
హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో స్పేస్ జర్నీ చేసిన సునీతా విలియమ్స్
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా, విన్నా సునీతా విలియమ్స్ కు చెందిన వార్తలే.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా, విన్నా సునీతా విలియమ్స్ కు చెందిన వార్తలే. కబుర్లే. సుదీర్ఘ నిరీక్షణ ఫలించి ఎట్టకేలకు అంతరిక్షం నుంచి భూమి మీదకి చేరుకున్నారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), మరో వ్యోమగామి బుచ్ విల్మోర్. వీరిని రోదసి నుంచి తీసుకొచ్చిన స్పేస్‌ఎక్స్ వ్యోమనౌక బుధవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరింది.
కేవలం 8 రోజుల యాత్ర కోసం గతేడాది జూన్ 5న ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సునీత, విల్మోర్.. చివరకు ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి రావడం గమనార్హం. దీంతో యావత్ ప్రపంచం వీరికి సాదర స్వాగతం పలికింది. వీరి రాకపై చిన్న,పెద్దా అనే తేడా లేకుండా అందరూ సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన విశేషాలు వైరల్ అవుతున్నాయి.
సునీతా విలియమ్స్ స్పేస్ ట్రావెలింగ్ కు సోర్స్ ఆఫ్ ఇన్సిప్రేషన్ ఏమటనే విషయం గాలిస్తున్నారు. అయితే చాలా మందికి తెలియని ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే ఆమె స్పేస్ కలకు ప్రేరణ ఓ హాలీవుడ్ చిత్రం అంటే నమ్ముతారా. అదే టామ్ క్రూయిజ్ నటించిన ఐకానిక్ చిత్రం టాప్ గన్.
1986 వ సంవత్సరం లో హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూయిజ్ నటించిన టాప్ గన్ మూవీ అప్పుడు భాక్సాఫీస్ సూపర్ హిట్. ఆ సినిమాలో టామ్ క్రూయిజ్ నేవల్ ఏవియేటర్ పాత్రలో కనిపిస్తారు. సునితా విలియమ్స్ ఆ సినిమా చూసిన తరువాత ఒకసారి తన సోదరుడు జయ్‌ను కలవడానికని అమెరికా నేవల్ అకాడమికి వెళ్లారు. అక్కడ వారి వర్క్ స్టైల్ చూశాకా ఆమెలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. అంతకాలం వెటనరీ డాక్టర్ ( పశువైద్యురాలు) అనుకున్న ఆలోచనలోంచి నేవల్ ఏవియేటర్ ఫైటర్ అవ్వాలనే ఆలోచన వైపు షిఫ్ట్ అయ్యారు. ఆ తరువాత ఆమె నేవల్ ఏవియేషన్ ట్రైనింగ్ కమాండ్‌లో జాయిన్ అయ్యారు.
1989 లో అమెరికా నేవీలో నేవల్ ఏవియేటర్ గా చేరారు. హెలీక్యాప్టర్ ద్వారా సైన్యం తరలింపులో, ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు మానవ సహాయం అందించడంలో కీలక పాత్ర పోషించారు. అక్కడ పదేళ్లపాటు పనిచేసిన తరువాత ఆమె ఫోకస్ నాసాపై మళ్లింది.
ఈ విషయాలను 2018లో ఇండియాకు వచ్చినప్పుడు ఇక్కడ మీడియాతో షేర్ చేసుకుంది. తాను టామ్ క్రూయిజ్ టాప్ గన్ చూసి లెజండరీ ఫైటర్ అవ్వాలనుకున్నానని అంది. ఆ సినిమానే తనను ఏవియేషన్ వైపు, ఆతర్వాత స్పేస్ వైపు నడిపించిందని అంటారామె.
సునీత విలియమ్స్ భూమ్మీద అడుగుపెట్టగానే అటు అమెరికా.. ఇటు భారత్‌లోనూ సంబరాలు అంబరాన్నంటాయి.గుజరాత్‌తోపాటు.. పలు రాష్ట్రాల్లో టపాసులు కాల్చి పండగ చేసుకున్నారు.
కాగా.. సునీతా విలియమ్స్ క్రూ9 వ్యోమగాములు దివి నుంచి భువిపై కి అడుగుపెట్టడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.. క్రూ9 తిరిగి స్వాగతం.. భూమి మిమ్మల్ని మిస్ అయింది.. అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.