నిజాన్ని వెతికే ఆవేశాన్నిచ్చే ‘ది సబర్మతి రిపోర్ట్’
x

నిజాన్ని వెతికే ఆవేశాన్నిచ్చే ‘ది సబర్మతి రిపోర్ట్’

సత్యాన్వేషణకు ఒక అద్భుతమైన దారి ఈ సినిమా.


-పావని ప్రసాద్

సంచలనాలకి సమాకాలీన చిత్రాలలో ‘కశ్మీర్ ఫైల్స్’ అగ్గి రాజేస్తే ఆ కోవలో మరిన్ని సినిమాలు ధైర్యంగా ముందుకు వస్తున్నాయి. సరికొత్తగా ఇప్పుడు ‘ది సబర్మతి రిపోర్ట్’ (The Sabarmati Report) వచ్చింది.

2002 గోద్రా రైల్వే ఘటన (Godra Train Burning) లో 59 మంది మరణించిన విషాదాన్నే కాకుండా, ఆ తర్వాతి సామాజిక, రాజకీయ ప్రభావాలను కూడా చూపించేందుకు చేసిన ప్రయత్నమే ఈ సినిమా. విక్రాంత్ మస్సీ(Vikrant Massey) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, ప్రేక్షకులను తీవ్రంగా ఆలోచనలో పడేస్తుంది.

ఆవినాష్ మరియు అర్జున్ రాసిన స్క్రిప్ట్‌కు, అసీమ్ అరోరా రూపొందించిన కథ ఆధారంగా సబర్మతి రిపోర్ట్ 2024 నవంబర్ 15 న విడుదలైన హిందీ సినిమా దీరజ్ సర్ణా (Dheeraj Sarna) దర్శకత్వంలో బాలాజీ మోషన్ పిక్చర్స్ మరియు వికిర్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి.

ఈ సినిమాలో దర్శకుడు రెండు విభిన్న కోణాలను చూపించే ప్రయత్నం చేశాడు. ఒకటి, సమాజంలో ‘నిజం’ పైన ఏర్పడిన చీకటి వలయాలను ఆవిష్కరించటం; రెండవది, మీడియా, రాజకీయ వ్యవస్థల దోషపూరిత చర్యల గురించి ఒక పరిశీలన అనే నెపంతో ఉతికి ఆరేయడం. కానీ ఈ కథనం తీరు అందరినీ ఒప్పించిందా అంటే,చెప్పడం కష్టం నిజాలను చెప్పే ప్రయత్నం నిజంగానే జరిగిందని మాత్రం చెప్పవచ్చు .

విక్రాంత్ మస్సీ నటన, ముఖ్యంగా ఈ సినిమాకు పెద్ద అస్సెట్. కొన్ని భావోద్వేగ సన్నివేశాలలో ఆయన నటన చాలా చాలా బావుంది. మంచి ఈస్ ఉన్న నటుడు.

2002 గోద్రా ఘటన ప్రజలపై కలిగించిన ప్రభావాన్ని పదును వేసి చూపించిన తీరు మాత్రం అద్భుతం.చాలా గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే వుంది

కధనం ఒక ప్రొపగాండా చిత్రంగా, ఒక వర్గానికి, ఒక భావ జాలానికి పక్షపాతం చూపించిందని అనే అభిప్రాయం కలుగుతుంది. అయితే ఇలాంటి సబ్జెక్టు కి అలాంటి విమర్శలు తప్పవు. దర్శకుడు తన పాయింట్ బలంగా చెప్పాలి అనుకుంటే ఇలాంటి సాహసం తప్పదు.

కథలో ఈ రకమైన సర్దుబాటుకి ప్రయత్నం చేసినా, అది ఎక్కడో తగ్గింది.

కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా వచ్చిన ఇలాంటి చిత్రాలు సామాజిక చైతన్యాన్ని మేల్కొల్పవచ్చు, కానీ అవి బాధితుల ఆత్మగౌరవాన్ని గౌరవించడంలో విఫలమైతే ఎలా అనే ఒక నైతిక ప్రశ్నకు సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది ,

గతం మలుపులు చూపెడుతుండగా – నిజం చెబుతుందా నిశ్శబ్దం?

కవిత్వంగా అల్లిన చరిత్రలో,

మరణించిన ఆ ప్రాణాల విలువ నేడు ఎంత?

మన శ్రద్ధ ఏమిటో ఆవిష్కరించగలిగే గొప్ప ప్రశ్నల కథ ఇది. సామాజిక చైతన్యాన్ని గురించి ఆలోచింపజేస్తుంది. గోద్రా ఘటన చుట్టూ నడిచే ఈ చిత్రం గతం నుండి ఇప్పటి వరకూ వ్యవస్థలలో చోటుచేసుకున్న మార్పులను చెప్పే ఓ విజువల్ నారేటివ్.

అందుకని ఈ చిత్రాన్ని ఒక సామాజిక దృక్పథంతో చూడడం, అది చెప్పదలచుకున్న నిజం పట్ల విమర్శనాత్మక దృష్టితో ఉండటం ముఖ్యం. ఈ కథా ప్రయాణం, మనం వాస్తవాలను ఎలా అర్థం చేసుకోవాలో నేర్పిస్తుంది .

సినిమా క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తుంది. దేశవాళి జర్నలిస్ట్ గా చులకన చేయబడ్డ హీరో, అజ్ఞాతంగా తన కలలను నెరవేర్చేందుకు న్యూఢిల్లీకి ప్రయాణించి, ఒక ప్రముఖ హిందీ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా ప్రవేశిస్తాడు. ఇన్నాళ్లుగా మౌనంగా నిలిచిన బాధితుల గాధలను సమగ్రంగా వెల్లడిస్తూ, దేశ ప్రజల కళ్ళు తెరిపిస్తాడు.

ఆఖరి సన్నివేశంలో, గంభీరంగా పలికిన అతని మాటలు—తన గుండె చప్పుడు లాంటి రీరికార్డింగ్ తో కలసి—ప్రేక్షకుల హృదయాల్లో మాతృదేశాభిమానం ఉవ్వెత్తున ఎగిసేలా చేస్తుంది .

విక్రాంత్ మస్సి, రాసి ఖన్నా,రిద్ది దొగ్రా ప్రధాన పాత్రలు పోషించారు సామాజిక సందేశాన్ని అందించే చిత్రాలకు ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశ్యంతో మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఈ చిత్రానికి టాక్స్ ఫ్రీ ప్రకటించాయి.

ఈ చిత్ర దర్శకుడు ధీరజ్ సర్నాని అభినందించే ముందు మీరు ఒక వాస్తవాన్ని గుర్తించాలి: "గతం మనకు ఏం నేర్పింది? సబర్మతి రిపోర్ట్, ఎంతటి భావోద్వేగాలతో నిండినా కూడా , మనకు ఓ కఠినమైన సందేశాన్ని అందిస్తుంది: "నిజం ఎప్పటికైనా వెలుగు చూడాలి" అని.

సత్యాన్వేషణకు ఇది ఒక అద్భుతమైన దారి. ప్రేక్షకుడిగా మీ నిర్ణయం బ్యాలన్స్డ్ గా ఉండాలి అంటే కథను అనుభవించండి, కానీ విమర్శనాత్మక దృష్టితో చూడండి ఎందుకంటే నిజాన్ని వెతికేందుకు కావలసినంత ఆవేశాన్నిచ్చే కధ ‘ది సబర్మతి రిపోర్ట్’.

(పావని ప్రసాద్ సినీ విమర్శకుడు)

Read More
Next Story