తెరమీదే కాదు .. డిటెక్టివ్ నవల్లోనూ  ఎస్వీ రంగారావు పాత్ర, అప్పట్లో అదో సెన్సేషనల్
x

తెరమీదే కాదు .. డిటెక్టివ్ నవల్లోనూ ఎస్వీ రంగారావు పాత్ర, అప్పట్లో అదో సెన్సేషనల్

భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఉత్తమ నటుడు (International Best Actor) అవార్డు పొందిన యాక్టర్ విశ్వనట చక్రవర్తి ఎస్ వి రంగారావు గారు,

విశ్వనట చక్రవర్తి ఎస్ వి రంగారావు (S V Ranga Rao)ని తలుచుకోగానే నిండైన విగ్రహం, అద్బుతమైన నటన కళ్ల మందు కనపడుతుంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఉత్తమ నటుడు (International Best Actor) అవార్డు పొందిన యాక్టర్ ఆయన. ఆయన తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల మదిలో చెప్పరాని ఆనందం, ఉత్సాహం తొణికిసలాడేది. అనేక అపురూపమైన పాత్రల్లో అనితరసాధ్యంగా తన అభినయంతో అలరించారు రంగారావు గారి గురించి ఓ అరుదైన విషయం.

ఎస్వీ రంగారావు ఎన్నో సినిమాల్లో నటుడుగా కనిపించారు మురిపించారు. అది తెలిసిన విషయమే. అయితే ఆయన అప్పట్లో పాపులర్ రచయిత రాసిన ఓ నవలలో పాత్ర అయ్యారంటే మాత్రం చిత్రమైన విషయమే. ఆ నవలా రచయిత మరెవరో కాదు కొమ్మూరి సాంబశివరావు. సినీ జర్నలిస్టుగా, పత్రికా సంపాదకుడిగా పని చేసిన ఆయన 90 నవలలు రచించి డిటెక్టివ్ నవలా రచయితగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కొన్ని ఏళ్ల పాటు ఆయన సృష్టించిన డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు పాత్రలు రాజ్యం ఏలాయి. ఆ పాత్రతలకు కూడా అభిమానులు ఉండేవారు. ఆ పాత్రలు తెలియని తెలుగు పాఠకులు ఉండేవారు కాదు. ఆయన రాసిన ఓ నవల్లో ఎస్వీ రంగారావు నిజ జీవిత పాత్రగా కనిపిస్తారు.

కొమ్మూరి సాంబశివరావు గారు రాసిన X 303Y అనే టైటిల్ తో వచ్చిన నవలలో ఎస్వీ రంగారావుగారు ఓ కీలకమైన పాత్రలో క్లైమాక్స్ ట్విస్ట్ లో ఎంట్రీ ఇస్తారు. సినిమాల్లో గెస్ట్ రోల్ లో సర్పైజ్ ఇచ్చినట్లుగా ఎస్వీరంగారావు గారి ఎంట్రీ సర్పైజ్ ఉంటుంది. నిజానికి నవలల పరంగా ఓ కొత్త ప్రయోగం. నవల చదివిన వాళ్లంతా ఎస్వీ రంగారావు పాత్రకు ఆశ్చర్యపోతాం. ఎందుకంటే కథలో అదే మెయిన్ ట్విస్ట్. నవల చదివాక ఆయన రూపం మనకు ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది.

అయితే నవల్లో సర్పైజ్ కోసం సరదాగా రాసారా అంటే ..నిజానికి కొమ్మూరి సాంబశివరావు గారికి ఎస్వీ రంగారావు అంటే చాలా అభిమానం. తన యుగంధర్ డిటెక్టివ్ పాత్ర ఆయన్ని ఊహించే రాసానని చెప్పేవారు. అయితే ఆ పాత్రలో ఎస్వీ రంగారావు నటించలేదు. తన కోరిక తీరకుండానే ఎస్వీ రంగారావు వెళ్లిపోయారని బాధగా ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చారు ఆయన. అవకాసం ఉంటే ఖచ్చితంగా చదవతగ్గ నవల అది. ఇప్పటికి చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది.

