మనోజ్ బాజ్‌పాయ్  ‘ఫ్యామిలీ మాన్ 3’ రివ్యూ
x

మనోజ్ బాజ్‌పాయ్ ‘ఫ్యామిలీ మాన్ 3’ రివ్యూ

నార్త్ ఈస్ట్ పాలిటిక్స్ + చైనా కుట్ర


ఈశాన్య రాష్ట్రాల్లో అల్లర్లకు ఆజ్యం పోయటానికి ‘గువాన్ యు’ అనే ప్రాజెక్టుని చైనా ప్రారంభిస్తుంది. దానికి విరుగుడుగా,అక్కడ శాంతిని కాపాడానికి ప్రధాని బసు (సీమా బిశ్వాస్) భారీ ఆపరేషన్ ‘ప్రాజెక్ట్ సహకార్ ’ ప్రారంభిస్తుంది. కానీ స్థానిక రెబల్స్‌ను కూల్ చేయడం అంత తేలిక కాదు. దాంతో ఇంటిలిజెన్స్ సాయిం తీసుకుంటుంది ప్రభుత్వం. ఆ క్రమంలో ఇన్‌టెలిజెన్స్‌ సీనియర్ ఆఫీసర్ గౌతమ్ కులకర్ణి (దిలీప్ తాహిల్), తన బెస్ట్ ఆఫీసర్ ఏజెంట్ శ్రీకాంత్ (మనోజ్ బాజ్‌పాయ్) తో కలిసి నాగాలాండ్‌కు వెళ్తారు.

అదే సమయంలో— అండర్‌వరల్డ్ లో డ్రగ్ ట్రాఫికింగ్, సుపారీలతో జీవించే రుక్మాంగద్ (జైదీప్ అహ్లావత్) కు ఒక డేంజరస్ ఆఫర్ వస్తుంది “నాగాలాండ్‌లో ఉన్న కులకర్ణి, శ్రీకాంత్ ఇద్దరినీ లేపేయాలి!”

రుక్మాంగద్ సరే అని లోకల్ గ్యాంగ్ ల సాయింతో రంగంలోకి దూకుతాడు. ప్లాన్ ప్రకారమే దాడి జరుగుతుంది… కానీ కేవలం కులకర్ణి మాత్రమే చనిపోతాడు. దాంతో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. డిపార్ట్మెంట్‌ మొత్తం శ్రీకాంత్‌ పైనే దృష్టి పెడుతుంది. అతన్నే అనుమానిస్తూ సస్పెన్షన్. అరెస్టు వారెంట్. ఇప్పుడు శ్రీకాంత్ ముందు ఉన్నది ఒకటే లక్ష్యం..రుక్మాంగద్ గ్యాంగ్ నుంచి, అరెస్ట్ చేయటానికి తిరిగే పోలీస్ ల నుంచి తప్పించుకుంటూ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి… అప్పుడేం జరిగింది..శ్రీకాంత్ ఏం చేసాడు అనేది మిగతా కథ.

ఎలా ఉంది

The Family Man 3, కథాపరంగా మామూలు స్పై-థ్రిల్లర్ కాదు. ఇది పాలిటికల్ కాంప్లికేషన్స్, కుటుంబ డ్రామా, ఈశాన్య భారత వివాదాలు, విదేశీ కుట్రలు అన్నిటినీ కలిపి నడిపే బహుళ-లేయర్డ్ స్క్రీన్‌ప్లే. అయితే ఇలాంటి కథ,కథనం ఎలా ఉండాలి. ఏ స్దాయిలో నడవాలి. కానీ పేసింగ్ చాలా స్లోగా, బద్దకంగా నడుస్తుంది. అయితే ఎపిసోడ్ 1, 2 బాగుండి నమ్మకం కలిగిస్తాయి. అలాగే క్లైమాక్స్‌ మాత్రం పక్కా థ్రిల్లర్ హైలు ఇస్తాయి. కానీ మధ్యలో మాత్రం మనని మడతపెట్టేస్తారు.

