ఓం శాంతి శాంతి శాంతిహి మూవీ రివ్యూ!
x

'ఓం శాంతి శాంతి శాంతిహి' మూవీ రివ్యూ!

రీమేక్ ఏ మేరకు వర్కవుట్ అయ్యింది?


శాంతి (ఈషా రెబ్బ) ఓ చదువుకున్న అమ్మాయి. ఆమె పరిస్థితుల ప్రభావంతో స్థానికంగా చేపల వ్యాపారం చేసే ఓంకార నాయుడు (తరుణ్ భాస్కర్)ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఓంకార నాయుడు సగటు మగవాడు. దానికి తోడు ముక్కు మీద కోపం. అలాంటి వ్యక్తితో జీవితం మీద ఎన్నో ఆశలు పెళ్లి చేసుకున్న శాంతి జీవితం అశాంతిగా మారుతుంది. మొదట్లో బాగానే ఉన్నా..తర్వాత తన విశ్వరూపం చూపెట్టడం మొదలెడతాడు. తనలోని వేరే మనిషిని ఆమెకు పరిచయం చేస్తాడు. చిన్న చిన్న విషయాలకు కూడా ఆమెపై చెయ్య చేసుకోవటం మొదలెడతాడు. ఆమె చదవుకుంటానంటే చదువుకోనివ్వడు.

ఆ క్రమంలో శాంతి తన భర్త చేతిలో శారీరక వేధింపులకు గురవుతుంది, ఇది ఆమెను తీవ్రంగా బాధపెడుతుంది. మొదట ఓర్చుకుంటుంది. సర్దుకుపోవాలనుకుంటుంది. చుట్టు ప్రక్కల వాళ్లు, ఇంట్లో వాళ్లు అదే చెప్తారు.కానీ హింస ఎక్కువ అవటంతో అతనికి బుద్ది చెప్పాలనుకుంటుంది. తిరగబడుతుంది.

ఓ రోజు ఎదురుతిరిగి ఓంకార నాయుడిని చావ చితకబాదుతుంది. ఇంట్లో పడుంటుంది అని ఎక్సెపెక్ట్ చేసిన ఓంకార నాయుడు కు ఇది ఊహించని పరిణామం. దాంతో తన భార్యను అణచివేయడానికి ఒక ప్లాన్ వేస్తాడు. అయితే అది రివర్స్ అయ్యి పరిస్థితులు మరింత ముదురుతాయి. ఆ ప్లాన్ ఏమిటి? శాంతి దానిని ఎలా ఎదుర్కొంది? అనేదే ఈ కథలోని అసలు అంశం.

ఎనాలసిస్

స్టోరీ లైన్ గా ఇది చాలా సింపుల్. పూర్తి ట్రీట్మెంట్ బేసెడ్ కథ. పురుషాధిక్యతను సహజమైన హక్కుగా భావించే భర్త vs ఆత్మాభిమానం, ఆలోచన కలిగిన భార్య. వీళ్లిద్దరి మధ్యన జరిగే కథ. ఇది ప్రేమకథ కాదు. ఇది ఓ రకంగా వివాహానంతరం జరిగే Power Struggle. మళయాళ ఒరిజనల్ డైరక్టర్ ఈ కథను డార్క్ కామెడీగా చెప్పాడు. అదే సమయంలో ఇది భార్యపై జరుగుతున్న మానసిక/శారీరక దాడి కథ గా ఎస్టాబ్లిష్ చేసాడు. మళయాళం నుంచి తెలుగుకు తెచ్చే క్రమంలో గోదావరి ప్రాంత నేపధ్యం, అక్కడి యాస, సంస్కృతి ఫెరఫెక్ట్ గా సెట్ చేసుకున్నారు. అయితే అక్కడితోనే తన పని అయ్యిపోయిందనుకున్నారు. కథలోని అసలైన సోల్ ట్రాన్సఫర్ కాలేదు.

హీరో చేపల వ్యాపారం, ఊరి జనాల మెంటాలిటీ అది మళయాళం నుంచితెచ్చుకున్నదే అయినా చాలా వరకు కథకు లోకల్ నేటివిటిని తెచ్చిపెట్టాయి. కానీ ఇంట్రవెల్ ముందు దాకా కథలోకి రారు. దాంతో ఫస్టాఫ్ లో ఏమీ జరిగినట్లు అనిపించదు. అయితే కొన్ని డైలాగులు బాగానే పేలాయి. కొంతవరకూ కామెడీ పండింది. అయితే ఎప్పుడైతే భర్తపై భార్య చేసే కౌంటర్ ఎటాక్ , 'యుద్ధభేరి' ఎపిసోడ్ కథకు మెయిన్ పిల్లర్స్‌గా నిలిచాయి. మళయాళం చూడనివారికి ఇవి నచ్చుతాయి.

