తిరగబడర సామీ మూవీ రివ్యూ…
x

తిరగబడర సామీ మూవీ రివ్యూ…

ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో రాజ్ తరుణ్ వరుస సక్సెస్‌లను అందుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం రాజ్ తరుణ్ తన మ్యాజిక్ ని ఏమాత్రం రిపీట్ చేయలేకపోతున్నాడు.


-వేల్పుల గోపి

ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో రాజ్ తరుణ్ వరుస సక్సెస్‌లను అందుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం రాజ్ తరుణ్ తన మ్యాజిక్ ని ఏమాత్రం రిపీట్ చేయలేకపోతున్నాడు. ఇక ఒకానొక సందర్భంలో ఆయనకు హీరోగా కూడా అవకాశాలు లేకపోవడంతో నాగార్జున లాంటి స్టార్ హీరో చేసిన 'నా సామిరంగా' సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన సినిమాల్లో హీరోగా ఎంత పాపులారిటిని సంపాదించుకున్నాడు అనే విషయం పక్కన పెడితే గత కొన్ని రోజుల నుంచి ఆయన ఒక వివాదంలో చిక్కుకున్నాడు. ఇక దీనివల్ల సోషల్ మీడియాలో ఎప్పుడు చూసినా ఆయనకి సంబంధించిన న్యూసే వస్తుంది. ఇక దాంతో సోషల్ మీడియాలో రోజూ అదే న్యూస్ వైరల్‌గా నిలుస్తుంది. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా దీని గురించే డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి.


ఇక ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు కూడా ప్రస్తుతం రాజ్ తరుణ్ పేరు జనాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. కాబట్టి ఆ పబ్లిసిటీని మనం కూడా వాడుకోవాలనే ఆలోచన చేసి ఆయన హీరోగా చేసిన సినిమాలను వరుసగా రిలీజ్ చేస్తున్నారు. గతవారం రాజ్ తరుణ్ హీరోగా చేసిన 'పురుషోత్తముడు ' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయినప్పటికీ ఆ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది...ఇక ఈ వారం 'తిరగబడర సామీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఆయన ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేశాడు. ఈ మూవీ ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుందనే విషయాల్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...


కథ


ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే గిరి (రాజ్ తరుణ్) చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి ఒక అనాధ పిల్లాడిలా పెరుగుతాడు. ఇక ఈ క్రమంలోనే తను ఎలాగైతే తన ఫ్యామిలీ నుంచి దూరమై ఇబ్బందులు పడుతున్నాడో అలాంటి ప్రాబ్లమ్స్ మరెవరు పడకూడదనే ఉద్దేశ్యంతో ఎవరైతే కుటుంబాలకి దూరమయ్యారో వాళ్ళందరిని వెతికి పట్టుకొని వాళ్ల పేరెంట్స్ దగ్గరికి చేరుస్తూ ఉంటాడు... ఇక గిరి చేస్తున్న మంచి పనుల గురించి తెలుసుకున్న ఒక టీవీ ఛానల్ వాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేస్తారు.


ఇక ఆ ఇంటర్వ్యూలో శైలజా (మాల్వి మల్హోత్ర) అతన్ని చూసి ఇష్టపడుతుంది. వీళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రేమించుకుంటారు. కొద్దిరోజులకే పెళ్లి కూడా చేసుకుంటారు... ఇక ఈ క్రమంలోనే శైలజా కోసం కొండారెడ్డి అనే రౌడీ ముఠా వెతుకుతూ ఉంటారు... ఇక ఇదిలా ఉంటే కొండారెడ్డికి శైలజా కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? శైలజా ని కొండారెడ్డి భారీ నుంచి గిరి కాపాడడా లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే...


