ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా జెండా పాతేసినట్లేనా?, డ్రాగన్ వచ్చేదాకా ఆగాలా?
x

ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా జెండా పాతేసినట్లేనా?, 'డ్రాగన్' వచ్చేదాకా ఆగాలా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం దేవ‌ర‌ స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు ఆరేళ్ల త‌ర్వాత ఎన్టీఆర్ నుంచి వ‌చ్చిన ఈ సోలో మూవీ..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం దేవ‌ర‌ స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు ఆరేళ్ల త‌ర్వాత ఎన్టీఆర్ నుంచి వ‌చ్చిన ఈ సోలో మూవీ.. మిక్స్డ్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల కురుపిస్తోంది. ఆ కలెక్షన్స్ ఎన్టీఆర్ కు కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ టార్గెట్ ఒకటే నార్త్ బెల్ట్ లోకి దూసుకుపోవాలి. దేవరతో ఆ పని జరగాలి అని ప్లాన్ చేస్తూ వచ్చారు. అందుకు తగినట్లుగానే తన తర్వాత ప్రాజెక్టులు సైతం సెట్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఎన్టీఆర్ దూరదృష్టి ప్రారంభంలో ఎవరికీ అర్దం కాలేదు.

అయితే ఎన్టీఆర్ కు తెలుసు తను ప్రమోట్ చేయకపోయినా దేవర ఎక్కడెక్కడ వర్కవుట్ అవుతుందో ..అందుకే దేవర కు మొదటి నుంచి కేవలం బాలీవుడ్ ప్రమోషన్స్ పైనే దృష్టి పెట్టారు . ఆర్.ఆర్.ఆర్ తో వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లి తన మార్కెట్ ని విస్తరించాలనుకున్నాడు. అందుకోసం విస్తృతంగా పర్యటించారు. నార్త్ లో తన జెండా పాతటానికి సన్నాహాలు చేసారు. ఈ క్రమంలో ఆయన ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అయ్యింది.

బాలీవుడ్ సర్కిల్స్ లో ఇప్పుడు పెద్ద ఆశ్చర్యం. అక్కడ ట్రేడ్ అసలు ఊహించని విషయం ఇది. ప్రపంచం వ్యాప్తంగా ‘దేవర’ (Devara)మూవీ భారీగా రిలీజ్ చేసారు. రిలీజ్ కు ముందు అటు ఆంధ్రా ఇటు తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో ‘దేవర’ మాస్ టికెట్ బుకింగ్స్ మేకర్స్‌కి సంతోషాన్ని కలిగించాయి. కానీ.. హిందీ బెల్ట్‌లో ఈ హడావుడి అంతంతా మాత్రంగానే ఉండటం నిర్మాతలని కాస్త కలవర పెట్టింది. వాస్తవానికి సౌత్ స్టార్ సినిమాలకి అక్కడ మార్కెట్ అంతంత మాత్రమే. సౌత్‌లో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన అనేక సినిమాలు అక్కడ ఆలస్యంగా నిలదొక్కాయి. అయితే ‘దేవర’లో బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు కాబట్టి హిందీ ఆడియెన్స్ ఈ సినిమాకు బాగానేరెస్పాండ్ అవుతారనేదే అంచనా వేసారు. అదే ఇప్పుడు నిజం అవుతోంది.

నార్త్ లోదేవర మెల్లిమెల్లిగా రోజు రోజుకూ పికప్ అవుతోంది. ఫస్ట్ వీకెండ్ అయ్యేసరికి 26.5 కోట్లు సాధించింది. రిలీజైన రోజు అక్కడ కేవలం 7.5 కోట్లు మాత్రమే తెచ్చుకుంది. అయితే శనివారం నాటికి పికప్ అవ్వటం మొదలైంది. ఆదివారం నాటికి 10 కోట్లు నెట్ తెచ్చి షాక్ ఇచ్చింది. సోమ,మంగళవారాలు అన్ని చోట్లా డ్రాప్ ఉంటుంది కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. అయితే దసరా శెలవులు మొదలవుతున్నాయి కాబట్టి మళ్ళీ ఈ సినిమాకు ఊపు వస్తుందని నార్త్ సర్కిల్స్ లో ఎంత లేదన్నా 100 కోట్లు నెట్ వస్తుందని అక్కడ ట్రేడ్ అంచనా వేస్తోంది. అదే జరిగితే ఎన్టీఆర్ నార్త్ లో తన జెండా పాతినట్లే.

