‘పుష్ప-2’: హిందీ వెర్షన్ ని వెంటాడుతున్న భయాలు
x

‘పుష్ప-2’: హిందీ వెర్షన్ ని వెంటాడుతున్న భయాలు

వచ్చే నెల ఐదున పుష్ఫ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. దక్షిణాది కంటే ఉత్తరాదిన ఈ సినిమా బిజినెస్ భారీ ఎత్తున జరిగింది. అయితే ఇప్పుడు సినిమా..


(సూర్య ప్రకాష్ జోశ్యుల)

అల్లు అర్జున్ లేటెస్ట్ అవైటెడ్ సినిమా “పుష్ప 2”. ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కావటంతో లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా దాకా అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. మరో ప్రక్క ట్రేడ్ సైతం ఈ సినిమా ఫలితం కోసం ఎదురుచూస్తోంది.
పాన్ ఇండియ‌న్ సినిమాల టార్గెట్ ఒక్క‌టే. దేశంలో ఎక్కువగా టికెట్లు తెగే ఉత్త‌రాది (హిందీ) మార్కెట్ ని కొల్ల‌గొడితే చాలు. మాగ్జిమం క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్టే. ఏదైనా సినిమా పాన్ ఇండియాలో బంప‌ర్ హిట్ అన్న టాక్ వ‌స్తే, అందులో స‌గం పైగా వ‌సూళ్లు ఉత్త‌రాది నుంచే వస్తున్నాయి. అందుకే ఇటీవ‌ల ద‌క్షిణాది నుంచి రిలీజ‌వుతున్న సినిమాల‌న్నీ హిందీ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని తెర‌కెక్కుతున్నాయి. ఈ నేపధ్యంలో పుష్ప 2 కు అంచనాలు ఎలా ఉంటాయో అంచనా వేయచ్చు.
పుష్ప 2కు ఉన్న క్రేజ్ తో భారీ ఎత్తున థియేటర్ బిజినెస్ అయ్యింది. నిర్మాతలు ఆంధ్రాలో రికార్డ్ రేటుకు రైట్స్ అమ్మారు. అలాగే నార్త్ లోనూ ఈ సినిమాని ఎవరూ ఊహించని రేట్లుకు అమ్మేసారు. అంతంత రేట్లు పెట్టి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ తాము పెట్టిన డబ్బుని రికవరీ చేసుకునేందుకు సిద్దమవటంలో ఆశ్చర్యం లేదు.
అయితే మనకు ఇక్కడ అల్లు అర్జున్ మానియాకు కానీ సుకుమార్ హవాకి కానీ ఏ అడ్డంకి లేదు. కాని నార్త్ లో కొన్ని భయాలు ఉన్నాయన్నట్లుగా అక్కడ G7 ,మరాఠా మందిర్ థియేటర్స్ ఎక్సిక్యూటివ్ డైరక్టర్ మనోజ్ దేశాయ్ వ్యక్తం చేశారు.
మనోజ్ దేశాయ్ మాట్లాడుతూ... పుష్ప 2 రిలీజ్ పట్ల చాలా ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తాము ఈ ఎక్సైట్మెంట్ ని మరింత పెంచటానికి పుష్ప పార్ట్ 1 ని రీ రిలీజ్ చేస్తున్నామని కూడా చెప్పారు.
అలాగే తమకు ఈ సినిమా పట్ల ఉన్న భయాలను చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ... పుష్ప 2 ట్రైల‌ర్ అన్నిచోట్లా దూసుకెళ్లింద‌ని, దీంతో ఉత్త‌రాదినా ప్రీరిలీజ్ బిజినెస్ కి ఎదురే లేద‌ని వ్యాఖ్యానించారు. అయితే పుష్ప 1తో పోలిస్తే పుష్ప 2 పాట‌లు ఆశించినంత‌గా హిందీ ఆడియన్స్ కి చేరువ కాలేద‌ని ఆయ‌న చెప్పారు.
పుష్ప 1 పాట‌లు అన్ని భాష‌ల్లో బంప‌ర్ హిట్. పుష్ప ట్రాక్ లను ఆడియన్స్ విప‌రీతంగా ఆస్వాదించారు. పుష్ప డైలాగులు కూడా ఇప్ప‌టికీ ట్రెండింగులో ఉన్నాయి. కానీ సీక్వెల్ విష‌యంలో అది రిపీట‌వుతుందా లేదా? అన్న సందేహం వ్య‌క్తం చేసారు ఆయ‌న‌. సీక్వెల్ పాటల గురించి తనకు ఇప్పటివరకు ఎలాంటి ఆలోచనా లేదని అన్నారు. రెండవ భాగం హిందీ పాటలు `పుష్ప: ది రైజ్‌`తో పోలిస్తే తగినంత సంచలనాన్ని సృష్టించలేదని అన్నారు.
పుష్ప పార్ట్ 1 రిలీజ్ కు ముందే పాటలు, మేనరింజంలు సూపర్ హిట్ అయ్యాయని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ పార్ట్ 2 పై చాలా ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయని అందుకే అన్ని అంతకు మించి ఉండాలన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్ట్ వన్ తో పోలిస్తే పార్ట్ 2 పాటలు ఇంపాక్ట్ కనపడటం లేదన్నారు.