విశ్లేషణ


ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి ఈ సినిమాలో ఏం చెప్పాలనుకున్నాడో తనకి కూడా సరైన క్లారిటీ లేకుండా పోయింది... ఒకప్పుడు యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి కమర్షియల్ సినిమాలతో మంచి సక్సెస్‌లను అందుకున్న ఆయన ఇలాంటి నాసిరకం స్క్రిప్ట్ ను తయారు చేసుకొని సినిమా చేయాలని తనకు ఎందుకు అనిపించిందో కూడా మనకు అర్థం కాదు... కమర్షియల్ ఫార్మాట్ లో ఒక సినిమా చేసి సక్సెస్ కొట్టడం అన్నది కత్తి మీద సాము లాంటిది. కొంచెం తేడా కొట్టిన కూడా మొదటికే మోసం వస్తుందనే విషయం సినిమాలు తీసే దర్శకులు గుర్తుంచుకుంటే ఇక మీదట మంచి సినిమాలు తీయొచ్చు. ఇక ఈ సినిమాలో కథ ఏమి లేదు. ఫస్టాఫ్ లో కొంచెం లవ్ స్టోరీ ని నడిచారు. ఇక ఆ తర్వాత గిరి శైలజా పెళ్లి అవుతుంది. మరి ఆ లవ్ స్టోరీ కూడా అంత ఎంగేజింగ్ గా ఉందా అంటే అది కూడా లేదు.


అది చాలా బోర్ గా రొటీన్ గా సాగుతుంది. ఇక ఒకటి రెండు సీన్లలోనే ఇద్దరి మధ్య ఇంటిమసి పెరిగి ఒకరినొకరు ప్రేమించుకోవడం ఏంటో? ఆ వెంటనే పెళ్లి చేసుకోవడం ఏంటో ఇదంతా ఆ సీన్లు రాసిన దర్శకుడికే తెలియాలి. ఇక కొండారెడ్డి పాత్రకు కూడా అంత పెద్ద వెయిట్ అయితే ఏమీ లేదు. ఏదో రౌడీ ఉండాలి కాబట్టి ఉన్నాడు అన్నట్టుగా చూపించాడు తప్ప ఆయన వాళ్ల హీరో హీరోయిన్స్ కి ఎలాంటి నష్టం జరగబోతుంది అనేది మాత్రం అంత ఎఫెక్టివ్ గా చూపించలేకపోతున్నాడు. ఇక ఈ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కి ఒక పర్పస్ అనేది ఉండదు. వాళ్ళు ఎందుకు వస్తున్నారో ఎందుకు వెళ్లిపోతున్నారో సినిమా చూసే ప్రేక్షకులకు ఏం అర్థం కాదు...స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే ఒక్కో క్యారెక్టర్ యొక్క బ్యాక్ స్టోరీ ఏంటి? అనేది క్లియర్ గా రాసుకుంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవు...ఇక ఈ సినిమాలో కొన్ని ట్విస్ట్ లు కూడా పెట్టారు. సినిమా చూసే ప్రతి ఒక్క ఆడియన్ కూడా ఆ ట్విస్ట్ లను ఈజీగా ఎక్స్ పెక్ట్ చేయచ్చు..


అసలు ఈ సినిమా ద్వారా దర్శకుడు ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నాడు అనే విషయం మీద కూడా సరైన క్లారిటీ అయితే ఉండదు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే అస్సలు బాగాలేదు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గురించి అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు... రాజ్ తరుణ్ ఎప్పటిలాగే ఒక రొటీన్ స్టోరీ తో సినిమా చేశాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఒకే పాటర్న్ లో అరిగిపోయిన క్యాసెట్ మాదిరిగా వస్తూనే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఏ మాత్రం కొత్తదనం లేకుండా ఇప్పటికే జనాలు ఎన్నోసార్లు చూసిన రోటీన్ కథలను ఎంచుకొని రిపీటెడ్ సినిమాలు చేస్తున్నాడు. ఇక తనతో పాటు ఇండస్ట్రీ లో ఉన్న కొంత మంది యంగ్ హీరోలు కొత్త సబ్జెక్టులను ట్రై చేస్తూ ముందుకు వెళ్తుంటే తను మాత్రం ఇంకా రొటీన్ ఫార్ములా లోనే సినిమాలు చేసి సక్సెస్ లు కొట్టాలని చూస్తున్నాడు...ఇక ఇలాంటి కథలకు ఎప్పుడో కాలం చెల్లిందనే విషయాన్ని హీరో దర్శకుడు గమనించి ఇప్పటికైన కొంచెం మంచి సినిమాలు తీస్తే బాగుంటుంది.