ఇక ఎన్టీఆర్ నార్త్ మార్కెట్ కోసం ఓ ప్లానింగ్ ప్రకారం వెళ్ళుతున్నారని అర్దమవుతోంది. వార్ 2 సైన్ చేసినప్పుడు ఎన్టీఆర్ బాలీవుడ్ కి వెళ్లి ఏం చేస్తాడు అనే టాపిక్ రైజ్ చేసారు కొందరు. అయితే ఇప్పుడు దేవర తర్వాత వార్ 2 రిలీజ్ కీలకం కానుంది. ఖచ్చితంగా వార్ 2 ని నార్త్ లో భారీగా ప్రచారం చేస్తారు. ఎన్టీఆర్ ఇమేజ్ ప్రతీ ఇంటికి రీచ్ అవుతుంది. వార్ 2 హిట్ అయితే ఇక చెప్పక్కర్లేదు. ఓ రకంగా దేవర తర్వాత వార్ 2 టీమ్ కు ఎన్టీఆర్ ఓ ఎస్సెట్ గా మారాడనటంలో సందేహం లేదు. ఎన్టీఆర్ పేరు చెప్పి కూడా బాలీవుడ్ మార్కెట్ జరుగుతుంది. ఎన్టీఆర్ అక్కడ మాస్ బెల్ట్ లోకి వెళ్తున్నారు. అదే అతనికి ప్లస్ కానుంది.

ఇక దేవర, వార్ 2 ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ తో చేయబోతున్న డ్రాగన్ పై ఉంటుంది. ఆ మద్యన హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా పూజా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఆ రోజే 2026 జనవరి 9న ఎన్టీఆర్ 31 మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంద‌ని ప్ర‌క‌టించి ఫ్యాన్స్ లో జోష్ నింపారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ ,యష్ తో కేజీయఫ్ అనే సినిమాలు చేసి మాస్ లో కొత్త డెఫినిషియన్ అందించాడు. అలాంటి ఎన్టీఆర్ లాంటి బిగ్గెస్ట్ మాస్ హీరోతో ఇలాంటి దర్శకుడు సినిమా అంటే ఆ ఎక్సపెక్టేషన్స్ పీక్స్ లో ఉంటాయి. అందుకు తగ్గట్టుగా ఈ మాసివ్ కాంబినేషన్ పై అంచనాలు ఆల్రెడీ నెలకొన్నాయి. ఈ చిత్రంతో తారక్ మొదటిసారిగా ఓ కన్నడ బ్యూటీతో రొమాన్స్ చేయనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఆమె మరెవరో కాదు గత ఏడాది వచ్చిన "సప్త సాగరాలు దాటి" ఫేమ్ నటి రుక్మిణి వసంత్ అంటున్నారు ఈమెకి ఆ సినిమాలో అటు కన్నడ సహా ఇక్కడ తెలుగులో కూడా మంచి ఫేమ్ రావటం కలిసొచ్చే విషయం అంటున్నారు.

ఇక ఈ బిగ్గెస్ట్ మాస్ చిత్రానికి ప్రస్తుతం "డ్రాగన్" అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భారీ సినిమాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ఈ అక్టోబర్ లేదా నవంబర్ లోనే షూటింగ్ ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎన్టీఆర్ 31 మూవీ స్టోరీ సాగుతుంద‌ట‌. పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌ను రీచ్ అయ్యేలా క‌థ‌ను సిద్ధం చేశార‌ట‌. బంగ్లాదేశ్‌కు వలస వెళ్లిన తెలుగు వాళ్లకు అండగా నిలిచే పాత్రలో ఎన్టీఆర్ క‌నిపిస్తాడ‌ని అంటున్నారు. తార‌క్ క్యారెక్ట‌ర్ ను ప్ర‌శాంత్ నీల్ స‌రికొత్త‌గా మ‌రియు డిఫ‌రెంట్ గా డిజైన్ చేస్తున్నార‌ని ఇన్‌సైడ్ బ‌లంగా టాక్ న‌డుస్తోంది. అంటే ఇది కూడా ప్యానిండియా కథే.

Read More
Next Story