ఆ పొరపాటే  OTT ఇండస్ట్రీని సర్వ నాశనం చేస్తోందా?
x

ఆ పొరపాటే OTT ఇండస్ట్రీని సర్వ నాశనం చేస్తోందా?

తాత్కాలిక సేఫ్టీనా? లేక దీర్ఘకాల క్రియేటివ్ బ్లాకా?

గత ఐదు సంవత్సరాల్లో భారతీయ OTT మార్కెట్ అద్భుతమైన ఎక్స్‌పాన్షన్ చూసిన సంగతి తెలిసిందే. Jio విప్లవం తరువాత డేటా చౌక అవ్వడం, హై-స్పీడ్ ఇంటర్నెట్ విస్తరణ, పాండెమిక్‌లో థియేటర్‌లు మూసుకుపోవడం — ఇవన్నీ కలిపి, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ లను దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరేలా చేశాయి. అయితే అదే సమయంలో ఇండియన్ OTT మార్కెట్‌ ఒక ఆందోళనకరమైన దశలోకి ప్రయాణం పెట్టుకుంది. హాలీవుడ్, కొరియన్ డ్రామాలు, స్పానిష్ థ్రిల్లర్స్ నుంచి తీసుకున్న సక్సెస్ ఫార్ములాలను "రిస్క్ ఫ్రీ"గా అనుకరించడం ప్రొడ్యూసర్ల కొత్త స్ట్రాటజీగా మారింది. కానీ ఇది తాత్కాలిక సేఫ్టీనా? లేక దీర్ఘకాల క్రియేటివ్ బ్లాకా?

స్ట్రాటజీ vs సస్టెయినబిలిటీ

OTT ప్లాట్‌ఫారమ్‌లకు మోడల్ సింపుల్ — "ప్రూవెన్ కంటెంట్ = గ్యారంటీడ్ ఆడియన్స్". ఉదాహరణకు, BBC సిరీస్‌ల రీమేక్‌లు, లేదా పాపులర్ వెస్ట్రన్ షోలకి "దేశీ వెర్షన్"లు తీసుకురావడం ద్వారా సబ్‌స్క్రైబర్ ఎంగేజ్‌మెంట్ తాత్కాలికంగా పెరుగుతుంది. కానీ ఇక్కడ ఒక బిజినెస్ రిస్క్ ఉంది:

"బ్రాండ్ లైఫ్‌టైమ్ విలువ (LTV) క్రియేటివిటీతోనే నిలుస్తుంది. కాపీ పేస్ట్‌తో కస్టమర్ లైఫ్‌సైకిల్ తగ్గిపోతుంది."

గ్లోబల్ పర్స్పెక్టివ్

Netflix, HBO, Amazon Prime వంటి ప్లాట్‌ఫారమ్‌లు మొదట్లో అదే చేశారు — రీమేక్‌లు, ఫార్మాట్‌లు ట్రై చేశారు. కానీ వారికీ ఒక దశలో "ఆర్గానిక్ ఐడెంటిటీ" క్రియేట్ చేయకపోతే గ్లోబల్ రేసులో నిలబడలేమనే రియలైజేషన్ వచ్చింది. Stranger Things, Squid Game, Money Heist వంటి ఒరిజినల్ క్రియేషన్స్ వాళ్ల సబ్‌స్క్రైబర్ గ్రోత్‌లో మలుపు తిప్పాయి.

ఇండియా స్పెసిఫిక్ సమస్య

మన మార్కెట్‌లో 2 రకాల OTT ఆడియన్స్ ఉన్నారు: Mass Comfort Viewers – ఇప్పటికే ఫేమస్ అయిన స్టోరీలు, సేఫ్ ఫార్ములాల్ని ఇష్టపడేవారు. Content Hunters – కొత్త న్యారేటివ్స్, ఎక్స్‌పెరిమెంట్స్ కోసం వెతికేవారు. మొదటి సెట్ వల్ల రీమేక్‌లకు ఇమిడియేట్ సక్సెస్ వస్తుంది. కానీ రెండో సెట్ వల్లే లాంగ్-టర్మ బ్రాండ్ లాయల్టీ వస్తుంది.

ఫైనాన్షియల్ యాంగిల్

OTT మార్కెట్లో కంటెంట్ డెవలప్మెంట్ ఖర్చు ఎక్కువ. ఒక కొత్త ఐడియా ఫెయిల్ అయితే నష్టం పెద్దది. అందుకే కాపీ-పేస్ట్ సేఫ్. కానీ ఇది ఇన్వెస్టర్లకు short-term ROI ఇస్తే, long-term market cap తగ్గిస్తుంది.

