కాళరాత్రి  OTT మూవీ రివ్యూ!
x

'కాళరాత్రి' OTT మూవీ రివ్యూ!

మ‌ల‌యాళంలో రిలీజైన ఫ‌స్ట్ స్లాష‌ర్ హార‌ర్ మూవీ న‌ల్ల నిళ‌వుల‌ రాత్రి . హీరోయిన్ లేకుండా అంద‌రూ మేల్ క్యారెక్ట‌ర్స్‌తోనే ద‌ర్శ‌కుడు ప్ర‌యోగాత్మ‌కంగా ఈ మూవీని తెర‌కెక్కించాడు.

మ‌ల‌యాళంలో రిలీజైన ఫ‌స్ట్ స్లాష‌ర్ హార‌ర్ మూవీ న‌ల్ల నిళ‌వుల‌ రాత్రి . హీరోయిన్ లేకుండా అంద‌రూ మేల్ క్యారెక్ట‌ర్స్‌తోనే ద‌ర్శ‌కుడు ప్ర‌యోగాత్మ‌కంగా ఈ మూవీని తెర‌కెక్కించాడు. ఈ చిత్రం మంచి ప్రయోగంగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమా ఇప్పుడు తెలుగులోకి కాళరాత్రి టైటిల్ తో డబ్బింగ్ అయ్యి ఓటిటిలోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది..తెలుగు వారికి నచ్చే కంటెంట్ ఉన్న సినిమానేనా , కథేంటి వంటి విషయాలు చూద్దాం.

కథ:

కేరళలలో ఉన్న కురియన్ (బాబూ రాజ్) కి వ్యాపారం పెద్దగా కలిసి రాదు. అప్పులు పాలై ఉంటాడు. అతనికి కర్ణాటక లోని 'షిమోగా' లో 266 ఎకరాల తోట ఉంటుంది. దాన్ని తన దూరపు బంధువైన అచ్చాయన్ (సాయికుమార్) దగ్గర 3 కోట్లకు తాకట్టుపెడతాడు. ఆ తోటను తాకట్టు నుంచి విడిపించమని భార్య కోరుతూంటుంది. ఆ టైమ్ లో తన తనతో పాటు చదువుకున్న స్నేహితులు కలుస్తారు. వాళ్లు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ బాగానే సంపాదిస్తూంటారు. దాంతో ఆ తోటను వాళ్లకు అమ్మి తన అప్పులు తీర్చుకోవాలనుకుంటాడు.

ముందుగా వాళ్లకు ఆ తోటను చూపెట్టాలనుకుంటాడు. వాళ్లందరికీ ఆ తోట మధ్యలో ఓ పాతకాలం బంగ్లా ఉందని, దాన్ని చూడటానికి వెళ్దామని చెప్తాడు. ప్రెండ్స్ డొమినిక్ (జీను జోసెఫ్),జోషి (బిను పప్పు), పీటర్ (రోనీ డేవిడ్) ని తీసుకుని అక్కడికి వెళ్తాడు. అయితే వాళ్లు తమ పాత ప్రెండ్ ఇడుంబన్ (చెంబన్ వినోద్ జోస్) కూడా కర్ణాటకలోనే ఉన్నాడు కాబట్టి అతన్ని పిలుద్దామంటారు. కానీ కురియన్ కు అతన్ని పిలవటం ఇష్టం ఉండదు. మొత్తానికి చీకటి పడే టైమ్ కు ఆ తోటను చేరుకుంటారు. పార్టీ మొదలెడతారు. కానీ ఊహించని విధంగా అక్కడకి ఇడుంబన్ వస్తాడు. కురియన్ కు కోపం వస్తుంది , కానీ బాగోదని సైలెంట్ గా ఉంటాడు. పార్టీ ఊపందుకుంటుంది.