సెకండాఫ్ లో ఏదోదే జరుగుతుందని ఎక్సపెక్ట్ చేస్తే అక్కడ బలహీనపడింది. ఎమోషనల్ కనెక్ట్ మిస్సైంది. భర్త నిజస్వరూపం తెలిశాక భార్య పడే వేదన తెరపై బలంగా ఆవిష్కరించబడలేదు. సినిమాను మొదటి నుండి ఫన్ ఓరియెంటెడ్‌గా మార్చడం వల్ల, ఆమె పడే బాధతో ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వలేని పరిస్దితి. భార్య పడే మానసిక సంఘర్షణ కంటే కామెడీకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల 'సింపతీ' ఫ్యాక్టర్ మిస్ అయింది. మన తెలుగు వాళ్లు అంతకు మించి ఎక్సపెక్ట్ చేస్తారు. అదేమీ కనపడకపోవటం, కథలో చెప్పుకోదగ్గ ట్విస్టులు లేకపోవటం, సీన్లు చాలా నెమ్మదిగా సాగడం వల్ల సెకండాఫ్ బోరు కొట్టింది.

క్లైమాక్స్ అయినా సర్దుకుంటారేమో అనుకుంటే...అదీ జరగలేదు. బ్రహ్మానందం వంటి లెజెండరీ యాక్టర్ ఉన్నా, కోర్టు ఎపిసోడ్ చాలా సాదాసీదాగా, సిల్లీగా అనిపించింది. సినిమాను సీరియస్ నోట్‌లో ముగించాల్సింది పోయి, ముగింపును హడావిడిగా చుట్టేసినట్లు అనిపిస్తుంది.

ఏదైమైనా మలయాళం ఒరిజినల్ వెర్షన్ 'జయ జయ జయ జయ హే'లో ఉన్న "షాక్ ఫ్యాక్టర్" ఇందులో మిస్ అయింది. ఒరిజినల్ చూసిన వారికి, ఇందులో ఎన్ని మార్పులు చేసినా ఆ 'కిక్కు' రావడం కష్టం. షాక్ ఎలిమెంట్ తెలిసినప్పుడు సస్పెన్స్ ఉండదు కాబట్టి ఎమోషన్ మీద ఎక్కువ వర్క్ చేయాల్సింది.

ఎక్కువ దెబ్బ కొట్టింది ఎక్కడంటే..

తెలుగు రీమేక్‌లో తరుణ్ భాస్కర్ బాగా పర్ఫార్మ్ చేశారు, కానీ ఆయన చాలా కూల్ గా స్వీట్ గా కనిపించారు. దాంతో క్యారెక్టర్‌ను మనం అసహ్యించుకోలేము. అదే ఒరిజినల్‌లో హీరోను మనం హేట్ చేస్తాం, అప్పుడే హీరోయిన్ పట్ల సానుభూతి (empathy) కలుగుతుంది. అక్కడే దెబ్బ కొట్టింది.

అలాగే ఈ సినిమా చూసిన తర్వాత హీరోయిన్ పాత్రతో అంతగా ఎంపతైజ్ అవ్వలేము. ఒరిజినల్ వెర్షన్ చూసినప్పుడు ఆడవాళ్ల కష్టాల పట్ల ఒక సెన్సిటైజేషన్, ఎంపతీ కలుగుతాయి, కానీ తెలుగు వెర్షన్‌లో ఆ ఫీలింగ్ కలగలేదు. ఇలా రెండు లీడ్ క్యారక్టర్స్ మైనస్ గా నిలిచాయి.

టెక్నికల్ గా ..

జయ క్రిష్ అందించిన సంగీతం సినిమా ప్రవాహానికి అడ్డుపడకుండా హాయిగా సాగిపోగా, గోదావరి నేపథ్యం, ఇంటి సెటప్‌ను చూపించిన నిర్మాణ విలువలు ఫెరఫెక్ట్ గా ఉన్నాయి. దర్శకుడు సజీవ్ మాతృకను నేటివిటీ దాకా చక్కగానే మార్పులు చేసినప్పటికీ, సెకండాఫ్ లో సాగిన విషయం గమనించలేదు.

నటీనటుల్లో ..బాసిల్ జోసెఫ్ తో తరుణ్ భాస్కర్ ను పోల్చలేం. ఈ కథలో కీలకమైన పాత్రలో ఈషా రెబ్బా మెప్పించింది. హీరో మావయ్యగా బ్రహ్మాజీ నవ్వించాడు. హీరో తల్లిగా సురభి సుభాషిణి.. చెల్లి పాత్రలో నటించిన అమ్మాయి అందరూ బాగానే చేసారు. వరుస పెట్టి జడ్జి పాత్రలు చేస్తున్న బ్రహ్మానందం.. మరోసారి ఆకట్టుకున్నారు. రోహిణి ఓకే.

ఫైనల్ థాట్

అల్రెడీ ఓటిటిలో పెద్ద హిట్ అయిన ఈ మళయాళ సినిమా తెలుగులో ఏ ధైర్యంతో చేసారా అని ఆశ్చర్యం వేస్తుంది. 'ఓం శాంతి శాంతి శాంతి' ఒక హాఫ్ బేక్డ్ ప్రయత్నంలా మిగిలిపోయింది. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఎంటర్టైన్మనెంట్, సెకండ్ హాఫ్‌లో ఉండాల్సిన ఎమోషనల్ పెయిన్‌ను బ్యాలెన్స్ చేయలేకపోయింది. పాత్రల మానసిక వేదనను బలంగా చూపి ఉంటే ఈ రీమేక్ కి ఒక అర్థం ఉండేది.

Read More
Next Story