కానీ "మార్కెట్ లీడర్ కావాలంటే రిస్క్ తీసుకోవాలి, ఫాలోవర్ అయితే కాపీ చాలదు."

ఇక 2025 నాటికి ఈ మార్కెట్ $13 బిలియన్ దాటుతుందని PwC రిపోర్ట్ చెబుతోంది. అయితే ఈ స్పీడు గ్రోత్ ఒక క్రియేటివ్ ఛాలెంజ్ ని విసురుతోంది. “ఓరిజినల్ కంటెంట్” తక్కువై, “కాపీ-పేస్ట్” మోడ్ పెరగడం. దాంతో ఓటిటిలలో వెబ్ సీరిస్ ల మీదా జనాలకు మెల్లిగా ఇంట్రస్ట్ తగ్గిపోవటం మొదలైంది. ఓటిటిలలో వచ్చే కొత్త సినిమాలకు ఉన్న డిమాండ్ ఒరిజనల్ వెబ్ సీరిస్ లకు ఉండటం లేదు.

బిజినెస్ పరంగా చూస్తే, ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు “Risk-averse economy” లో ఉన్నాయి. Netflix, Prime, Disney+ Hotstar లాంటి పెద్ద ప్లేయర్లు “Safe bets” కి మాత్రమే డబ్బు పెట్టే దశకు వచ్చాయి. ఇది హాలీవుడ్ లోనూ కనిపించింది — ఒక IP (intellectual property) ఒకసారి హిట్ అయ్యాక, దాన్ని spin-offs, remakes, franchises రూపంలో పాలు పితికినట్టు పితికేస్తారు.

భారతీయ ఓటిటి కూడా అదే దారిలో వెళ్తోంది:

Panchayat, Mirzapur, Family Man లాంటి హిట్స్ మళ్లీ మళ్లీ వస్తున్నాయి, కొత్త కథల కంటే సీజన్ extensions పై పెట్టుబడి పెడుతున్నారు.

కారణం సింపుల్ — కొత్త కథ introduce చేయడం అంటే marketing, star casting, promotion ఖర్చు చాలా ఎక్కువ. కానీ already తెలిసిన characters తో sequel అంటే, audience acquisition cost తక్కువ, retention ఎక్కువ.

అందుకు కారణం ఏమిటి

1. ఫ్రాంచైజ్ అలసట – ఒరిజినల్ తనకే కాపీ అవ్వడం

ఉదాహరణకు OTTలో మొదటిసారి వచ్చిన పంచాయత్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. గ్రామీణ జీవన శైలి, నెమ్మదిగా నడిచే కథనం, relatable పాత్రలు – ఇవన్నీ ఫ్రెష్‌గా అనిపించాయి. కానీ సీజన్ 4కి వచ్చేసరికి, అదే యూనివర్స్‌లో కొత్తదనం తగ్గిపోయింది. ఇది కేవలం భారతీయ OTTకే కాదు — అమెరికాలో House of Cards, Money Heist లాంటి షోల చివరి సీజన్లకు కూడా ఇదే సమస్య వచ్చింది.

"Creativity without reinvention becomes self-cannibalisation." — Reed Hastings, Netflix Co-Founder

ఒరిజినల్‌గా మొదలైన కంటెంట్, సీజన్ తర్వాత సీజన్ వచ్చేటప్పుడు, ఒక దశలో తనదైన మ్యాజిక్ కోల్పోయి, తనకు తనే ఓ కాపీలా అనిపించవచ్చు.

2. రీమేక్ ఎకానమీ – రిస్క్ మేనేజ్‌మెంట్ లేదా క్రియేటివ్ లేజినెస్?

ఈ మధ్యకాలంలో వెబ్ సీరిస్ లలోనూ ఒరిజినాలిటి తగ్గింది. రీమేక్ లు పెరిగాయి. అంతెందుకు Ray Donovan ను Raina Naidu అనే వెబ్ సీరిస్ గాను, Monk ను Mistry అనే వెబ్ సీరిస్ గా రీమేక్ చేయడం OTTలకు రిస్క్-ఫ్రీ బిజినెస్ మోడల్. అయితే ఈ రీమేక్ లలో వచ్చే నష్టాలు ,లాభాలు చూస్తే...

