత, మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఒక ఘనత అని అన్నారు. నరేంద్ర మోదీ, ఆయన కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం చెన్నై విమానాశ్రాయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టడం నరేంద్ర మోదీ సాధించిన పెద్ద విజయం, ఆయనకు నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజలు బలమైన ప్రతిపక్షాన్ని ఎన్నుకున్నారు, ఇది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన సంకేతం. రాబోయే ఐదేళ్లలో తన అంచనాలపై అడిగిన ప్రశ్నకు, పాలన బాగుంటుందని, అదే తాను ఆశించినట్లు చెప్పారు.


Read More
Next Story