నవల కథాంశం ఏమిటంటే.. డబ్బున్న వాళ్ల ఇంటి నుంచి ఆడవాళ్లు, పిల్లలు కిడ్నాప్ అయ్యిపోతూంటారు. డబ్బులు వసూలు చేస్తూంటారు. పోలీస్ లకు ఎవరు ఇలా చేస్తున్నారో అంతు చిక్కదు. ఆ కేసులు కొన్ని డిటెక్టివ్ యుగంధర్ దగ్గరకు వస్తాయి. ఆయన డీల్ చేద్దామనుకునేలోగా ఆయన అసిస్టెంట్ రాజు, కాత్యా లను కూడా కిడ్నాప్ అవుతారు. అలా చేసింది 303 అనే వ్యక్తి. తన జోలికి వచ్చి ఇన్విస్టిగేషన్ మొదలెడితే యుగంధర్ అసిస్టెంట్ లను ఇద్దరినీ చంపేస్తానని బెదిరిస్తాడు. రిటైర్మెంట్ ప్రకటన ఇవ్వమంటాడు. వేరే దారిలేని పరిస్దితుల్లో యుగంధర్ తను రిటైర్మెంట్ ప్రకటన ఇస్తాడు. అంతేకాదు ఆయన ఈ కేసుల్లో ఇన్వాల్వ్ కాకుండా ఎప్పటికప్పుడు 303 పర్యవేక్షించి బెదిరిస్తూంటాడు. అప్పుడు యుగంధర్ ఏం ఎత్తు వేసి 303 ని చిత్తు చేసాడు. ఆ కథలో ఎస్వీ రంగారావుకి చోటెక్కడ ఉంది అనేది ఇంట్రస్టింగ్ ఎలిమెంట్. పుస్తకం ఆపకుండా చదివిస్తుంది.

ఇక కొమ్మూరి సాంబశివరావుగారు 1957-80ల మధ్య ఆయన ఈ నవలలు అన్ని రాయటం జరిగింది. ఆయన రచనలను చూసి ప్రముఖ ఆంగ్ల రచయిత ఎడ్గార్‌ వాలెస్‌ సైతం ఎంతో ఉత్తేజితుడయ్యారని చెప్తారు. అలాగే ఆయన రచనలంటే మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు ఎంతగానో ఇష్టపడేవారు. ఆయన డిటెక్టివ్‌ నవల థ్రిల్లర్‌ 888 అప్పట్లో పెద్ద సెన్సేషన్. . ఆ నవల ఎందరో డిటెక్టివ్‌ నవలా రైటర్స్ ని తయారు చేసింది. ఆ తర్వాత ఆయన ‘చావు తప్పితే చాలు’ అనే హారర్‌ నవలను కూడా సెన్సేషన్. ఈ నవలల ఆధారంగానే అప్పట్లో కొన్ని డిటెక్టివ్‌ సినిమాలు కూడా వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన నవలా కథతో వచ్చిన సినిమాలో నటించారు.

ఇక ఎస్వీఆర్.. భారతదేశం (India) నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడి (Best Actor) బహుమతి పొందిన వ్యక్తి. దుర్యోధనుడు, కీచకుడు, రావణుడు, మైరావణుడు, ఘటోత్కచుడు, కంసుడు, భీష్ముడు ఈ పాత్రలకు ప్రాణం పోసారు. ఎస్.వి. రంగారావు వాళ్లు ఎలా వుంటారో మన తరానికి కళ్లకుకట్టేలా చూపించారు. . ‘పాతళభైరవి’లో మాంత్రికుడి పాత్రకి ఇప్పటికీ జనం నీరాజనాలర్పిస్తూనే ఉన్నారు. ఈ పాత్రకు ఆయన తప్ప సరిపోయే మరో నటుడే లేరనేది నిజం. ఘూట్లే’, ‘డోంగ్రే’, ‘కత్తుల రత్తయ్యని-పచ్చి రక్తం తాగుతా’ లాంటి డైలాగులు ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉన్నాయి.

Read More
Next Story