ఇప్పటికే ప్రూవన్ IP అనేది ప్లస్ అయ్యే విషయం. అలాగే ఒక చోట హిట్టైన సీరిస్ లను లోకల్ కల్చర్‌కి మార్చి కొత్త మార్కెట్‌లో అమ్మడం ద్వారా ప్రొడక్షన్ ఖర్చు తగ్గించడం అనేది జరుగుతుంది. అయితే ఇలా చేయటం వల్ల వచ్చే పెద్ద సైడ్ ఎఫెక్ట్ — కొత్త కథలు, కొత్త వాయిస్‌లు వచ్చే అవకాశాలు తగ్గిపోవడం.అలాగే రీమేక్ ఎంత నేటివైజ్ చేసినా అవి ఒరిజనల్ సీరిస్ లో ఉన్న కథా ప్రపంచాన్ని గుర్తు చేయటం. అలాగే ఒరిజినల్ సీరిస్ చూసిన వారికి ఈ కొత్త రీమేక్ సీరిస్ పట్ల ఆసక్తి లేకపోవటం.

"Safe bets keep your lights on; bold bets build your legacy." — Ted Sarandos, Netflix Co-CEO

ఇక్కడే The Hunt: The Rajiv Gandhi Assassination Case వంటి షోలు భిన్నంగా నిలుస్తాయి. ఇవి పాత సంఘటనను కొత్త ఫిల్మ్‌మేకింగ్ భాషలో, ఫ్యాక్ట్స్‌కి నమ్మకంగా చెప్పడం ద్వారా విలువ సృష్టిస్తాయి.

3. టాలెంట్ డెమోక్రటైజేషన్ – OTT యొక్క అసలు USP

OTT ఎకోసిస్టమ్‌లో పెద్ద ప్లస్ పాయింట్ — పెద్ద సినిమాల్లో సైడ్‌లో ఉండే యాక్టర్స్, ఇక్కడ మెయిన్ గేమ్ ప్లే చేస్తున్నారు. OTT ప్లాట్‌ఫార్ములు అందిస్తున్న పెద్ద బెనిఫిట్ – అండర్‌రేటెడ్ టాలెంట్‌కు లీడ్ రోల్స్. అశోక్ పాఠక్ (పంచాయత్), సాహిల్ వైద్ (The Hunt) – వీళ్లు థియేటర్ రిలీజ్ మూవీస్‌లో సైడ్ రోల్స్‌లోనే ఉండేవారు. కానీ ఇక్కడ కథను డిఫైన్ చేస్తున్నారు. ఇది థియేటర్‌లో సాధ్యం కాని విషయం. OTT వల్లనే ఈ “టాలెంట్ డెమోక్రసీ” వచ్చింది.

"In streaming, niche actors can create mainstream moments." — Shonda Rhimes, Producer

4. మార్కెట్ భవిష్యత్తు – స్మాల్ స్క్రీన్ లీడర్‌షిప్

PwC, EY వంటి రిపోర్ట్‌ల ప్రకారం, వచ్చే ఐదేళ్లలో థియేట్రికల్ రెవెన్యూ కంటే OTT రెవెన్యూ వేగంగా పెరుగుతుంది. కానీ ఇది జరగాలంటే:

ఒరిజినల్ స్టోరీటెల్లింగ్

రిస్క్-టేకింగ్ కల్చర్

ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్

"Audiences don’t just consume content; they consume novelty." — Kevin Mayer, Former Disney+, TikTok Exec

ప్రస్తుత OTT ముఖచిత్రం మనకు రెండు పాఠాలు చెబుతోంది —

ఫ్రాంచైజ్ మిల్కింగ్ తాత్కాలికంగా మంచి బిజినెస్ ఇవ్వొచ్చు, కానీ లాంగ్-టెర్మ్‌లో క్రియేటివ్ బ్రాండ్ వాల్యూ తగ్గిస్తుంది.

రిస్క్ తీసుకున్న, కొత్తదనం ఉన్న కంటెంట్ మాత్రమే గ్లోబల్ మార్కెట్లో భారతీయ OTTకి లెగసీ ఇస్తుంది.

“బిగ్ స్క్రీన్ ఇప్పుడు క్యాచ్ అప్ కావాలి… అసలు ఇండస్ట్రీని నిలబెట్టేది చిన్న తెరే.”

ఫైనల్ గా ..

ఇండియన్ OTT ఈ "కాపీ పేస్ట్ ఎరా" నుంచి బయటపడాలి. గ్లోబల్ మార్కెట్‌లో మన కంటెంట్ వాయిస్ వినిపించాలంటే "సేఫ్టీ"ని విడిచిపెట్టి, క్రియేటివ్ కరేజ్" చూపాలి. లేదంటే మన ప్లాట్‌ఫారమ్‌లు కేవలం సబ్‌టైటిల్స్ మార్చిన కంటెంట్ లైబ్రరీగా మిగిలిపోతాయి.

Read More
Next Story