కులకర్ణి హత్య — సీజన్‌లోని అసలు టర్నింగ్ పాయింట్. శ్రీకాంత్ కళ్ల ముందే రుక్మా కులకర్ణిని కాల్చేయడం… మిషన్‌ను జాతీయ స్థాయి నుంచి వ్యక్తిగత ప్రతీకార యుద్ధంగా మార్చేస్తుంది. ఆ తర్వాత 3 & 4 — లు సీజన్‌లోని పెద్ద బలహీనమైన ఎపిసోడ్స్. ఒకటి రెండు లలో ఉన్న స్పీడు ఇక్కడ డ్రాప్ అయ్యిపోతుంది. సీరియస్‌గా సెట్ చేసిన మూడ్ వదిలిపోతుంది. కథలో టెన్షన్ అయితే పూర్తిగా తగ్గిపోతుంది సృజనాత్మకంగా ఉండాల్సిన సీన్ లు రొటీన్ గా అనిపిస్తాయి. అందుకు కారణం స్టోరీలో డెప్త్ అనిపించకపోవటమే.

సినిమాటెక్ గా కనిపించాలనే ప్రయత్నంలో ఇది సీజన్ అనే విషయం మర్చిపోయినట్లున్నారు. అయితే ఆఖరకు వచ్చేసరికి మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. కానీ శ్రీకాంత్ vs రుక్మా ఫైనల్ క్లాష్ మాత్రం “ఇంకాస్త ఫైర్ ఉండాల్సింది” అనిపిస్తుంది. మనోజ్ బాజ్‌పాయే, జైదీప్ అహ్లావత్ లాంటి లెవెల్ నటులున్నప్పుడు ఈ confrontation మరింత ఎమోషనల్, రా గా, షార్ప్ గా వుండాల్సింది. అయితే లాస్ట్ లో వచ్చే రెండు ట్విస్ట్‌లు ఆడియన్స్‌ను ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. కానీ అంతా చూసాక..“అయ్యో ఇంత అబ్రప్ట్ ఎండింగ్ ఎందుకు?” అన్న ఫీలింగ్‌ అసంతృప్తి వస్తుంది.

అలాగే ఎండిగ్ — సీజన్ 4 కోసం బలవంతంగా వేసిన క్లిఫ్‌హ్యాంగర్.

ఫెరఫార్మెన్స్ లు

“ఫ్యామిలీ మాన్ అంటే మనోజ్ బాజ్‌పాయే… మనోజ్ బాజ్‌పాయే అంటే ఫ్యామిలీ మాన్ అనిపించేలా మరోసారి ఆ పాత్రలో జీవించాడు మనోజ్. డ్రగ్ లార్డ్ గా జైదీప్ అహ్లావత్ నటన బాగుంది. మిగతా ఆర్టిస్ట్ లు వీళ్లతో పోటీపడలేకపోయారు కానీ బాగానే చేసారు.

ఇక టెక్నికల్ గా ... కెమెరా వర్క్ అదిర్స్ అనిపిస్తుంది. నాగాలాండ్ లొకేషన్స్ ను అద్బుతంగా చూపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫెరఫెక్ట్. ఎడిటింగ్ కూడా ఇంట్రస్టింగ్ గా సీరిస్ కొంతవరకూ మార్చగలిగింది. తెలుగు డబ్బింగ్ బాగుంది. రాజ్ ,డీకే ఎప్పటిలాగే బాగా చేసారు కానీ స్క్రిప్టు వాళ్లకు అనుకున్న స్దాయిలో సపోర్ట్ చేయలేదు.

చూడచ్చా

మిగతా రెండు సీజన్స్ తో పోలిస్తే ఈ మూడో సీజన్ అసలు బాగోలేదనే చెప్పాలి. బాగా స్లోగా విసిగించింది. అయితే మరీ తీసి పారేయదగ్గది అయితే కాదు..ఓ లుక్కేయవచ్చు

ఎక్కడ చూడచ్చు

అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో చూడచ్చు

Read More
Next Story