ఈ లోగా తమ స్నేహితులతో ఒకరు బయిటకు వెళ్లి దారుణంగా చంపబడతాడు. దాన్నుంచి తేరుకునేలోగా మరొకరు చంపబడతారు. దాంతో టెర్రర్ మొదలవుతుంది. అసలు ఎవరు తమలో హత్యలు చేస్తున్నదో ఎవరికి అర్దం కాదు. ఒకరిని చూసి మరొకరు భయపడుతూంటారు. చేతికి అందిన ఆయుధం తీసుకుని ఒకరి వెనక మరొకరు పడతారు. అసలు చంపుతున్నది ఎవరు..తమలో వాడా లేక బయిటవాడా..అసలేం జరుగుతోంది. చివరికి ఆ హత్యలు చేసే వాడిని పట్టుకున్నారా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

వాస్తవానికి ఇలాంటి సర్వైవల్ స్టోరీలు హాలీవుడ్ సినిమాలను రెగ్యులర్ గా చూసేవారికి బాగా పరిచయమే. ఇలాంటి కథల్లో కిల్ల‌ర్ నుంచి ప్రధానపాత్రలు ఎలా త‌ప్పించుకుంటార‌న్న‌ది ఎంత గ్రిప్పింగ్‌గా రాసుకుంటే క‌థ అంత ర‌క్తి క‌డుతుంది. మైండ్‌బ్లోయింగ్ ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో ఇలా కూడా జ‌రుగుతుందా అని ఆడియెన్ అనుకునేలా స‌ర్‌ప్రైజ్ చేయగలిగినప్పుడే వర్కవుట్ అవుతాయి. అప్పుడే ఈ స‌ర్వైవ‌ల్ మూవీస్ ఆక‌ట్టుకుంటాయి. కానీ ఈ దర్శకుడు దగ్గర ఇలాంటి సినిమాలకు సరపడ కథ,స్క్రీన్ ప్లే లేదు. ఎత్తుగడ బాగానే ఉంది కానీ దాన్ని అంతే టెంపోగా కొనసాగించలేకపోయాడు. తీసుకున్న చిన్న పాయింట్ ని విస్తరించటానికి ద‌ర్శ‌కుడు అష్ట‌క‌ష్టాలు ప‌డ్డాడు.

ఓ టైమ్ లో ఇది సినిమానా లేక సీరియ‌ల్‌గా అనిపించే విధంగా సాగ‌దీశాడు. దానికి తోడు సినిమా ప్రారంభంలో ఆర్గానిక్ ఫార్మింగ్ బిజినెస్ క్లాస్‌లా ఉంటుంది. స్నేహితుల మ‌ధ్య గొడ‌వ‌లు, ఒక‌రిని మ‌రొక‌రు మోసం చేస్తూ వేసే ఎత్తుల్లో ఇంట్రస్ట్ లేదు. ఏదైమైనా ఇలాంటి సినిమాలు హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఆడియన్స్ లిమిట్ అయిపోతారు.అదే ఈ సినిమా కు జరిగిందా అనిపిస్తుంది. ఎందుకంటే క్లైమాక్స్ మొత్తం రక్త పాతంతో నింపేసారు. దీన్ని ఫ్యామిలీలతో చూడటం కష్టమే. స్నేహతులలో ఏ ఒక్కరూ దారితప్పినా అందరూ ప్రమాదంలో పడతారనే ఒక మెసేజ్ మాత్రం సినిమా ద్వారా ఇవ్వగలిగారు.

టెక్నికల్ గా ...

సినిమాటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఎడిటింగ్ మంచిగానే కుదరాయి. డైరక్టర్ మాత్రం జానర్ కు సరైన న్యాయం చేయలేకపోయారు. చాలా చోట్ల తడబడ్డారు. ఇరుంబ‌న్‌గా మాస్ క్యారెక్ట‌ర్‌లో చెంబ‌న్ వినోద్ జోస్ క‌నిపించాడు . ఇక కురియ‌న్‌గా బాబురాజ్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. మిగిలిన వారి న‌ట‌న జస్ట్ ఓకే అనిపిస్తుంది.తెలుగు డ‌బ్బింగ్ బాగుంది. రన్ టైమ్ రెండు గంట‌లే అవటం పెద్ద ప్లస్ పాయింట్

చూడచ్చా...

ఎంటర్టైన్మెంట్ పాళ్లు ఏ మాత్రం లేని ఈ తరహా కథలను ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే చూడగలరు. హారర్ థ్రిల్లర్ సినిమాలు చూడటానికి ఇష్టపడేవారికి ఇది నచ్చుతుంది. మిగతావాళ్లు దీన్ని స్కిప్ చేసేయచ్చు

ఎక్కడ చూడచ్చు

ఆహా ఓటిటిలో తెలుగులో ఉంది.

Read More
Next Story