
ఏవీఏం శరవణన్
తమిళ సినీ దిగ్గజం ఏవీఏం శరవణన్ కన్నుమూత
మూడు వందలకు పైగా సినిమాలు నిర్మించిన కోలీవుడ్ దిగ్గజం
తమిళ సినిమా రంగంలో సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్ ను అగ్రగామిగా నిలిపిన ఏవీఎం శరవణన్ గురువారం ఉదయం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గురువారం మధ్యాహ్నం వరకూ ఆయన భౌతిక కాయాన్ని ఏవీఎం స్డూడియోలోనే ప్రజల సందర్శనార్థం ఉంచుతామని సంస్థ వెల్లడించింది. శరశన్ దాదాపు మూడు వందల చిత్రాలను నిర్మించారు. భారత సినీ దిగ్గజాలలో ఒకరిగా ఆయన పేరు పొందారు.
ఏవీఎం ప్రొడక్షన్ ను శరవణన్ తండ్రి ఏవీ మెయ్యప్పన్ ప్రారంభించాడు. 1950 చివరలో శరవణన్, సోదరుడు బాల సుబ్రమణియన్ లు కలిసి స్టూడియోల నిర్వహణను చేపట్టారు. ఐదు దశాబ్దాలలో అనేక భాషలలో సినిమాలు నిర్మించి ఏవీఏం పేరును దేశవ్యాప్తంగా వినిపించేలా చేశారు.
నానుమ్ ఒరు పెన్(1963), ఏక్ దుయుజే కే లియే(1981), సంసారం అదు మిన్సారం(1986), మిన్సరు కనవు(1997), శివాజీ ది బాస్(2007) వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను సంస్థ నిర్మించింది.
అనేక మంది నటుడు, సాంకేతిన నిఫుణులకు అవకాశం ఇచ్చారు. 1986 లో మద్రాస్ షరీఫ్ గా కూడా శరవణన్ పనిచేశారు. ఆయన కుమారుడు ఎంఎస్ గుహాన్ కూడా నిర్మాతే. మనవరాలు అరుణ, అపర్ణ కూడా నిర్మాతలుగానే ఉన్నారు. అరుణ దర్శకత్వంలోనూ ప్రతిభ చాటుతోంది. ఏవీఎం ప్రొడక్షన్స్ లో భాగస్వామిగా ఉంటూనే కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
Next Story

