‘అప్పన్నగా పంచెకట్టులో చెర్రీ అదరగొట్టాడు’
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వక్తలు
ఇన్నాళ్లు ఒక్కోపాట విడుదల చేస్తూ మెల్లగా హైప్ పెంచుకుంటూ వస్తున్న రామ్ చరణ్ - శంకర్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ అమెరికాలోని నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుక సక్సెస్ తరువాత ఒక్కసారిగా హట్ టాపిక్ గా మారింది.
భారీ బడ్డెట్ తో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. యూఎస్ లోని డల్లాస్ లో ‘ గేమ్ ఛేంజర్ గ్లోబల్ ఈవెంట్’ వేడుకకు భారీ స్థాయిలో ప్రేక్షకులు హజరవడంతో టీమ్ అంతా సంతోషంగా ఉంది.
ఈ సినిమా గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడిన మాటలే సినిమాపై హైప్ ను అమాంతం పెంచేశాయి. ఇది పోలిటికల్ టచ్ సబ్జెక్ట్ ని అందరికి ముందే తెలుసు. సినిమాలో చెర్రి రెండు పాత్రల్లో నటిస్తున్నారు. ప్లాష్ బ్యాక్ పాత్రలో అప్పన్నగా పంచెకట్టులో చరణ్ దర్శనం ఇస్తారని, ఇది సినిమాకే హైలైట్ అవుతుందని ఈవెంట్ లో ఆయన చెప్పిన మాట.
ఇందులో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని రాజకీయ సంఘటనలు సినిమాకు తగ్గట్లుగా వాడుకున్నారని ఇవన్నీ శంకర్ గారు తెలుగు రాజకీయాలను స్వయంగా పరిశీలించి రాసుకున్న సీన్లని వాటిని తెరపై అద్భుతంగా తెరకెక్కించారని అంటున్నారు.
శంకర్ సినిమా అనగానే కొన్ని శక్తివంతమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. జెంటిల్ మెన్, భారతీయుడు, అపరిచితుడు, జీన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన ‘ గేమ్ ఛేంజర్’ నిలుస్తుందని నిర్మాత్ దిల్ రాజు మాట.
డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో చెర్రీకి జాతీయ అవార్డు గ్యారంటీ అని అభిప్రాయపడ్డారు. ఇంటర్వెల్ కి ముందు ట్విస్ట్ బాగుంటుందని తాను చిరంజీవి గారితో కలిసి సినిమా వీక్షించినట్లు ఆయన చెప్పారు. క్లైమాక్స్ లో చరణ్ ఇరగదీశాడని కితాబునిచ్చారు. హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఇక్కడి అభిమానులను చూస్తే తనకు ఇండియాకు వచ్చినట్లే ఉందని చెప్పారు.
ఇన్నాళ్లు ఇండియాను ఊపిన పుష్ఫ రాజ్ ఫీవర్ స్థానాన్ని గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ఆక్రమిస్తున్నాడు. నార్త్ బెల్ట్ లో ఇప్పటికి కూడా పుష్ఫ వసూళ్ల ప్రభంజనం ఆగడం లేదు. ఈ సినిమా క్రమంగా బాహుబలి - 2 వసూళ్లను చేరువవుతోందని, దంగల్ రికార్డును అందుకుంటుందో లేదో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
అల్లు అర్జున్ రికార్డు నెలకొల్పాలన్న గేమ్ ఛేంజర్ లోపే చేయాలి. లేదంటే తరువాత గ్లోబల్ స్టార్ హవా మొదలవుతుంది. చరణ్ నాలుగు సంవత్సరాల తరువాత సోలో హీరోగా వస్తున్నాడు. ఇందులో చెర్రీ సరసన కియారా ఆద్వానీ నటించగా, ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అంజలి నటించింది.
ఇంతకుముందు చరణ్ ప్రతిష్టాత్మక ‘ ఆర్ఆర్ఆర్‘ సినిమాలో జూ. ఎన్టీఆర్ తో కలిసి తెరను పంచుకున్నాడు. ఈ సినిమాను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1387 కోట్లను కొల్లగొట్టింది. అంతేకాకుండా చిత్రంలోని నాటు నాటు పాట ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
Next Story