పోతుగడ్డ  (ఈటీవీ విన్) ఓటీటీ మూవీ రివ్యూ
x

'పోతుగడ్డ' (ఈటీవీ విన్) ఓటీటీ మూవీ రివ్యూ

రాజకీయాలు, పరువు హత్యలు కలిపి వాస్తవ సంఘటనలు ఆధారంగా రాసుకున్న విలేజ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది.

ఓటీటీలో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకి మంచి డిమాండ్ ఉంది. అయితే ఆ కాన్సెప్ట్ ని చక్కటి కథగా మలిచి, సరైన ట్రీట్మెంట్ తో ఇంట్రెస్టింగ్ గా, ఇంటెన్స్ ని మిళితం చేసి చెప్పగలగాలి. లేకపోతే ఈ స్టార్స్ లేని సినిమాలు సోదిలోకి రావు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని రేపింది. ఇది కూడా కాన్సెప్ట్ సినిమానే. రాజకీయాలు, పరువు హత్యలు కలిపి వాస్తవ సంఘటనలు ఆధారంగా రాసుకున్న విలేజ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. మరి ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులని అలరించేలా ఉందా? ఇందులో వుండే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేశాయా?

స్టోరీ లైన్:

ఎలక్షన్ టైమ్ లో జరిగే కథ ఇది. కర్నూలు జిల్లాలోని పోతుగడ్డ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నిక‌లుకు రంగం సిద్దమవుతుంది. పదవిలో పదేళ్లుగా కొనసాగుతున్న పోతుగ‌డ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే స‌ముద్ర‌ (ఆడుకాలం న‌రేన్‌) ఎలాగైనా మరోసారి సీట్ దక్కించుకోవాలని పట్టుదలగా ఉంటాడు. మరో ప్రక్క అతన్ని ఎలాగైనా ఓడించి ఎమ్మల్ేయ అవ్వాలని భాస్క‌ర్ (శ‌త్రు) నిర్ణ‌యించుకుంటాడు. ఇద్దరు పోటాపోటీగా ఉంటారు. భాస్కర్ డబ్బుని వెదజల్లి గెలవాలని, ఎన్నిక‌ల ముందు నుంచే కూడబెట్టడం మొదలుపెడతాడు.

అయితే, సముద్ర తక్కువోడేం కాదు. మహిళలు, యూత్ ఓట్లకు గాలం వేయడానికి కూతురు గీత (విస్మయ శ్రీ)ని రంగంలోకి దింపాలనుకుంటాడు. ఆమెను పార్టీలో 'జిల్లా యూత్ ప్రెసిడెంట్' చేస్తాడు సముద్ర. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే గీతకు రాజకీయాలు అంటే నచ్చవు. తాను ప్రేమించిన అబ్బాయితో కృష్ణ (ఫృథ్వీ దండ‌మూడి) క‌లిసి పారిపోవాల‌ని ప్లాన్ వేస్తుంది. ఆ క్రమంలో ఓ ప్లాన్ వేసుకుని ఒకరోజు గీత, కృష్ణ ఇద్దరు కలిసి బస్సులో పారిపోతారు.

ఆ విషయం సముద్రకు తెలిసి తన మనుష్యులను వాళ్లను పట్టుకోమని, అవసరమైతే చంపేయమని పురమాయిస్తాడు. మ రో ప్రక్క వాళ్లు ఎక్కిన అదే బస్సులో భాస్క‌ర్ తను పంచాల్సిన యాభై కోట్ల డబ్బుని కూడా దాచిపెడతాడు. ఆ విషయం పోలీసులకు తెలుస్తుంది. అప్పుడు ఏమైంది. ఆ జంట ప్రేమ గెలిచిందా. ఆ డబ్బు విషయం బయటకు వచ్చిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథా, కథన విశ్లేషణ

సాధారణంగా డైరెక్ట్ ఓటీటీ సినిమాలు కాన్సెప్టు ప్రధానంగా సాగుతాయి. కాన్సెప్ట్ ని కథలో ఎంతో ఆసక్తికరంగా మిళితం చేస్తున్నామనే పాయింట్ మీద సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి చిన్న సినిమాల్లో లార్జర్ దెన్ లైఫ్ ఎలిమెంట్స్ ని డీల్ చేయకుండానే ఉంటేనే బెస్ట్. ఎందుకంటే లిమిటెడ్ బడ్జెట్ కు గ్రాండ్ స్కేల్ ఎలాగో వర్కవుకాదు. కథలో ప్రేక్షకులు లీనం చేస్తే చాలు. ఈ సినిమాలో ఆ లోటు స్పష్టంగా కనిపించింది. ఇందులో కాన్సెప్ట్, కథ, ప్రెజంటేషన్ దేనికవే అన్నట్టుగా కనిపిస్తాయి.

కాన్సెప్ట్ లో వున్న బలం.. ప్రజంటేషన్ లోకి వచ్చేసరికి తేలిపోయింది. ముఖ్యంగా ఎమోషన్ వర్కవుట్ కాలేదు. చూసేవారు లవ్ స్టోరీని ఫాలో కావాలా లేక రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరును ఫాలో కావాలో అర్థంకాని సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది. కథా నేపథ్యం ఆసక్తికరంగా వుంటుంది. అయితే ఈ కథలో విలనీ ఎలిమెంట్ బలహీనంగా ఉంటుంది. డైరెక్టర్ దగ్గర ఒక క్లైమాక్స్ ట్విస్ట్ ఉంది. అదొక్కటే సినిమాకు సరిపొతుందనుకున్నారేమో కానీ పరుగులు పెట్టాల్సిన కథ ఏవో సాదాసీదా సన్నివేశాలతో ఎలాంటి థ్రిల్స్ లేకుండానే మెల్లగా కదులటమే దెబ్బ తీసింది.

టెక్నికల్ గా చూస్తే ...

ఈ సినిమాకు స్క్రిప్టే వీక్. మిగతావన్నీ బాగానే అనిపిస్తాయి. నేపథ్యం సంగీతం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలా చోట్ల బీజీఎం తోనే థ్రిల్ పెంచాడు. కెమెరా పనితనం డీసెంట్ గానే వుంది. అయితే చాలా చోట్ల డైలాగులుని బీజీఎం మింగేసింది.

హీరో,హీరోయిన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కానీ వారిని పెద్దగా వాడుకో లేదనిపించింది. నిజానికి మంచి క్రైమ్ థ్రిల్లర్ గా చిత్రంగా మలిచే అవకాశం వున్న కాన్సెప్ట్ ఇది. అయితే దర్శకుడు వేసుకున్న సెటప్ దానికి పెద్ద స్కోప్ ఇవ్వలేదు. హీరో ,లవ్ స్టోరీ ఫీలింగ్, ఎమోషన్స్ తో ఆడియన్ ఎంపతైజ్ చేయడంలో డైరెక్టర్ ఇంకా వర్క్ చేయాల్సింది.

చూడచ్చా

అద్బుతమైన క్రైమ్ థ్రిల్లర్ కాదు కానీ కాలక్షేపానికి ఓ సారి చూసేయొచ్చు.

ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది

మూవీ పోతుగ‌డ్డ (Pothugadda) మూవీ డైరెక్ట్ ఓటీటీలో రిలీజైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో చూడచ్చు.

Read More
Next Story