ఆర్టిస్టుల పర్ఫామెన్స్


ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే రాజ్ తరుణ్ తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. అయినప్పటికీ ఏం లాభం కథలో దమ్ము లేదు. ఆయన పర్ఫామెన్స్ కి స్కోప్ లేదు. దానివల్లే ఆయన ఎంత బాగా పర్ఫామెన్స్ చేద్దామని చూసినా కూడా అది వర్కౌట్ అయితే కాలేదు. ఇక దాంతో ఆయన తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు. హీరోయిన్ గా చేసిన మాల్వి మల్హోత్రాకి ఇది మొదటి సినిమా అయిన కూడా తను బాగా పర్ఫాం చేసింది. అలాగే తన యాక్టింగ్ లో ఒక ఇంటెన్స్ అయితే కనిపించింది. ఈ సినిమా కమర్షియల్ గా ఎలా ఆడుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే ఆమెకు మాత్రం సినిమా ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు వస్తుంది.


అలాగే మంచి అవకాశాలు కూడా వస్తాయనే చెప్పాలి. ఇక విలన్ గా నటించిన 'మకరంద్ దేశ్ పాండే' చేసిన పాత్ర నిజంగా ఆయన చేయాల్సిన క్యారెక్టర్ అయితే కాదు. ఒక మంచి నటుడిని సినిమాలో తీసుకున్నప్పుడు ఆయన పాత్రకి సరైన న్యాయం చేకూర్చేలా అతని పాత్రను ఎలివేట్ అయ్యేలా చూసుకోవాలి. కానీ దర్శకుడు ఆ ప్రయత్నం అయితే ఏమి చేయలేదు. దానివల్ల మకరంద్ దేశ్ పాండే క్యారెక్టర్ కూడా పేలవంగా మారిపోయింది... ఫైనల్ గా ఆయన ఏం చేశాడో దర్శకుడు ఆయన చేత ఏం చేయించుకున్నాడో కూడా ఎవరికి అర్థం కానీ ఒక ప్రశ్న గా మిగిలిపోయింది. ఇక మన్నార్ చోప్రా కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చాలా బాగా నటించింది...అలాగే పృథ్వి, తాగుబోతు రమేష్ ఇద్దరు వాళ్ల నటనతో కొంత వరకు పర్లేదు అనిపించారు...


టెక్నికల్ అంశాలు...


ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన జేబీ అంత గొప్ప మ్యూజిక్ అయితే ఇవ్వలేదు. అలాగే ఈ సినిమాలో జేబి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది... సినిమాటోగ్రాఫర్ జవహర్ రెడ్డి మాత్రం కొన్ని విజువల్స్ ని బాగా అందించాడు. కొన్ని సీన్స్ లో ఆయన షాట్స్ తీసిన విధానం కొంతవరకు పర్లేదు అన్పిస్తుంది కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి భారీ మైనస్ గా మారింది...బస్వ పైడి రెడ్డి ఎడిటింగ్ కూడా అంత ఇంపాక్ట్ చూపించలేదు. ఆయన కొన్ని సీన్లను ఎడిటింగ్ టేబుల్ మీదనే సైట్ చేస్తే బాగుండేది...ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికీ కొన్ని సందర్భాలలో షార్ట్ ఫిలిం ను చూస్తున్నమా అనే ఫీల్ అయితే కలుగుతుంది...


ప్లస్ పాయింట్స్

రాజ్ తరుణ్


మైనస్ పాయింట్స్

కథ, స్క్రీన్ ప్లే

రోటీన్ సీన్స్...

క్లారిటీ లేని డైరెక్షన్



నటీనటులు : రాజ్ తరుణ్, మల్వీ మల్హోత్రా, మకరంధ్ దేశ్ పాండే, మన్నారు చోప్రా, ప్రగతి, పృధ్వీ, తాగుబోతు రమేష్ తదితరులు...

డైరెక్టర్. : ఏ ఎస్ రావు కుమార్ చౌదరి

ఎడిటర్. : బస్వ పైడి రెడ్డి

మ్యూజిక్ : జెబీ

సినిమాటోగ్రఫీ: జవహర్ రెడ్డి...

ప్రొడ్యూసర్. : మల్కాపురం శివ కుమార్...

నిర్మాణ సంస్థ : సురక్ష ఎంటర్టైన్ మెంట్

విడుదల తేదీ : 2 ఆగస్టు 2024



Read More
Next Story