దానికి తోడు ప్రస్తుతం సౌతిండియా నుంచి వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ల హిందీ వెర్షన్స్ ప్లాఫ్ అవటం కూడా ట్రేడ్ ను భయపెడుతున్న విషయం అన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే పార్ట్ 2 పెద్ద హిట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. పుష్ప 2 కి ఉత్త‌రాదిన భారీ ప్రీరిలీజ్ బిజినెస్ సాధ్య‌మే. ట్రైల‌ర్ కావాల్సినంత బూస్ట్ ఇచ్చింది. మొద‌టి రోజు బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకుంటే చాలు వ‌సూళ్ల హవాకు తిరుగుండ‌ద‌ని ఆయ‌న‌ అంచ‌నా వేశారు.
ఇక ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే...ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..డిస్ట్రిబ్యూటర్స్ ...సింగిల్ స్క్రీన్ రేట్లు భారీగా పెంచబోతున్నారు. 300 దాకా టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు ఫర్మిషన్ ఇవ్వమని గవర్నవమెంట్ దగ్గర ప్రపోజల్ పెట్టారు. మొదటి వారం అంతా ఆ రేటుకు సినిమాని ప్రదర్శిస్తామని తర్వాత వారం తగ్గిస్తామని అడుగుతున్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఈ రేటుతో అఫీషియల్ గా సింగిల్ స్క్రీన్ టిక్కెట్లు అమ్మలేదు.
థియేటర్ యజమానులు మొదటి రోజు ఉన్న క్రేజ్ తో అనీఫిషియల్ గా పెంచి అమ్మటం జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు 300 రేటు అఫీషియల్ గా పర్మిషన్ ఇస్తే వారు దానికి ఎంత కలుపుకుని అమ్ముతారో చూడాల్సి ఉంది. నిర్మాతలు మైత్రీ మూవీస్ వారు నవీన్ , రవిలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మంచి కనెక్షనే ఉంది కాబట్టి ఆ రేట్లుకు ఫర్మిషన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే కనుక విమర్శలు అయితే వస్తాయి.
మరో ప్రక్క ఈ చిత్రం బిజినెస్ కూడా ఓ రేంజిలో జరిగింది. నాన్ థియేటర్ రెవిన్యూలో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప 2 చిత్రం ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ విషయంలో రికార్డ్ లు బద్దలు కొట్టింది. ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా చెప్పిన దాని ప్రకారం పుష్ప 2 హిందీ వెర్షన్ రైట్స్ 260 కోట్లు పలికాయి.
ఏ సౌతిండియన్ సినిమా ఈ రేటు పలకలేదు. ఈ రేటుతోనే చెప్పచ్చు...నార్త్ లో ఈ సినిమాకు ఏ స్దాయి క్రేజ్ ఉందనేది. ఇదొక ఫ్యాన్సీ డీల్ అని చెప్పాలి. అయితే ఇంత పెద్ద మొత్తం రికవరీ అవ్వాలంటే మినిమం మూడు వారాలు అయినా హౌస్ ఫుల్స్ తో నార్త్ లో ఆడాలని అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎలాగో అల్లు అర్జున్ మేనియాతో నడిచిపోతుంది. ఇప్పుడు నార్త్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయితే ప్యాన్ ఇండియా మార్కెట్ లో అల్లు అర్జున్ తనదైన ముద్ర వేస్తున్నట్లే. గతంలో నార్త్ లో రికార్డులు తిరగరాసింది పుష్ప చిత్రం. అల్లు అర్జున్ మేనరిజమ్స్ అక్కడి ఆడియన్స్ ని ఫిదా చేసేశాయి. నార్త్ లో పుష్ప రూ.108 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో ‘పుష్ప’ కి సీక్వెల్ గా ‘పుష్ప 2 ‘ (Pushpa2) కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
‘పుష్ప’ మొదటి పార్టులో పుష్ప ఎలా ఎదిగాడు అని చూపించిన సుకుమార్.. రెండో పార్టులో ఎలా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు అని చూపించబోతున్నారని సమాచారం. ఈ సీక్వెల్ లో జపాన్ ఎపిసోడ్, జాతరలో బన్నీ చీర కట్టు ఫైట్ ఓ రేంజ్​లో ఉండనుందని టాక్ వినిపిస్తోంది.
ఫహద్ ఫాజిల్ - అల్లు అర్జున్ మధ్య ఫైట్స్​ను మూడో భాగంలోనే ఎక్కువగా చూసే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు పరిచయం కాని చాలా కొత్త పాత్రలు కూడా ఎంట్రీ ఇస్తాయని చెబుతున్నారు. దీని బట్టి పుష్పను టాలీవుడ్​లో ఒక పవర్ ఫుల్ బ్రాండ్​గా మార్చేందుకు సుక్కు సినిమాను గట్టిగానే చెక్కుతున్నారని అర్థమవుతోంది.



Read More
Next Story